For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ కాలం యువతకు ఆకాశంలోని ధ్రువ నక్షత్రం ఇస్తున్న సందేశం ఏమిటో తెలుసా?

ధ్రువుడి జీవితం చివరకు చేరుకుంటుంది. విష్ణుమూర్తి ధ్రువుడికిచ్చిన స్థానానికి చేరేందుకు పయనం అవుతాడు ధ్రువుడు. ఇది ధృవుడి కథ. ఈ విశ్వం ఉన్నంత వరకు అతనికి ప్రత్యేక స్థానం ఉంటుంది.

|

ఆకాశంలో ఒక నక్షత్రం ఉంటుంది. అది ఉత్తర దిక్కున ఉంటుంది. సప్తర్షి మండలంపై బాగా ప్రకాశిస్తూ వెలుగుతుంటుంది. అదే ధ్రువ నక్షత్రం. దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది. తండ్రి తొడ మీద కూడా కూర్చొడానికి స్థానంలోని ధ్రువుడు ధ్రువ తారగా ఎలా మారాడనేది నిజంగా ఆశ్యర్యపరిచే కథనే.

ఐదేళ్ల వయస్సు

ఐదేళ్ల వయస్సు

ధ్రువునికి అప్పుడు ఐదేళ్లు వయస్సు. అతని తండ్రి

ఉత్తాన పాదుడు కొలువులో కూర్చొని ఉండగా అతని తమ్ముడైనఉత్తముడు తండ్రి తొడపై కూర్చొన్నాడు. అయితే ధ్రువుడికి కూడా తండ్రి తొడపై కూర్చొవాలని అనిపించింది. వెంటనే తండ్రి దగ్గరకు వెళ్లి నేను కూర్చొంటాను నాన్నా అంటూ చేతులు చాచుతాడు.

వయసులో పెద్ద తేడా లేదు

వయసులో పెద్ద తేడా లేదు

ఉత్తముడికి ధ్రువుడికి వయసులో పెద్ద తేడా కూడా లేదు.

అయితే తన కొడుకు కూర్చున్న చోట ధ్రువుడు కూర్చొడానికి అర్హుడుకాడంటూ కోప్పడుతుంది సవతి తల్లి సురుచి. నా కడుపున పుట్టిన వాళ్లకే అక్కడ కూర్చొనే అవకాశం ఉందంటూ మండిపడుతుంది. తర్వాత ఆమె ధ్రువుడిని ఈడ్చి పాడేస్తుంది.

చిన్న భార్య సురుచి మాటకే విలువ

చిన్న భార్య సురుచి మాటకే విలువ

ధ్రువుడు తండ్రి ఉత్తాన పాదుడికి ఇద్దరు భార్యలు. ఒకరు

సునీతి. మరొకరు సురుచి. ధ్రువుడు పెద్ద భార్య సునీతి కొడుకు. అయితే రాజ్యంలో, ఇంట్లో మొత్తం చిన్న భార్య సురుచి మాటకే విలువ ఉండేది. దీంతో ఉత్తాన పాదుడు కూడా ఆమె మాటకు ఎదురు చెప్పలేదు.

బాధనంతా చెప్పుకుంటాడు

బాధనంతా చెప్పుకుంటాడు

తర్వాత ధ్రువుడు ఏడుస్తూ తన తల్లి సునీతి దగ్గరికి వెళ్తాడు.

తన బాధనంతా చెప్పుకుని ఏడుస్తాడు. నా కడుపున నువ్వు పుట్టడమే దురదృష్టం అంటూ తన కొడుకును ఓదార్చుతుంది సునీతి.

ఈసడింపులుంటాయి

ఈసడింపులుంటాయి

కష్టాలు ఈసడింపులు, బాధలు ప్రతి ఒక్కరికీ ఉంటాయని చెప్పింది సునీతి. ధ్యానం చేస్తే మనశ్శాంతి వస్తుందని అలా చెయ్యమని సునీతి చెప్పడంతో వెంటనే ధ్రువుడు అలాగే చేస్తాడు. తర్వాత తల్లి అనుమతి తీసుకుని ధ్యానంలో నిమగ్నం కావడానికి బయల్దేరాడు ధ్రువుడు.

ధ్రువుడి పట్టుదల చూసి

ధ్రువుడి పట్టుదల చూసి

అయితే దారిలో ధ్రువుడికి నారదుడు ఎదురయ్యాడు. ఇంత చిన్న వయస్సులో నీకెందుకు నాయనా... ధ్యానం అంటూ అడ్డుకున్నాడు. కానీ ధ్రువుడి పట్టుదల చూసి అతను కూడా దారి ఇచ్చాడు. తర్వాత నారదుడు కొన్ని సూత్రాలు చెప్పి పంపించాడు.

ధ్రువుడు భయపడలేదు

ధ్రువుడు భయపడలేదు

ధ్రువుడు యమున నది తీరంలోని మధు వనంలో కూర్చొని తప్పస్సు, ధ్యానం చేశాడు. ఐదేళ్ల వయస్సు నుంచి పదేళ్ల వరకు తపస్సు చేశాడు. ఆ సమయంలో ఎన్నో మాయ మృగాలకు కూడా ధ్రువుడు భయపడలేదు. చివరకు విష్ణువు ప్రత్యక్షం అవుతాడు.

విశ్వం ఉన్నంత వరకూ నీకంటూ ఒక ప్రత్యేక స్థానం

విశ్వం ఉన్నంత వరకూ నీకంటూ ఒక ప్రత్యేక స్థానం

ధ్రువుడు మనసులో ఉన్న కోరిక ఏమిటో విష్ణు మూర్తి తెలుసుకున్నాడు. విశ్వం ఉన్నంత వరకూ నీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండేలా చేస్తాననుకున్నాడు విష్ణువు. అప్పుడు ఎవ్వరికీ ఇవ్వని ధ్రువ పదం ధ్రువుడికి ఇచ్చాడు. ధ్రువ పదం చుట్టూ గ్రహాలు నక్షత్రాలన్నీ తిరుగుతుంటాయి.

ఈ విశ్వలో అన్ని లోకాలు నాశనం అయినా కూడా ధ్రువలోకమే ఉంటుంది. అంతటి స్థానం నీకు దక్కనుందని విష్ణు మూర్తి చెప్పి వెళ్లిపోతాడు. అయితే ఆ స్థానాన్ని నువ్వు ఇప్పుడే చేరలేవంటాడు.

ధ్రువుడు మళ్లీ రాజ్యానికి వెళ్లాడు

ధ్రువుడు మళ్లీ రాజ్యానికి వెళ్లాడు

నువ్వు అన్ని రాజ్య సుఖాలను అనుభవించిన తర్వాత నీ జీవితం చివరి దశలో ఆ స్థానాన్ని చేరుకుంటావని చెబుతాడు. ఇక ధ్రువుడు మళ్లీ రాజ్యానికి వెళ్లాడు. తన తండ్రి తన రాజ్యానికి రాజును చేశాడు. తర్వాత ప్రజాపతి కూతురు భ్రమినితో పెళ్లి జరిగింది. ధ్రువుడికి కల్పుడు, వత్సరుడు కుమారులు పుట్టారు. ఇక తమ్ముడు యక్షులచేతిలో హతం అవుతాడు. దీంతో ధ్రువుడి పిన తల్ల సురిచి కూడా చనిపోతుంది. ఆమె అగ్నికి ఆహుతి అవుతుంది. ధ్రువుడికి పట్టరాని కోపం వస్తుంది. తర్వాత యక్షజాతిని మొత్తం నిర్మూలించాలనుకుంటాడు.

శాంతి మార్గాన వెళ్తాడు

శాంతి మార్గాన వెళ్తాడు

ఇక ధ్రువుని తాత స్వాయంభువ మనువడిని అరుస్తాడు. దీంతో ధ్రువుడు శాంతి మార్గాన వెళ్తాడు. ప్రజల కోసమే పని చేస్తాడు. అందరినీ తన బిడ్డల్లా చూసుకుంటాడు. ఎవ్వరికీ ఏ కష్టం వచ్చినా కూడా తాను ఉన్నానంటూ భరోసాను ఇస్తాడు. మొత్తానికి ధ్రువుడి జీవితం చివరకు చేరుకుంటుంది.

విష్ణుమూర్తి ధ్రువుడికిచ్చిన స్థానానికి చేరేందుకు పయనం అవుతాడు ధ్రువుడు. విష్ణువు పంపిన విమానంలో సంతోషంగా తన స్థానాన్ని చేరుకుంటాడు ధ్రువుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా ధ్రువుడు ధృవతారగానే వెలుగుతూ ఉన్నాడు. ఇది ధృవుడి కథ.

పట్టుదల ఉంటే

పట్టుదల ఉంటే

ఈ విశ్వం ఉన్నంత వరకు అతనికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ విశ్వం మొత్తం అంతరించినా కూడా ధ్రువుడు మాత్రం అలాగే ఉంటాడు. మనలో పట్టుదల ఉంటే ఈ ప్రపంచంలో సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. ఒకడు మనల్ని అసహ్యించుకున్నాడనో లేదంటే ఒకడు మనల్ని ఈసడించుకున్నాడనో కుమిలిపోవొద్దు. మీకంటూ ఒక లక్ష్యం ఉంటే మీరు అనుకున్న స్థానానికి చేరుకుంటారు. చరిత్రలో నిలిచిపోతారు. ద టీజ్ ధృవ.

English summary

the story of dhruva tara

the story of dhruva tara
Desktop Bottom Promotion