For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రిస్మస్ రోజున..క్రిస్మస్ చెట్టుకి ఎందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు...?

|

క్రిస్మస్...ఈ పేరు వినగానే ఓ రకమైన ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం, భక్తి...ఇలా అన్నీ కలగలిసిన పండుగ ఇది. క్రిస్మస్ అంటే అందరికీ ముందుగా గుర్గొచ్చేది క్రిస్మస్ చెట్టు, శాంతా క్లాజ్ ...అసలు ఏసుక్రీస్తుకి, క్రిస్మస్ చెట్టుకు సంబంధం ఏమిటి? క్రిస్మస్ చెట్టును ఎందుకు మన ఇళ్లలో పెట్టుకోవాలి. క్రిస్మస్ ట్రీ దేవుడికి ప్రతి రూపం అని ఎందుకంటారు? ఈ విషయాలను తెలుసుకోవాలంటే ఆర్టికల్ కంటిన్యూ చేయండి...

క్రిస్మస్ ట్రీ ! ఈ చెట్టుకు ఎప్పుడూ ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియదని అంటూ ఉంటారు. పండగ రోజుల్లో ఈ చెట్టు క్రింద బహుమలుతులు ఉంచి అవి కుటుంబ సభ్యులంతా తీసుకోవడం ఒక ఆనవాయితీ..ఈ బహుమతులన్నీ దేవుని దగ్గరి నుంచే వచ్చినవి...అన్న అంతరార్ధం అందులో ఉంటుంది. క్రిస్మస్ చెట్టు దేవుడికి ప్రతిరూపంగా భావిస్తుంటారు. పశ్చిమ దేశాల్లో చలికాలం మంచు వల్ల మొక్కలన్నీ తమ జీవాన్ని కోల్పోతాయి. కానీ క్రిస్మస్ చెట్టుగా పిలుచుకునే ఫర్ ట్రీ మాత్రం పచ్చగానే ఉంటుంది. అందుకే ఇది జీసస్ నిత్యజీవానికి, చైతన్యానికి ప్రతీక అని అందరూ అనుకుంటూ ఉంటారు.

అంతే కాదు..ఇంతకు ముందు రోజుల్లో క్రిస్మస్ చెట్టును కొవ్వొత్తులతో అలంకరించేవారు. కొవ్వొత్తి తనను తాను కగించుకుంటూ మనందరికీ వెలుగును అందిస్తుందని నమ్మకం. ఏసుక్రీస్తు జీవితంలోనూ ఇదే గమనించవచ్చు. ఇతరుల పాపాలను తొలగించడానికి ఆయన తన ప్రాణాలను వదిలేశారు. ఈ విధంగా క్రిస్మస్ చెట్టును ఏసుక్రీస్తు జీవితానికి ప్రతీకగా భావిస్తుంటారు...

christmas

ఆయన ఇచ్చిందే:

క్రిస్మస్ చెట్టుు పుట్టుక గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. అది నిజమో..కాదో చెప్పే ఆధారాలేమీ లేకపోయినా...క్రిస్మస్ ట్రీకి మూలం ఈ కథే అని చెప్పుకోవచ్చు... అదేంటో తెలుసుకుందాం.. అది చలికాలంలో ఒక రాత్రి. ఒక చిన్న పాకలాంటి ఇంట్లో వాలంటైన్, మేరీ అనే ఇద్దరు పిల్లలు వాళ్ల నాన్న కోసం వేచి చూస్తున్నారు. అప్పటికే వాళ్లు భోజనం చేసి రెండు రోజులు దాటింది. ఆహారం తీసుకొస్తానని వెళ్లిన నాన్న ఒక్క రొట్టెముక్కతో తిరిగొచ్చాడు. ఆ రొట్టె ముక్కనే ముగ్గరూ పంచుకొని ప్రార్ధన చేసుకుని తినబోతుండగా...

christmas

తలుపు శబ్దం అయింది. వెల్లి చూస్తే ఒక కుర్రాడు.. చలితో వణుకుతూ కనిపించాడు. వెంటనే అతన్ని లోపలికి తీసుకొచ్చి తమ దుస్తులు ఇచ్చి, ఆకలితో ఉన్న అతనికి తమ వంతు ఆహారాన్ని ఇచ్చారు ఆ ముగ్గురు. ఆ తర్వాత ఆ పిల్లాడికి సహాయం చేసిన ఆనందంతో వారు చక్కగా నిద్రపోయారు. అర్ధరాత్రి అలికిడికి లేచిన వాళ్లందరికీ బాలయేసు ప్రత్యక్షమయ్యాడు.

'మీ దాన గుణం చాలా గొప్పది. అది నాకు చాలా నచ్చింది. అని చెప్పిన ఆయన ఒక ఎండు కొమ్మను నేలలో నాటాడు. అది వెంటనే పచ్చగా మారి, పెద్ద చెట్టుగా ఎదిగింది. బంగారు చెట్టుగా మారిపోయింది. తమ గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఆకలితో ఉన్న బాలుడికి సమాయం చేసి, పవిత్రమైన మనస్సుతో అక్కున చేర్చుకున్న ఆ కుటుంబ సభ్యులను ప్రభువు ఆశీర్వధించి ఆ బహుమతి అందించడాని భావిస్తారు. ప్రభువు క్రుపకు చిహ్నాంగా ఆ క్రిస్మస్ ట్రీ తమ ఇళ్లలోనూ ఉంచి దాన్ని అలంకరిస్తారు.

christmas

ముందు నుండే...

అయితే క్రిస్మస్ చెట్టు కేవలం క్రైస్తువులకు మాత్రమే పరిమితం కాదు...ఇతరులకు సంబంధించింది కూడా అని చెప్పే కథలు చాలానే కనిపిస్తాయి. పాగన్లు, ఈజిప్షియనల్ు తమ ఇళ్లను ఖర్జూర ఆకులతో అలంకరించుకునే వారట. ఆ తర్వాత ప్యారడైటజ్ ట్రీగా పిలుచుకునే ఫర్ చెట్టును జర్మన్లు 12వ శతాబ్దం నుంచి అలంకరించడం ప్రారంభించారు. వాళ్లు చలికాలాన్ని చెడుగా భావించేవాళ్లు. చలికాలంలోనూ పచ్చగా ఉండే ఈ మొక్కను చెడుపై మంచి సాధించిన విజయంగా భావించి దీన్ని తెచ్చిఇళ్లల్లో ఉంచుకునేవారు.

christmas

అంతే కాదు... చాలికాలం ముగిసిన తర్వాత ఇతర మొక్కలు కూడా వీటి మాదిరిగానే పచ్చదనాన్ని ఇళ్లల్లో ఉంచుకొనే వారు. అంతే కాదు...చలికాలం ముగిసిన తర్వాత ఇతర మొక్కలు కూడా వీటి మాదిరిగానే పచ్చదనాన్ని సంతరించుకుంటాయనే ఆశకు ప్రతిరూపంగా భావిస్తారు. రోమన్లు వ్యవసాయానికి అధిపతి అయిన సాటర్నన్ కి ప్రతీకగా ఈ చెట్టును పూజించి అలంకరించేవారు. దాన్ని నాణేలు, కొవ్వొత్తులు, పండ్లు, పేస్ట్రీలు, బిస్కట్లు అలంకరించే వారు.

christmas

పూర్వకాలం నుండినే క్రిస్మస్ చెట్టును క్రిస్మస్ పండుగా ప్రారంభమయ్యే రోజు (డిసెంబర్ 23)న పెట్టేవారు. కొత్త సంవత్సరం వచ్చే వరకూ దీన్ని అలంకరించే వారు. పండ్లు, ఇతర ఆహార పదార్థాలు, ఆభరణాలు, పూలు, కొవ్వొత్తులతో దీన్ని అలంకరించేవారు. రానురాను అలంకరణ పద్ధతుల్లో, క్రిస్మస్ ట్రీని పెట్టే తేదీల్లో మార్పులు వచ్చాయి. అయితే ఈ క్రిస్మస్ ట్రీని పెట్టిన తర్వాతే చలికాలపు వేడుక (వింటర్ ఫెస్టివల్ )ప్రారంబించడం విదేశాల్లో ఆనవాయితీగా వస్తోంది. ఇలా ప్రతి సంవత్సరం సుమారు కొన్ని కోట్లో క్రిస్మస్ మొక్కలు అమ్ముడుతాయని అంచనా...

christmas

కాలాలు మారినా, ప్రతికూల వాతావరణం ఎదురైనా ఆ భగవంతుని దయ ఉంటే పదికాలాల పాటు పచ్చగా ఉండొచ్చని నిరూపిస్తుంది కాబట్టే క్రిస్మస్ చెట్టు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

English summary

The True Meaning of Christmas Trees and Importance..!

The evergreen tree was an ancient symbol of life in the midst of winter. Romans decorated their houses with evergreen branches during the New Year, and ancient inhabitants of northern Europe cut evergreen trees and planted them in boxes inside their houses in wintertime. Many early Christians were hostile to such practices.
Story first published: Thursday, December 24, 2015, 12:13 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more