Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఈ ఐదు విషయాలను గుర్తుంచుకోవాలంటున్న ఓషో..!
భారత ఆధ్యాత్మిక చరిత్రలోనే కాదు ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో కూడా ఓషో తన ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఓషో అంత పాపులారిటీ సంపాదించుకోవడానికి కారణమేంటి. ఎందుకు ఇతను చాలా వివాదాస్పదుడయ్యాడు. ఓషో పుస్తకాలకు కూడా చాలా డిమాండ్ వుంది. ఓషో ఫిలాసఫీ ఏమి చెబుతుంది. ఓషో తన జీవితంలో చెప్పిన ఫిలాసఫీలోని ముఖ్కమైన విషయాలను మీతో పంచుకోబోతున్నాం.
ఓషో ఫిలసఫీ వల్ల చాలా మందే ప్రభావితం చెందారు. అనేక మంది సమాజంతో సంబంధాన్ని తెంచుకొని తన్మయత్వంలో ముసిగిపోయారు. ఓషోను దేవుడిగా, విముక్తి ప్రదాతగా భావించారు.
1. మనలో వున్న అహంకారాన్ని గమనించాలి, అది ఏమి చేస్తుందో చూడాలి కానీ దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దని ఓషో అంటాడు. నేను అనే భావన, నాకు మాత్రమే తెలుసు అనే ఆలోచనను ఇది తగ్గిస్తుందని అంటారు. మనమేంటో ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో తెలుసుకోవాలని ఓషో చెబుతాడు. దీనివల్ల మనసులో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈగో తగ్గిపోతుంది. ఆనందం మొదలౌతుంది అని ఓషో అంటాడు. ఉదాహరణకు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు అప్పటి పరిస్థితిని గమనించి వెయిట్ చేయాలి, దానికి ఎంత సమయం పట్టినా వేచి చూడాలి. అలా కాకుండా రాంగ్ రూట్‌లో వెళ్లడం సిగ్నల్ జంప్ చేయడం చేయవద్దు.
2. కాదనలేని సత్యాలను జీవితంలో అంగీకరించి తీరాలని ఓషో అంటాడు. అన్ని మన చేతుల్లో వుండవనే సత్యాన్ని గ్రహించాలి. మన ఆధీనంలో లేని వాటిని వదిలివేయాలని అంటాడు. జీవితంలో అనుకోకుండా ఏదైనా సమస్య వస్తే ఆన్ని అవకాశంగా తీసుకోవాలంటాడు. అన్నింటినీ నియంత్రించడానికి ప్రయత్నించకూడదు. కుటుంబంలో లేదంటే బయట అయినా మనుషులను మనము అనుకున్నట్లుగా నియంత్రిచాలని అనుకోవద్దు. ఇది పూర్తిగా అసాధ్యం. ఎన్నో పరిస్థితులు ప్రభావం చూపుతాయని గ్రహించాలి.
3. మనిషి మనసును అదుపులో పెట్టుకొని ప్రస్తుత ప్రపంచంలో జీవించాలంటాడు. గతం గురించి, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తే సమస్య పెరుగుతుందంటాడు ఓషో. ఏది చేసినా మనస్పూర్తిగా చేయాలని చెబుతాడు. రెండు పనులను ఒకేసారి చేయవద్దు. ఉదాహరణకు చాలా మంది విద్యార్ధులు, ఉద్యోగులు ఆర్థిక సమస్యల వల్ల భవిష్యత్తులో ఏదో జరుగుతుందని ఏమి చేయలేమని భావించి ఆత్మహత్య చేసుకుంటారు. ప్రస్తుత పరిస్థితిలో జీవించడానికి ప్రయత్నించాలి. సమస్య నుంచి బయటపడేందుకు ఏదైనా ఆలోచన, పరిష్కారం దొరకవచ్చు.

4. ప్రేమకు ప్రముఖ స్థానాన్ని ఓషో ఇస్తాడు. ఏ పనినైనా ప్రేమతో చేయాలంటాడు. భయంతో ఏ పనినీ చేయవద్దని చెబుతాడు. భయాన్ని వదిలివేయడానికి ప్రయత్నించాలి, అప్పుడు చాలా మంచి ఫలితాలు వస్తాయంటాడు. ఏ పని చేసినా సరే మనస్పూర్తిగా చేయాలని ఓషో చెబుతాడు. ప్రేమతో చేసిన పనుల్లో అద్భుతాలను సృష్టించాలంటాడు. ప్రభాస్ మిర్చి సినిమాలో "ప్రేమించండి డూడ్, మహా అయితే ఏమవుతుంది, తిరిగి ప్రేమిస్తారు, అంతే కదా" అని అంటాడు. ప్రేమకు వున్న పవర్ అంతగా వుంటుందని ఓషో చెబుతున్నాడు.
5. మన చుట్టూ వుండు మనుషులను ప్రేమించడం తెలుసుకోవాలంటాడు. ఎవ్వరిపైగా ఆగ్రహంతో వుండవద్దంటాడు. ఎదుటి వారి బాధలను అర్ధం చేసుకునే మనస్తత్వం వుండాలంలని చెబుతాడు. దీని కోసం ధ్యానం ఎక్కువగా చేయమంటాడు. ద్వేషం వున్న వారిపైన కూడా ప్రేమను చూపించాలని అంటాడు. జీవితంలో అవకాశం దొరికినప్పుడల్లా ప్రమను పంచడం నేర్చుకోవాలంటాడు.



Click it and Unblock the Notifications