For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భీమున్నే కౌగిలించుకుని చంపాలనుకున్న ధృతరాష్ట్రుడు, ధృతరాష్ట్రుడు నిజంగా దుర్మార్గుడా?

ధృతరాష్ట్రుడు ఎంత కుటిలత్వం కలవాడో భీముడిని కౌగిలించుకున్నప్పుడు తెలిసిపోతుంది. దుర్యోధనుడి తొడలను భీముడు విరగ్గొడుతాడు. దీంతో ధృతరాష్ట్రుడికి లోలోపల రగిలిపోతాడు.ధృతరాష్ట్రుడు.

|

పాండురాజు, ధృతరాష్ట్రుడు, విదురుడు భీష్ముడి దగ్గర పెరిగేవారు. ఈ ముగ్గురిని అన్ని విద్యల్లో ఆరితేరేలా చేశాడు భీష్ముడు. అయితే పట్టాభిషేకం మాత్రం ధృతరాష్ట్రుడికే చేయించాడు. విదురుడు మంచి పరాక్రమం కలిగిన వాడు కావడంతో రాజ్యాన్ని కాపాడేవాడు. ఇక ధృతరాష్ట్రుడికి భీష్ముడు పెళ్లి చేయాలనుకుంటాడు.

గాంధార రాజకుమారి అయిన గాంధారితో ధృతరాష్ట్రుడికి పెళ్లి నిర్ణయిస్తారు. గాంధారికి వందమంది కొడుకులు పుడతారని దీంతో వంశం పెద్దది అయిపోతుందని విధురుడు భావిస్తాడు. అందుకే ధృతరాష్ట్రుడికి ఆమెతో పెళ్లి చేయిస్తారు.

వంద మంది కన్యలతో

వంద మంది కన్యలతో

అలాగే గాంధారి 10 మంది సోదరీమణులతో, మరో వంద మంది కన్యలతో కలిసి ధృతరాష్ట్రుడికి అంగరంగ వైభవంగా వివాహం జరుగుతుంది. అలా 111 మందితో ధృతరాష్ట్రుడు హ్యాపీగా రాజ్యంలో ఉండేవారు. ధృతరాష్ట్రుడు అంటే దుర్మార్గుడు అనుకుంటారు. అవును దుర్మార్గుడే.. ఎందుకంటే ధర్మంలోనూ, అధర్మంలోనూ తన కొడుకులే గెలవాలనుకునే స్వార్థపరుడు కాబట్టి.

ధృతరాష్ట్రుడి భార్య గాంధారికి భర్త అంటే చాలా ఇష్టం

ధృతరాష్ట్రుడి భార్య గాంధారికి భర్త అంటే చాలా ఇష్టం

ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే గుడ్డివాడు. అయినా ఇతనికి నూరుగురు కొడుకులు ఉన్నారు. కౌరవులందరికీ తండ్రి అయిన ధృతరాష్ట్రుడికి ఒక ప్రత్యేక చరిత్రే ఉంది. ధృతరాష్ట్రుడి భార్య గాంధారికి భర్త అంటే ఎంత ఇష్టమంటే భర్తమాదిరిగానే తాను కూడా అంధకారంలో ఉండాలనుకునేంత ఇష్టం. నిజంగా అలాంటి భార్య ధృతరాష్ట్రుడికి దొరకడం అద్రుష్టమే. అందుకే జీవితాంతం ఆమె కళ్లకు గంతలు కట్టుకుంటుంది.

ధృతరాష్ట్రున్ని మెచ్చుకున్నారు

ధృతరాష్ట్రున్ని మెచ్చుకున్నారు

ధృతరాష్ట్రుడు విదురుడు మాటలను గౌరవించేవాడు. ఆయన చెప్పే ప్రతి మాటను వినేవాడు. ఇక ధృతరాష్ట్రుడికి తన కుమారులంటే చాలా ప్రేమ. వయస్సులో పెద్ద వాడు కావడం వల్ల ధర్మజునికే పట్టాభిషేకం చేయించాడు ధృతరాష్ట్రుడు. ఆ సమయంలో అంతా ధృతరాష్ట్రున్ని మెచ్చుకున్నారు.

పాండవులపై పగ పెంచుకున్నాడు

పాండవులపై పగ పెంచుకున్నాడు

అయితే ధృతరాష్ట్రుడు కొందరి మాటలు విని పాండవులపై పగ పెంచుకున్నాడు. ముఖ్యంగా శకుని చెప్పిన మాటలు ధృతరాష్ట్రుడు వినడం వల్లే పాండువులపై అతనికి కోపం పెరిగింది. అయితే ఆ కోపాన్ని మాత్రం ఎప్పుడూ బయటకు చూపించేవాడు కాదు. లోపల మాత్రం పాండవులంటే రగిలిపోయేవాడు. కానీ పైకి కనిపించడానికి నవ్వులు చిందించేవాడు.

కుటిలత్వం కొన్నిసార్లు బయటపడేది

కుటిలత్వం కొన్నిసార్లు బయటపడేది

ధృతరాష్ట్రుడు అందరికీ సమాన న్యాయం చేస్తున్నట్లు నటించేవాడు. అస్సలు పక్షపాతం పాటించనట్లు కనిపించేవాడు. కానీ అతని కుటిలత్వం కొన్నిసార్లు బయటపడేది. ఇక మహాభారతంలో సంజయుడుకి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. సంజయుడు రాయబారిగా పాండవుల వద్దకు వెళ్తాడు. అతను అక్కడ ఏమేమి మాట్లాడాడో ఆ విషయాలు మొత్తం చెబుతాడు. దీంతో తన కుమారులకు ఆపదలు ఎదురవుతున్నట్లు భావిస్తాడు ధృతరాష్ట్రుడు.

నేర్పరితనాన్ని నేర్పించేవాడు

నేర్పరితనాన్ని నేర్పించేవాడు

ధృతరాష్ట్రుడు కొడుకులకు నేర్పరితనాన్ని కూడా నేర్పించేవాడు. క్రిష్ణుడు రాయబారిగా వచ్చేటప్పుడు ఆయనకు అన్ని రకాల మర్యాదలు చేయమని కుమారులకు చెబుతాడు ధృతరాష్ట్రుడు. కానీ దుర్యోధనుడు మాత్రం తన తండ్రి మాటలు విని కోప్పడుతాడు. పాండవులకు సపోర్ట్ చేసే కృష్ణుడిని అస్సలు ఊరికే విడిచిపెట్టకూడదు. ఇక్కడే బంధించేయాలి అని కోప్పడుతాడు.. అయితే రాయబారులను ఎప్పుడూ కూడా అలా చేయకూడదని సలహా ఇస్తాడు ధృతరాష్ట్రుడు.

భీముడిని కౌగిలించుకున్నప్పుడు కుటిలత్వం తెలిసిపోతుంది

భీముడిని కౌగిలించుకున్నప్పుడు కుటిలత్వం తెలిసిపోతుంది

ధృతరాష్ట్రుడు ఎంత కుటిలత్వం కలవాడో భీముడిని కౌగిలించుకున్నప్పుడు తెలిసిపోతుంది. దుర్యోధనుడి తొడలను భీముడు విరగ్గొడుతాడు. దీంతో ధృతరాష్ట్రుడికి లోలోపల రగిలిపోతాడు. కానీ పైకి మాత్రం ఎలాంటి కోపం లేనట్లు నటిస్తాడు. భీమున్ని ప్రేమగా దగ్గరికి పిలుచుకుంటాడు. అయితే కృష్ణుడు ఈ విషయాన్ని గ్రహిస్తాడు. దీంతో భీముడి ప్లేస్ లో ఒక విగ్రహానికి ప్రాణం పోసి పంపుతాడు. అయితే అది తెలియని ధృతరాష్ట్రుడు ఆ విగ్రహాన్ని చాలా గట్టిగా కౌగిలించుకుంటాడు.

ధృతరాష్ట్రుడి కౌగిలి

ధృతరాష్ట్రుడి కౌగిలి

తన కొడుకు దుర్యోధనుడి తొడలు విరగొట్టినందుకు భీమున్ని కౌగిలించుకుని చంపేయాలనుకుంటాడు. దీంతో ధృతరాష్ట్రుడి కౌగిలిలో ఉన్న విగ్రహం నుజ్జు నుజ్జు అయిపోతుంది. అందుకే ఎవరైనా లోపల కోపం పెట్టుకుని పైకి మాత్రం ప్రేమగా దగ్గరికి తీసుకుంటే ఇది ధృతరాష్ట్రుడి కౌగిలి అంటూ ఉంటారు. దాని వెనుకు దాగి ఉన్న కథ ఇదే.

ఒక్క మంచి పని మాత్రం చేశాడు

ఒక్క మంచి పని మాత్రం చేశాడు

ధృతరాష్ట్రుడి కుమారులు ద్రౌపదిని నిండు సభలో అవమానపరుస్తుంటే ఒక్క మాట కూడా అనలేదు. కేవలం నిందించాడు. అక్కడే తెలుస్తుంది ఆయన పెద్దరికం. అయితే ఒక్క మంచి పని మాత్రం చేశాడు. ధర్మరాజు ను విడుదల చేసి, వారి అస్త్రాలు వారికి ఇప్పించాడు. అయితే ధృతరాష్ట్రుడికి ముందు చూపు కూడా ఉంది. కచ్చితంగా కురుక్షేత్ర యుద్ధంలో ఓడిపోతామని ధృతరాష్ట్రుడికి తెలుసు. అందుకే యుద్ధం వద్దని వారించాడు. కానీ దుర్యోధనుడు మాత్రం అస్సలు లెక్కచెయ్యలేదు.

ధృతరాష్ట్రుడు అన్యాయమే చేశాడు

ధృతరాష్ట్రుడు అన్యాయమే చేశాడు

ఇలా ధృతరాష్ట్రుడు మహాభారతంలో తన పాత్రను పోషించాడు. అయితే చివరకు తన తప్పులను తెలుసుకుని పశ్చాత్తాపం చెందుతాడు ధృతరాష్ట్రుడు. భారతంలో అతను తన కొడుకులను కాపాడుకునేందుకే అలా ప్రవర్తించాడు. తన కొడుకులు ఏం చేసినా సరే వారికే విజయం చేకూరాలని కోరుకున్నాడు. న్యాయంలోనూ, అన్యాయంలోనూ కొడుకుల పక్కను నిలబడ్డ ఒక గొప్ప తండ్రి అని అంటారు కానీ ఎదుటి వారికి మాత్రం ధృతరాష్ట్రుడు అన్యాయమే చేశాడు.

Image Credit

English summary

the story of dhritarashtra

the story of dhritarashtra
Desktop Bottom Promotion