For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంద్రుడికి చుక్కలు చూపించిన రాక్షసుడు వృత్రాసురుడు ఒక్కడే, అతని కోసమే ఆయుధం తయారు చేసుకున్నాడు

ఇంద్రుడి దగ్గర ఉన్న ఆయుధాలను మొత్తం ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు వృత్రాసురుడు. దీంతో దేవలోకంలోని ఆయుధాలు మొత్తం దధీచి అనే మహర్షి దగ్గర పెడతాడు ఇంద్రుడు. ఇంద్రుడికి ఏమీ చేయాలో అర్థం కాలేదు.

|

ఇంద్రుడు దేవాలోకాలనిక అధిపతి. ఇంద్రుడు తనను జయించే దమ్ము ఎవ్వరికీ లేదనుకునేవాడు. నన్ను ఎదురించి ఈ సింహాసనాన్ని అధిష్టింగల మగోడు పుట్టలేదనుకునేవాడు. కానీ రాక్షసుల్లో కొందరు ఇంద్రుడి సింహాసనంపై కన్నేస్తారు. అయితే వారందరినీ జయించేస్తాడు ఇంద్రుడు.

ఎంతో మందిని సునాయసనంగా జయించిన ఇంద్రుడు ఒక రాక్షసుడి విషయంలో మాత్రం అల్లాడిపోతాడు.
అతని చూసి పారిపోతాడు. దేవతల అస్త్రాలను మొత్తం ఇంద్రుడు దాచిపెడతాడు. వృత్రాసురుడు అనే రాక్షసుడి ఇంద్రుడికి చుక్కలు చూపించాడు.

వృత్రాసురుడు ఎలా శత్రువు అయ్యాడంటే

వృత్రాసురుడు ఎలా శత్రువు అయ్యాడంటే

అసలు ఇంద్రుడికి వృత్రాసురుడు ఎలా శత్రువు అయ్యాడంటే.. విశ్వరూపుడు అనే మహర్షి యజ్ఞాలు చేసి మంచి శక్తులు సంపాదించాడు. కానీ అతనిలో కొన్ని రాక్షస గుణాలుండేవి. దీంతో ఇంద్రుడికి భయం పట్టుకుంది. ఈ విశ్వరూపున్ని ఇలాగే వదిలేస్తే నా సింహాసనాన్నే టార్గెట్ చేసేటట్లు ఉన్నాడనుకుంటాడు.

కొడుకును చంపాడనే కోపంతో

కొడుకును చంపాడనే కోపంతో

తర్వాత విశ్వరూపున్ని చంపేస్తాడు ఇంద్రుడు. విశ్వరూపుడి తండ్రి త్వష్ట ప్రజాపతి కూడా పెద్ద మహర్షి. ఆయన కూడా చాలా యజ్ఞాలు చేశాడు. ఇంద్రుడు తన కొడుకును చంపాడనే కోపంతో వెంటనే ఆయన పెద్ద యాగం మొదలుపెడతాడు.

తిరుగులేని వరంతో పుడతాడు

తిరుగులేని వరంతో పుడతాడు

ఇంద్రున్ని ఎలాగైనా సరే చంపాలనుకుంటాడు ప్రజాపతి. ఇక యాగం చేస్తుండగా ఆ గుండంలో నుంచి ఒక రాక్షసుడు పుడతాడు. అతనే వృత్రాసురుడు. అతను తిరుగులేని వరంతో పుడతాడు. ఉదయం పూటగానీ రాత్రి పూటగానీ, లోహం, చెక్కతో, ఆయన పుట్టినప్పటి వరకు ఉన్న ఆయుధాలతోగానీ, తడి, పొడి వస్తువులతోగానీ వృత్రాసురుడికి మరణం సంభవించదు.

ఇంద్రుడు వణికిపోతాడు

ఇంద్రుడు వణికిపోతాడు

ఇక వృత్రాసురుడుని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు ప్రజాపతి. దేవలోకంపై దాడి చేయిస్తాడు. వృత్రాసురుడి దెబ్బకు ఇంద్రుడు వణికిపోతాడు. దేవతలంతా కలిసి పారిపోతారు. వృత్రాసురుడు చేతిలో తాను చావు చివరిటంచులదాకా వెళ్లాల్సి వస్తుందేమో అని అనుకుంటాడు ఇంద్రుడు.

ఆయుధాలు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు

ఆయుధాలు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు

ఇంద్రుడి దగ్గర ఉన్న ఆయుధాలను మొత్తం ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు వృత్రాసురుడు. దీంతో దేవలోకంలోని ఆయుధాలు మొత్తం దధీచి అనే మహర్షి దగ్గర పెడతాడు ఇంద్రుడు. ఇంద్రుడికి ఏమీ చేయాలో అర్థం కాలేదు. అంతకు ముందు చాలా మంది రాక్షసులు ఇంద్రునిపై దాడి చేసినా అతను సమర్థంగా ఎదుర్కొన్నాడు. కానీ వృత్రాసురుడు ఏ ఆయుధంతోనూ చనిపోకపోవడంతో కొత్త ఆయుధం కోసం విష్ణు మూర్తిని ఆశ్రయించాడు ఇంద్రుడు.

దధీచి ప్రాణం త్యాగం చేస్తే

దధీచి ప్రాణం త్యాగం చేస్తే

విష్ణు మూర్తి ఇంద్రుడికి ఒక సలహా ఇచ్చాడు. దధీచి మహర్షి ప్రాణం త్యాగం చేస్తే ఆయన ఎముకలతో తయారు చేసే ఆయుధం వల్లే మాత్రమే వృత్రాసురుడు చనిపోతాడని చెబుతాడు. మొత్తానికి దధీచి దేవతల కోసం ప్రాణం త్యాగం చేస్తాడు. తర్వాత ఇంద్రుడు ఆయన ఎముకలతో వజ్రాయుధం తయారు చేసుకుని వృత్రాసురుడిని చంపేస్తాడు.

ఇంద్రున్ని ఆడుకుంది అతనే

ఇంద్రున్ని ఆడుకుంది అతనే

కానీ ఇంద్రున్ని ఒక ఆట ఆడుకుందంటే అది కేవలం వృత్రాసురుడు మాత్రమే. వృత్రాసురుడు బతికినంత కాలం ఒక్క క్షణం కంటి మీద కునుకు లేకుండా బతికాడు ఇంద్రుడు.

English summary

the war between vritrasura and indradev

Vritrasura then meditated and undertook a penance as the result of which he was granted a supreme boon. As per this boon no weapon known till then, could kill him, and he would not even die of anything that was either wet or dry or any weapon made of wood or metal.
Desktop Bottom Promotion