Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Vastu dosh: వాస్తు దోషానికి మూల కారణం ఇదే..మీ ఇంట్లో ఇలా ఉంటే వెంటనే మార్చేయండి
మన ప్రతి ఒక్కరి జీవితంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. మన జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలకు పరిష్కారాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయని చెబుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి శుభ్రత, క్రమబద్ధత మన జీవితాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంట్లో విరిగిన, పనికిరాని వస్తువులు ప్రతికూల శక్తిని సృష్టిస్తాయి. ఆరోగ్య సమస్యలు, ఇతర అడ్డంకులను కూడా కలిగిస్తుంది. ఇవన్నీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పేరుకుపోయేలా చేస్తాయి. ఇది మన మనస్సు,మెదడుపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
ఇంట్లో ఏదైనా విరిగిపోయిన లేదా ఉపయోగించని వస్తువు ఉంటే దానిని వెంటనే తొలగించాలి. అంతేకాకుండా ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా సానుకూల శక్తి ప్రవాహం ఉంటుంది ఇంటిని శుభ్రంగా, చక్కగా ఉంచుకోవడం మీ మానసిక, శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు మీ జీవితంలో ఆనందం,శాంతి, శ్రేయస్సును కూడా తెస్తుంది.

నెగిటివ్ ఎనర్జీని తెచ్చే కొన్ని వస్తువులు ఇవే
పాత బట్టలు,గాడ్జెట్స్
పాత, ఉపయోగించని బట్టలు, బూట్లు లేదా ఇతర వస్తువులు ప్రతికూల శక్తిని నిల్వ చేస్తాయి. వాటిని దానం చేయాలి లేదా విసిరివేయాలి.
రెగ్యులర్ క్లెన్సింగ్ పాజిటివ్ ఎనర్జీ రెమెడీ
ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ఉండండి. దుమ్మును తొలగించి నేలను తుడుచుకోవడం మర్చిపోవద్దు.
పగిలిన గాజు
ఇంటి డోర్ లేదా కిటికీలో పగిలిన అద్దాలు ఉంటే దానిని వెంటనే మార్చడం బెటర్ అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. విరిగిన గాజు ప్రమాదకరమైనది మాత్రమే కాదు ప్రతికూల శక్తికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. దీన్ని వెంటనే తొలగించాలి.
ఆగిపోయిన గడియారం
ఆగిపోయిన గడియారాలు సమయం స్తబ్దతను సూచిస్తాయి. ఇది జీవితంలో స్తబ్దతను కూడా తీసుకురాగలదు. కాబట్టి వాటిని మరమ్మత్తు చేయాలి లేదా తీసేయాలి.
పాత తాళం
ఇంట్లో ఉపయోగించని తాళాలు, కీలను ఉంచడం మానుకోండి.
ధూపం
ఇంట్లో ధూపం వేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అంతేకాకుండా కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటుంది. ఇంట్లో ఆవరణలో మొక్కలు నాటండి. చెట్టు ఉంటే ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.



Click it and Unblock the Notifications