For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విజయదశమికి సంబంధించిన కథలు

విజయదశమికి సంబంధించిన అనేక కథలను చదవండి.

|

బిజోయదశమి లేదా విజయదశమి దసరా పండగ ఉత్సవాలలో ఆఖరిరోజు. దసరా పండగను దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో, రూపాల్లో జరుపుకున్నా, కలకత్తా ఉత్సవాలు చాలా ప్రసిద్ధమైనవి.

తూర్పు భారతంలో అతిముఖ్య పండగలలో దుర్గాపూజ ఒకటి. ఈ సమయంలో పశ్చిమ బెంగాల్ కొన్ని విలాసవంతమైన ఉత్సవాలకి ఇల్లుగా మారుతుంది. ముంబై గణేష పూజకి ప్రసిద్ధి అయినట్లు, కోల్ కతా దుర్గాపూజకి ప్రసిద్ధి.

దుర్గా పూజలో ప్రాతినిధ్యం వహించిన 9 ఆచారాలు:నవరాత్రి స్పెషల్దుర్గా పూజలో ప్రాతినిధ్యం వహించిన 9 ఆచారాలు:నవరాత్రి స్పెషల్

దసరా ఉత్సవాలలో ఆఖరిరోజున విజయదశమిగా జరుపుకుంటారు.అశ్విన్ నెలలో పదవరోజున, దశమి తిథినాడు దీన్ని జరుపుకుంటారు. 2017 సంవత్సరంలో విజయదశమి సెప్టెంబరు 30న వస్తుంది. ఆరోజు శనివారం, విజయ ముహుర్తం 14.14 నుంచి మొదలయ్యి 15.02 వరకు మొత్తం 47 నిమిషాలు ఉంటుంది. అపహరణ పూజ సమయం 13.27కి మొదలై 15.50 వరకూ మొత్తం 2గంటల 23నిమిషాలు ఉంటుంది.

విజయదశమిని అందరూ కలిసి జరుపుకుంటారు. అన్ని వర్గాల వారు కలిసి ఒకచోట చేరి అమ్మవారికి ఘనంగా వీడ్కోలు పలుకుతారు. అమ్మవారి భక్తులు తొమ్మిదిరోజులు అమ్మవారిని అన్నిరూపాలలో నిష్ఠగా పూజలు చేసి విజయదశమినాడు భక్తి,శ్రద్ధలతో వీడ్కోలు పలుకుతారు.

దుర్గా పూజలోని 5 రోజుల ప్రాముఖ్యత(మహా షష్ఠి, సప్తమి, అష్ఠమి,నవమి, దశమి)దుర్గా పూజలోని 5 రోజుల ప్రాముఖ్యత(మహా షష్ఠి, సప్తమి, అష్ఠమి,నవమి, దశమి)

దేశంలోని ఇతరపండగలలాగానే, విజయదశమికి కూడా అనేక పురాణ, జానపద కథలున్నాయి. విజయదశమి సందర్భంగా, ఆ కథలేంటో చూద్దాం.

మహిషాసురుడి అంతం

మహిషాసురుడి అంతం

విజయదశమికి సంబంధించిన ప్రసిద్ధ కథ మహిషాసురుడనే రాక్షసుడు మరియు దుర్గాదేవిది. కథప్రకారం, మహిషాసురుడనే రాక్షసుడు తరచూ గేదె రూపంలో ఉండేవాడంట. ఏ మనిషి లేదా దేవుడు తనని చంపలేడనే వరం కూడా కలిగిఉన్నాడు. ఈ వరం వల్ల తనకి చావే ఉండదని భావించేవాడు. అందుకని గర్వంతో మూడులోకాలను ముప్పతిప్పలు పెట్టేవాడు.

ఈ మూడులోకాల ప్రాణులు ఈ రాక్షసుడి నుంచి విముక్తి కావాలని తపించాయి. దానికి ఫలితంగా, అమ్మవారు దుర్గాదేవి రూపంలో అవతరించింది. దుర్గ రూపం భయంకరంగా, అదే సమయంలో భయం తొలగించేదిగా కూడా ఉంది. ఆమె తన వాహనం సింహంపై కూర్చుని పది చేతుల్లో భయంకర ఆయుధాలతో కదిలి వెళ్ళింది.

ఈ రూపంలో, మహిషాసురుడితో అమ్మవారు పోరాడింది. విజయదశమినాడే మహిషాసురుడు ఓడిపోయి చంపబడ్డాడు.

రావణుడి ఓటమి

రావణుడి ఓటమి

విజయదశమి ఉత్సవాలు రాక్షసుల రాజు రావణుడి ఓటమికి కూడా ప్రతీక. ఈ విజయదశమి నాడే శ్రీరాముడు దుష్టుడైన రావణుడిని చంపి తన భార్య సీతను రక్షించాడు. దీన్నే దేశంలో వివిధ చోట్ల దసరాగా కూడా జరుపుకుంటారు.

పాండవుల వనవాసం ముగింపు

పాండవుల వనవాసం ముగింపు

పాండవులు కౌరవులతో జూదంలో ఓడిపోయి 12ఏళ్ళు వనవాసం, 1ఏడాది అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. విజయదశమినాడు వారి అజ్ఞాతవాసం ఆఖరిరోజై, వనవాసం పూర్తయ్యి పాండవులు తిరిగి రాజ్యానికి వచ్చారు.

పరమశివునితో దుర్గా అమ్మవారి తిరిగి కలయిక

పరమశివునితో దుర్గా అమ్మవారి తిరిగి కలయిక

విజయదశమినాడు అమ్మవారు తన అవతార లక్ష్యం పూర్తిచేసుకుని తిరిగి భర్త పరమశివుని చేరింది. మహిషాసురుడ్ని చంపాక తిరిగి పార్వతి రూపంలో తన ఇంటికి చేరింది. భక్తులు అమ్మవారిని 9రోజులు పూజించి, విజయదశమి నాడు విసర్జనం చేస్తారు. ఇదే కొత్త పెళ్ళికూతురు తిరిగి ఆరోజు భర్త ఇంటికి చేరే ఆచారంగా కూడా మారింది.

English summary

stories of bijoya dashami | stories of vijaya dashami | విజయదశమి కథలు । విజయదశమికి సంబంధించిన కథలు

Take a look at the stories of Vijaya Dashami
Desktop Bottom Promotion