For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పర పురుషుడిని కన్నెత్తి చూడని మహా పతివ్రత అరుంధతిపై అగ్నిదేవుడు కన్నేస్తాడు, అరుంధతి నక్షత్రం కథ

అగ్ని దేవుడి ఎదుట సప్త రుషులు యజ్ఞం చేపడుతారు. ఆ రుషుల భార్యలపై అగ్ని దేవుడు మోజు పడతాడు. ఈ విషయాన్ని అగ్ని దేవుడి భార్య అయిన స్వాహాదేవి గ్రహిస్తుంది.పర పురుషుడిని కన్నెత్తి చూడని మహా పతివ్రత అరుంధతి

|

హిందూ సంప్రదాయం ప్రకారం వివాహఘట్టంలో వధూవరులు అరుంధతి నక్షత్రాన్ని చూస్తారు. అయితే చాలా మందికి అరుంధతి నక్షత్రం గురించి అస్సలు తెలియదు. దాని నేపథ్యం ఏమిటనే విషయంపై చాలా మందికి అవగాహన ఉండదు. పవిత్రత అనే పదానికి పర్యాయరూపమే అరుంధతి. పతివ్రతల్లో ఈమె మొదటిస్థానంలో ఉంటారు. అందుకే నింగిలో చుక్కలా నిలిచిపోయింది. ఈమె ఎంతో అందగత్తె. మహాపతివ్రత.

ఇసుకను అన్నంగా తయారు చెయ్యగలరా

ఇసుకను అన్నంగా తయారు చెయ్యగలరా

అరుంధతి గురించి చాలా కథలున్నాయి. అందులో కొన్ని...

వశిష్ట మహర్షి గురించి వినే ఉంటారు. ఆయన పెళ్లి చేసుకోవాలని అంతటా తిరుగుతూ ఉంటాడు. ఒకసారి ఒక గ్రామంలో కన్నెలంతా అతన్ని చూడడానికి వచ్చారు. వసిష్టుడు కొంచెం ఇసుకను చేతిలోకి తీసుకున్నాడు. ఈ ఇసుకను ఎవరైనా సరే వండి అన్నంగా తయారు చెయ్యగలరా అని అడిగాడు. అయితే ఆ గ్రామంలోని అమ్మాయిల్లో ఎవ్వరూ అది సాధ్యం కాదని చెప్పారు.

ఇసుక అన్నంగా మారింది

ఇసుక అన్నంగా మారింది

పక్క గ్రామమైన మాల పల్లె నుంచి వచ్చిన ఒక అందమైన ఆడపడుచు పైకి లేచి నిలపడుతుంది. నేను చేస్తానండి అని అంటుంది. వెంటనే పొయ్యి వెలిగించి దానిపై కుండ పెట్టింది. ఎసరు బాగా మరిగిన తర్వాత అందులో ఇసుక వేసింది. ధ్యానం చేస్తూ వంట వడింది. ఇసుక అన్నంగా మారింది. వశిష్టుడికి కుండలోని అన్నం చూపించింది. ఆయనకు కూడా ఈ విషయం బోధపడలేదు. ఆమెనే అరుంధతి.

పెళ్లి చేసుకుంటేనే తింటాను

పెళ్లి చేసుకుంటేనే తింటాను

తర్వాత ఆ అన్నం తినమంటూ అరుంధతి వశిష్టుడికి వడ్డిస్తుంది. కానీ ఆయన తినడు. నన్ను పెళ్లి చేసుకుంటేనే తింటాను అంటాడు. తర్వాత అరుంధతి తల్లిదండ్రులతో మాట్లాడుతాడు వశిష్టుడు. వాళ్లను ఒప్పించి అరుంధతిని పెళ్లి చేసుకుంటాడు.

ఇక అరుంధతికి ఎంతో ఏకాగ్రత ఉంటుంది. ఒకసారి వశిష్టుడు తన కమండలం ఆమెకు ఇచ్చి బయటకు వెళ్తాడు. తాను వచ్చే వరకు కమండలం వైపే చూస్తూ ఉండమని చెబుతాడు. అరుంధతి తన భర్త వచ్చేవరకు దాన్నే చూస్తూ ఉండాలనుకుంటుంది. చాలా ఏళ్లు గడిచినా వశిష్టుడు రాడు. అయితే అరుంధతి మాత్రం దాని వంకే చూస్తూ ఉంటుంది.

పర పురుషుడిని కన్నెత్తి చూడని మహా పతివ్రత

పర పురుషుడిని కన్నెత్తి చూడని మహా పతివ్రత

అయితే ఈ విషయాన్ని గ్రహించిన కొందరు దేవతలు అమ్మా అరుంధతి మీ ఆయన ఇన్నేళ్లు అయినా తిరిగిరాలేదు. కాస్త ఇటు చూడమ్మా అంటారు. అయినా ఆమె చూపు మరల్చదు. కొన్ని ఏళ్ల తర్వాత వశిష్టుడు వచ్చి అరుంధతి అని పిలిస్తే అప్పుడు ఆయన వైపు చూస్తుంది. తన భర్తను తప్ప పర పురుషుడిని కన్నెత్తి చూడని మహా పతివ్రత అరుంధతి.

అగ్ని దేవుడి కోరిక తీరుస్తుంది

అగ్ని దేవుడి కోరిక తీరుస్తుంది

ఇక అగ్ని దేవుడి ఎదుట సప్త రుషులు యజ్ఞం చేపడుతారు. ఆ రుషుల భార్యలపై అగ్ని దేవుడు మోజు పడతాడు. ఈ విషయాన్ని అగ్ని దేవుడి భార్య అయిన స్వాహాదేవి గ్రహిస్తుంది. ఆ ఏడుగురి భార్యల మాదిరిగా తానే రోజుకొక అవతారం ధరించాలనుకుంటుంది. రోజుకొక రుషి భార్య అవతారం ఎత్తి తన భర్త అగ్ని దేవుడి కోరిక తీరుస్తుంది.

అరుంధతి పెద్ద ప్రతివత

అరుంధతి పెద్ద ప్రతివత

ఇక చివరి రోజు తాను అరుంధతి అనుభవించబోతున్నాననే ఆనందంలో ఉంటాడు అగ్నిదేవుడు. కానీ స్వాహాదేవి ఎంత ప్రయత్నించిన అరుంధతి అవతారంలోకి మారలేదు. అరుంధతి పెద్ద ప్రతివత కావడమే ఇందుకు కారణం. అందుకే ఆమె అరుంధతి నక్షత్రంగా మారి జగత్తుకు ఆందర్శంగా నిలిచింది. అరుంధతికి శక్తి అనే కుమారుడున్నాడు. శక్తి కమారుడే పరాశరుడు. పరాశరుడి కుమారుడే వ్యాసుడు. అలా ఎంతో గొప్ప చరిత్ర కలిగింది అరుంధతి నక్షత్రం.

English summary

The story of Arundhati nakshatra

The story of Arundhati nakshatra
Story first published:Monday, August 27, 2018, 15:56 [IST]
Desktop Bottom Promotion