For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగవారిపై ఇప్పటికీ అసమానత, మగవారు వెళ్లకూడని ఆలయాలు ఇవే

కేరళలోని తిరువనంతపురానికి సమీపంలో ఆట్టుక్కాల్‌ టెంపుల్ ఉంది. ఇక్కడ కేవలం ఆడవారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇందులోకి పురుషులు అస్సలు వెళ్లకూడదు. మగవారిపై ఇప్పటికీ అసమానత, మగవారు వెళ్లకూడని ఆలయాలు ఇవే.

|

ఆలయాల్లోనూ అసమానత ఉంటుందా? అంటే ఉంటుంది. కొన్ని ఆలయాల్లోకి ఆడవారికి ప్రవేశం ఉండదు. మరికొన్ని ఆలయాల్లోకి పురుషులకు ప్రవేశం ఉండదు. మగవారికి ప్రవేశం లేని ఆలయాల గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఇటీవల శబరిమల ఆలయం గురించి ఈ విషయంలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇక కొన్ని ఆలయాల్లోకి కేవలం ఆడవారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. అక్కడ మగవారు వెళ్లడానికి అస్సలు అవకాశం ఉండదు. ఆ ఆలయాలు ఇవే.

కేరళలోని ఆట్టుక్కాల్‌ ఆలయం

కేరళలోని ఆట్టుక్కాల్‌ ఆలయం

కేరళలోని తిరువనంతపురానికి సమీపంలో ఆట్టుక్కాల్‌ టెంపుల్ ఉంది. ఇక్కడ కేవలం ఆడవారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇందులోకి పురుషులు అస్సలు వెళ్లకూడదు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా మగవారు ఆలయంలోకి ప్రవేశిస్తే వారికి పాపం తగులుతుంది. ఆట్టుక్కాల్ ఆలయంలో నిర్వహించే ప్రతి ఉత్సవానికి కేవలం ఆడవారు మాత్రమే వెళ్తారు.

పొంగలా ఉత్సవం

పొంగలా ఉత్సవం

ఏటా ఇక్కడ వారం రోజులు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో కేవలం మహిళలు మాత్రమే అన్ని కార్యకళాపాల్లో పాల్గొనాలి. ఏటా ఫిబ్రవరి లేదా మార్చిలో జరిగే పొంగలా ఉత్సవం ఇక్కడ ఘనంగా జరుగుతుంది. ఉత్సవంలో భాగంగా ఆడవారు అమ్మవారి ఆలయం ప్రాగణంలోనే వంట వండి అమ్మావారికి నైవేద్యం సమర్పిస్తారు. అయితే ఎంతో ఘనంగా జరిగే ఈ ఉత్సవంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మగవారు పాల్గొనకూడదు.

రాజస్తాన్ లోని బ్రహ్మ ఆలయం

రాజస్తాన్ లోని బ్రహ్మ ఆలయం

ఇక రాజస్థాన్ లోని బ్రహ్మ ఆలయంలోకి కూడా మగవారికి ప్రవేశం ఉండదు. ఈ ఆలయంలోకి పురుషులకు ప్రవేశం లేకపోవడానికి ఒక కారణం ఉంది. బ్రహ్మ దేవుడు ఒక యాగాన్ని సరస్వతి లేకుండా మరో ఆమెతో చేస్తాడు.

గాయత్రీ అనే ఆమెను బ్రహ్మ వివాహం చేసుకుని ఆమెను పక్కన కూర్చో బెట్టుకుని యాగం పూర్తి చేస్తాడు.

బ్రహ్మ ఆలయం

బ్రహ్మ ఆలయం

అక్కడే బ్రహ్మ ఆలయం నిర్మించారు. దీంతో సరస్వతికి కోపం వచ్చి బ్రహ్మ యాగం చేసిన ఈ చోటుకు ఎవరైనా మగవారు వస్తే వారి దాంపత్యంలో సమస్యలు వస్తాయని శపించింది. భర్త మీద కోపాన్ని మగవారి అందరిపై చూపడంతో ఈ ఆలయంలోకి మగవారికి ప్రవేశం లేదు.

కేరళలోని చెంగన్నూర్‌ భగవతి

కేరళలోని చెంగన్నూర్‌ భగవతి

ఇక కేరళలోని మరో ఆలయంలోకి కొన్ని రోజులు మగవారికి ప్రవేశం ఉండదు. చెంగన్నూర్‌ భగవతి అనే ఆలయంలోకి కొన్ని రోజులు ఆడవారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి ప్రతి నెల రుతుస్రావం అవుతుందని భక్తుల నమ్మకం. అమ్మవారిపై పై కప్పే గుడ్డ ఎప్పుడైతే ఎర్రగా మారుతుందో అప్పుడు అమ్మవారికి రుతుస్రావం అయ్యిందని అర్థం.

మూడు నాలుగు రోజులు మాత్రమే

మూడు నాలుగు రోజులు మాత్రమే

ఆ సమయంలో మూడు నాలుగు రోజులు కేవలం మహిళలకు మాత్రమే ఆలయంలోకి అనుమతి ఉంటుంది. అప్పుడు ఆలయం మహిళలతో కిటకిటలాడుతుంది. ఆడవారే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు.

కన్యకా పరమేశ్వరి టెంపుల్

కన్యకా పరమేశ్వరి టెంపుల్

ఇక కన్యా కుమారిలో ఉన్నటువంటి కన్యకాపరమేశ్వరి టెంపుల్లోకి కూడా ఆడవారికి ప్రవేశం ఉండదు. ఇక్కడ అమ్మవారిని భగవతీ అమ్మవారిగా పిలుస్తారు. ఈ టెంపుల్ లోకి కూడా మగవారికి ప్రవేశం ఉండదు.

బిహార్ లోని మాతా టెంపుల్

బిహార్ లోని మాతా టెంపుల్

బిహార్ లోని ముజఫర్‌ పూర్‌ నగరంలో మాతా టెంపుల్ లోకి కూడా కొన్ని రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ సమయంలో ఆలయంలోకి కేవలం ఆడవారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. మగవారు వెళ్లడానికి అవకాశం లేదు.

సతాభ్యలో..

సతాభ్యలో..

ఇక ఒడిశాలో కేంద్ర పార డిస్ట్రిక్ లో సతాభ్య అనే ఊరిలో ఉండే అమ్మవారి ఆలయంలోకి మగవారికి అస్సలు ప్రవేశం లేదు.అందులో ఆడవారు మాత్రమే పూజలు నిర్వహించేవారు. అమ్మవారి విగ్రహాలను ఆడవారు మాత్రమే తాకేవారు. అయితే కొన్నాళ్ల క్రితం ఆ గ్రామం ముంపునకు గురి కావడంతో ఊరిని మరో చోటుకి తరలించారు. ఆలయంలోని అమ్మవారి విగ్రహాలను గ్రామస్థులు తమ కొత్త ఊరులోకి తీసుకెళ్లాలనుకున్నారు. అయితే అప్పుడు ఆడవారికి విగ్రహాలను మరో చోటుకి తరలించే శక్తి లేకపోవడంతో మొదటి సారి పురుషుల సాయం తీసుకున్నారు.

సంతోషి మాత టెంపుల్

సంతోషి మాత టెంపుల్

ఎక్కడైనా సరే సంతోషి మాత టెంపుల్ లోకి మగవారికి అనుమతి ఉండదు. ఆడవారు, పెళ్లికాని అమ్మాయిలే ఎక్కువగా సంతోషి మాత ఆలయానికి వెళ్తారు. అలాగే అమ్మవారి వ్రతాలు చేస్తారు. ఒకవేళ ఎక్కడైనా సంతోషి మాత ఆలయంలోకి మగవారిని అనుమతించినా అలాంటి మగవారు చాలా నిష్టలు పాటించి వెళ్లాలి.

English summary

These ten Temples in India where men are not allowed

These ten Temples in India where men are not allowed
Story first published:Thursday, August 2, 2018, 11:58 [IST]
Desktop Bottom Promotion