For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గణేషుడి శరీరభాగాలు ఏవి సూచిస్తాయి

|

ఏనుగుతల ఉన్న దేవుడు, వినాయకుడు ప్రతి హిందూ భక్తుడికి ఇష్టమైన దేవుడు.

హిందూమతంలో ఎక్కువగా పూజించే దేవతలలో వినాయకుడు ప్రియమైనవాడు. ఆయన అన్ని పవిత్రమైన విషయాలకి అర్థంగా నిలబడతాడు. ఏ పూజ అయినా మొదటగా ఆయనకి ప్రార్థన చేయనిదే మొదలవ్వదు.

ఆయన శరీరం మొత్తం ఒక్కోటీ ఒక్కోదాన్ని సూచిస్తుందని తెలుసుకోవటం ఆసక్తికరంగా అన్పిస్తుంది. భక్తులు ఆ రకంగా జీవించవహ్చు.మీకు గణేషుడి చిత్రం వెనుక అర్థం అర్థమైతే,కంటి కన్పించేదానికన్నా గణపతి మరింత ఎక్కువ అని అర్థమవుతుంది. ఇంకా తెలుసుకోవటానికి చదవండి.

వినాయకుడి తల

వినాయకుడి తల

వినాయకుడి బొమ్మ చూసినప్పుడు మొదటగా మీరు గమనించేది తలనే అయివుంటుంది.- ఆయన ఏనుగు తల. వినాయకుడి ముఖం తన ఏనుగులాంటి అందమైన కళ్ళతో,పొడవాటి వంపు తిరిగిన తొండంతో కన్పిస్తుంది. వీటికి చాలా అర్థాలుంటాయి.

-పెద్ద తల గణపతికి మనలాంటి సామాన్య మనుషులకన్నా పెద్ద మెదడు ఉన్నదని సూచిస్తుంది.

-ఏనుగు అందం కేవలం దాని రూపం వలన రాదు, దాని మంచితనంతో కూడా అందంగా కన్పిస్తుంది. దాని నిండా కరుణ, ప్రేమ,సున్నితత్వం , అదే సమయంలో తెలివైనది కూడా. ఏనుగు తల రూపాన్ని అర్థం చేసుకోవటం వలన గణపతిలోని లక్షణాలు కూడా అర్థమవుతాయి.

-ఏనుగుకున్న శక్తి అపారం. గణేశుడికి కూడా శారీరకంగా బలంతోపాటు, వ్యక్తిత్వం కూడా ఉన్నతమైనది. ఆయన మన దారిలో వచ్చే అన్ని అవరోధాలను తొలగిస్తారు.

-పురాణాల ప్రకారం గణపతి ఏనుగుతల విశ్వరహస్యం సూచిస్తుందని, అది మనలాంటి మామూలువారు తెలుసుకోలేమని చెప్తుంది. ఈ అందమైన, ఊహాత్మకమైన, విషయం మనలాంటి మామూలు మెదళ్లతో ఊహించలేం.

గణపతి తొండం

గణపతి తొండం

-గణపతి తొండంను పవిత్ర నాదమైన ‘ఓం' గుర్తును చూపేలా చిత్రీకరిస్తారు.

-తొండం ఎడమవైపుకి తిరిగి వుంటే ఆయనను వామముఖి గణేషుడు అంటారు. చంద్రుడి శక్తిని ఎడమవైపుకి సాధారణంగా వెళ్తుందని అంటారు. అది మనకి సహనం, ప్రశాంతత, సృజనాత్మకత, ఓర్పును అందిస్తాయి. ఇళ్ళలో ఎక్కువగా ఈ రూపాన్నే పూజిస్తారు.

-తొండం కుడివైపుకి తిరిగివుంటే ఆయనను దక్షిణాభిముఖి లేదా సిద్ధి వినాయకుడని అంటారు. మన శరీరంలో కుడివైపు సూర్య శక్తిని ప్రసరించేలా చేసి, మోక్షాన్ని జ్ఞానాన్ని అందిస్తుంది.

-తొండంలో స్వీట్లు ఉంటే అది సౌకర్యాలకి, జీవితంలో భౌతిక అవసరాలను సూచిస్తుంది.

గణపతి చేతులు

గణపతి చేతులు

గణేషుడి చేతులు హిందూ తత్వానికి ప్రతీక అని భావిస్తారు.

-ఒక చేతిలో పద్మం ఉంటుంది. ఇది సత్యం, జ్ఞానంలో సౌందర్యాన్ని సూచిస్తుంది.

-రెండవ చేయిలో గొడ్డలి ఉంటుంది. అది చక్రం లేదా ఉచ్చు కూడా అయివుండచ్చు. ఇవన్నీ వినాయకుడు అన్ని బంధాలు, నమ్మకాలకి అతీతుడు అని సూచిస్తున్నాయి.

-మూడవచేతిలో స్వీట్లు లేదా లడ్డూ ఉంటాయి. ఇది జ్ఞానంతో వచ్చే సంతోషం సాదా అయినది అని సూచిస్తుంది.

-నాలుగవ చేయి అభయముద్రలో ఉంటుంది. అభయముద్ర వరాలివ్వటానికి లేదా ‘కంగారుపడకు,నేనున్నాను.' అని చెప్పటానికి ప్రతీక.

-గణేషుడి చిత్రాలు కొన్నిటిలో అతను విరిగిపోయిన మరో దంతాన్ని పెన్నులా పట్టుకున్నట్లు కన్పిస్తుంది. ఇది గణపతి మహాభారతం రాయడాన్ని సూచిస్తోంది.

వినాయకుడి దంతం

వినాయకుడి దంతం

-వినాయకుడికి ఒక దంతమే ఉన్నట్లు బొమ్మల్లో చూపిస్తారు. పురాణకథల ప్రకారం మరొక దంతం పరశురాముడిని మహాశివుడ్ని కలవకుండా అడ్డుకున్నందుకు అతను నరికేసారు.

-వినాయకుడికి ఒక దంతమే ఉంది కాబట్టి ఏకదంతుడు అని కూడా అంటారు.ముడ్గల్ పురాణం ప్రకారం ‘ఏకదంత' అంటే విశ్వంలో శక్తి,ప్రకృతిలో ఏకత్వం యొక్క సత్యానికి అర్థం.

-తొండం నేర్పరితనానికి, సర్దుకుపోవటాన్ని సూచిస్తుంది. అది ఎలా అయినా సర్దుకుపోవటం ముఖ్యం, విజయానికి సులభమైన మార్గాలు ఉండవని సూచిస్తోంది.

చిన్న కళ్ళు

చిన్న కళ్ళు

గణేషుడి చిన్నకళ్ళూ శ్రద్ధ, ఏకాగ్రత చాలా ముఖ్యమని చూపిస్తున్నాయి. ఏ విషయాన్ని అయినా లోతుగా చూడటం అవసరం.

చిన్న నోరు

చిన్న నోరు

వినాయకుడి బొమ్మల్లో పెద్ద చెవులు, చిన్న నోరు ఉంటాయి. ఇది మనకి ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి అని నేర్పిస్తుంది. ఊరికే ఉబుసుపోని వాగుడు ఎప్పుడూ మంచిది కాదు, ఉపయోగం కూడా ఉండదు. ఇలా ఉండటం వలన మనం తెలివిగా మారతాం.

పెద్ద పొట్ట

పెద్ద పొట్ట

-వినాయకుడి పెద్ద పొట్ట వలన ఆయనకి లంబోదరుడనే పేరు వచ్చింది

-దీని అర్థం మనం మన మార్గంలో వచ్చేవి ఏమైనా సంతోషంగా, ప్రశాంతంగా ఒప్పుకుని జీర్ణం చేసుకోవాలి అని. స్థిర మనస్తత్వం ఉన్న వ్యక్తికి బాధ, సంతోషం, ఆనందం, మంచి, చెడు ఇంకా కష్టాలు అన్నీ సమానంగానే ఒకేలా అన్పిస్తాయి.

-పెద్ద పొట్ట గణేషుడు జ్ఞానసంపదకి, జ్ఞానానికి నిలయం అని సూచిస్తుంది.

నుదిటిపై త్రిశూలం

నుదిటిపై త్రిశూలం

-వినాయకుడి నుదిటిపై త్రిశూలం ఆయన తండ్రి పరమశివుని ఆయుధం.

-ఇది వినాయకుడు కాలానికి -గతం, ప్రస్తుతం, భవిష్యత్తులకి కూడా అధిపతి అని సూచిస్తుంది.

గణేషుడి కాళ్ళు

గణేషుడి కాళ్ళు

చాలా బొమ్మల్లో గణపతి ఒక కాలిని మరొక కాలిపై పెట్టి లేదా ఆసనంపై పెట్టి ఉంటుంది. మరొక కాలు నేలపై తాకుతూ ఉంటుంది. ఇది వినాయకుడు ఇద్దరూ ఆధ్యాత్మిక, భౌతిక ప్రపంచాలకి అధిపతి అని చూపిస్తుంది.

అలాగే మనుషులుగా మనం భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం రెండిటిలో భాగమవ్వాలని సూచిస్తుంది.

గణేషుడి ఎలుక

గణేషుడి ఎలుక

గణపతి ఎలా ఉంటాడో వేసిన వివిధ బొమ్మల్లో, అతని వాహనం ఎలుక కూడా ఉంటుంది. గణపతితో ఎలుక ఉన్న పటాన్నే పూజించటం లాభదాయకం అని నమ్ముతారు.

-ఈ ఎలుక మనకి ఉండే కోరికలకి ప్రతీక. ప్రతివ్యక్తికీ కోరికలు ఉండటం అవసరమేకానీ, వాటికే మనం లొంగిపోకూడదు. గణపతి మన కోరికలపై మనకి నియంత్రణ ఉండాలని చూపించటం కోసమే ఎలుక వాహనంపై తిరుగుతాడు.

-ఎలుకలు చీకట్లో కూడా చూడగలవు. గణపతి ఈ వాహనాన్ని ఎంచుకున్నాడు ఎందుకంటే ఆయన మన కష్టసమయాల్లో,చీకటిగా ఉన్నప్పుడు కూడా మన దగ్గరికి రాగలడు.తన ఎలుకతో కలిసి మనలని కాంతిలోకి నడిపిస్తాడు.

English summary

The symbolism of Lord Ganesha’s Body

There is a specific and defined meaning for each part of Lord Ganesha. The trunk of Lord Ganesha is often used to symbolize the holy sound 'OM'. If the trunk is pointed to the left side, he is known as Vamamukhi Ganesha. If the trunk is pointed to the right, Lord Ganesha is called Dakshinabhimukhi or Siddhi Vinayaka.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more