For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సావిత్రి పెద్ద పతివ్రత అందుకే యముడు కూడా దిగివచ్చాడు, సతీ సావిత్రి కథ

సావిత్రికి పెళ్లి వయస్సు రాగానే ఆమెను కోరుకున్న వాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు అశ్వపతి. సావిత్రికి సత్యవంతునుడి గురించి తెలిసి ఉంటుంది. అతన్నే పెళ్లి చేసుకుంటాను అంటుంది సావిత్రి.

|

సావిత్రి కన్నా సతీ సావిత్రి అంటేనే అందరికీ ఆమె గుర్తొస్తుంది. పురాణాల్లో ఈ పాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. అశ్వపతి, మాళవిల గారాల పట్టీ సావిత్రి. అశ్వపతి మద్ర దేశానికి రాజు. ఈ దంపతులకు అన్నీ ఉన్నా సంతానం లేదనే ఒక బాధ ఉండేది. దీంతో వీరు పూజలు చేస్తారు. అయినా ఫలితం ఉండదు. ఒక రుషి సూచన మేరకు 18 సంవత్సరాలు ఉపాసనం చేస్తారు. అప్పుడు సావిత్రి వీరికి పుడుతుంది. ఆమెను ఎంతో అల్లారుముద్దుగా పెంచుతారు.

సావిత్రికి పెళ్లి వయస్సు రాగానే ఆమెను కోరుకున్న వాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు అశ్వపతి. సావిత్రికి సత్యవంతునుడి గురించి తెలిసి ఉంటుంది. అతన్నే పెళ్లి చేసుకుంటాను అంటుంది సావిత్రి. సత్యవంతుడి పేరు చిత్రాశ్వుడు. అయితే ఆయన ఎప్పుడూ సత్యమే మాట్లాడడం వల్ల ఆ పేరు వచ్చింది.

నువ్వు కోరుకున్న అతనితోనే పెళ్లి

నువ్వు కోరుకున్న అతనితోనే పెళ్లి

సరే తల్లి నీ కోరిక మేరకు నువ్వు కోరుకున్న అతనితోనే పెళ్లి చేయిస్తానని అంటాడు అశ్వపతి. అయితే సత్యవంతుడు పట్టుమని మరో ఏడాది కూడా బతకడని అశ్వపతికి తెలుస్తుంది. అతని ఆయువు తీరిపోయిందని త్వరలో మరణిస్తాడని అశ్వపతికి తెలియడంతో పెళ్లికి నిరాకరిస్తాడు. అయితే సావిత్రి మాత్రం తాను అతన్ని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనని చెబుతుంది.

సత్యవంతుడితో సావిత్రి వివాహం

సత్యవంతుడితో సావిత్రి వివాహం

దీంతో చివరకు సత్యవంతుడితో సావిత్రి వివాహం జరిపిస్తాడు అశ్వపతి. సత్యవంతుడికి పెద్దగా ఆస్తిపాస్తులుడవు. అలా అని అత్తింటివారు ఇస్తే తీసుకునే రకం కాదు. మొత్తానికి సత్యవంతుడితో పాటు అరణ్యంలో బతికింది సావిత్రి. భర్తనే లోకంగా బతికింది.

సత్యవంతుడికి మరణం దగ్గర పడుతుంది

సత్యవంతుడికి మరణం దగ్గర పడుతుంది

సావిత్రి మామ రాజ్యాన్ని కోల్పొతాడు. అంధుడవుతాడు. భర్త, అత్తమామలనే దైవంగా భావించి వారికి సేవలు చేస్తూ ఉంటుంది సావిత్రి. ఏమీ లేకున్నా తనను దేవతలా చూసుకున్న భర్తను చూసి మురిసిపోతుంది సావిత్రి. ఇంతలోనే సత్యవంతుడికి మరణం దగ్గర పడుతుంది. దీంతో సావిత్రి వారం రోజుల పాటు ఉపవాసం చేస్తుంది.

యముడు ఆశ్చర్యపోతాడు

యముడు ఆశ్చర్యపోతాడు

చివరి రోజున సత్యవంతుడి అనారోగ్యంతో అల్లాడిపోతాడు. మరణం తన భర్త దరి చేరిందని తెలుసుకున్న సావిత్రి భర్తను తన ఒళ్లో పెట్టుకుని పడుకోబెట్టుకుంటుంది. అయితే యముడు ఎదురుగా వచ్చి నిలబడతాడు. ఎవరు నువ్వు అని సావిత్రి ఆయన్ని అడుగుతంది. యముడు ఆశ్చర్యపోతాడు. "నేను ఎవ్వరికీ కనపడను. అలాంటిది ఈమెకు ఎలా అగుపించాను" అని అనుకుంటాడు.

యముడి వెంట ఏడ్చుకుంటూ వెళ్తుంది

యముడి వెంట ఏడ్చుకుంటూ వెళ్తుంది

సావిత్రి ఎంతో పతివ్రత కాబట్టి తాను కనపడ్డానని తెలుసుకుంటాడు. తర్వాత తాను ఎందుకు వచ్చానో యముడు చెప్పి సత్యవంతుడి ప్రాణాలను తీసుకుని వెళ్లిపోతుంటాడు. ఇదంతా గమనించిన సావిత్రి యముడి వెంట ఏడ్చుకుంటూ వెళ్తుంది. ఎందుకు నా వెనుక వస్తున్నావు అంటూ యముడు కోప్పడుతాడు. నా భర్త వెంట నడవడమే నా ధర్మం అంది.

నీ భర్త ప్రాణం కాకుండా ఏదైనా సరే కోరుకో

నీ భర్త ప్రాణం కాకుండా ఏదైనా సరే కోరుకో

ఎంతకూ వెనుదిరిగిపోకపోవడంతో యముడు నీకు ఏదైనా వరం కావాలో కోరుకోమంటాడు. అయితే నీ భర్త ప్రాణం కాకుండా ఏదైనా సరే కోరుకో అంటాడు. గుడ్డివారైనా తన అత్తమామలకు కళ్లు రావాలి అని కోరుకుంటుంది. సరే అని ప్రసాదిస్తాడు. అయినా కూడా యుముడి వెంటే వెళ్తుంది సావిత్రి. మళ్లీ ఏమైంది సరే ఇంకో వరం కోరుకో అంటాడు యముడు. మా మామయ్య తన రాజ్యాన్ని మళ్లీ దక్కించుకునేలా చెయ్యండి అని కోరుతుంది. సరే అని ప్రసాదిస్తాడు.

సావిత్రి భర్త ప్రాణాలు తిరిగి ఇచ్చేస్తాడు

సావిత్రి భర్త ప్రాణాలు తిరిగి ఇచ్చేస్తాడు

అయినా సావిత్రి యముడి వెంటే వెళ్తూ ఉంటుంది. సరే మరో వరం కోరుకో ఇస్తానంటాడు. ఈసారి యముడు నీ భర్త ప్రాణం తప్ప అనే మాట మరిచిపోతాడు. దాంతో సావిత్రి వెంటనే నా భార్త ప్రాణం తిరిగి ఇవ్వండి అని మొక్కుతుంది. యముడు తాను ఇచ్చిన మాట ప్రకారం సావిత్రి భర్త ప్రాణాలు తిరిగి ఇచ్చేస్తాడు. సావిత్రి ఎంతో పతివ్రత కాబట్టే యముడు కూడా వరాలిచ్చాడు. ఆమెపాతివ్రత్యం చరిత్రలో అలా నిలిచిపోయింది.

English summary

the story of sati savitri

Savitri the only daughter of Aswapathi Maharaja, King of Madra has married Satyavantha. But Yama Dharma Rajuhimself descends onto the earth to claim his soul. Savitri follows him and when Yama Dharma Raju tries to convince her to go back, she persists.
Desktop Bottom Promotion