Latest Updates
-
మీ సోదరుడి రాశి చక్రం ఆధారంగా ఈ రాఖీలు కడితే.. వారి సంతోషానికి ఢోకా ఉండదు.! -
పకోడీలు, బజ్జీలు బోర్ కొట్టాయా? అయితే ఈ కరకరలాడే మునగకాయ స్నాక్ ట్రై చేయండి! -
డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ ఏ టైంకి తింటున్నారు? ప్రాణగండం ఉంది జాగ్రత్త! -
సోదరి లేకపోతే ఎవరు రాఖీ కట్టవచ్చు.. రక్షాబంధన్ ఉద్దేశం, నియమాలు తెలుసుకోండి.! -
మై బ్రదర్, మై సూపర్ హీరో..మీ సోదరుడికి రాఖీ విషెస్ చెప్పండిలా -
టేస్టీ అండ్ క్రంచీ స్నాక్ ..కరకరలాడే శనగపిండి మసాలా పల్లీలు ఇలా చేసుకోండి -
తెల్ల ఇడ్లీ కాదు..అసలైన శక్తి ఉన్న నల్ల ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
నేపాల్ ను వణికించిన జలప్రళయం.. వరదల్లో చిక్కుకుంటే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? -
Budha nakshatra gochar 2026 : పూర్వఫల్గుణి నక్షత్రంలోకి బుధుడు..ఆగస్టు 29 నుంచి ఈ 4 రాశులకు అగ్నిపరీక్షే! -
ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేదా? అయితే కప్పు బియ్యంతో మల్లెపూవు లాంటి మెత్తని నీర్ దోశ చేసుకోండిలా!
భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త ఎట్టి పరిస్థితిలో చేయకూడని పనులు ..!!
హిందూ సంప్రదాయం ప్రకారం భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త కొన్ని ఆఛారాలు పాటించాలి.అవేంటంటే...
హిందూ సంప్రదాయం ప్రకారం భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త కొన్ని ఆఛారాలు పాటించాలి. అంతే కాదు భార్య కోరికమేరకు నడుచుకోవాలి. ఆమెకు ఏది ప్రీతికరమైనదో తెలుసుకుని ఆ వస్తువులను తెచ్చిపెట్టాలి.
ఆమె సంతోషంగా ఉంటే ఆమె కడుపులోని బిడ్డకూడా సంతోషంగా..ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే భర్త చేయకూడని కొన్ని ఆచారాలు కూడా మన హిందూ సంప్రదాయాలలో ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...

గర్భిణీ స్త్రీలు కోరిన కోరికలు తీర్చడం భర్త ముఖ్య ధర్మం.
గర్భిణీ స్త్రీలు కోరిన కోరికలు తీర్చడం భర్త ముఖ్య ధర్మం. అలా చేయడం వల్ల చిరాయుష్మంతుడగు పుత్రుడు జన్మిస్తాడట. భార్య కోరికలు తీర్చకపోతే దోషము కలుగుతుందట.

సముద్ర స్నానం చేయడం
భార్య గర్భిణీగా ఉన్నప్పుడు చెట్టు నరకడం, సముద్ర స్నానం చేయడం వంటి పనులు చేయకూడదు.

భర్త క్షౌరము చేయించుకోరాదట.
భార్య గర్భం దాల్చిన 6 నెలలు తర్వాత భర్త క్షౌరము చేయించుకోరాదట.

శవాన్ని మోయడం
భార్య గర్భిణిగా ఉన్న సమయంలో శవాన్ని మోయడం వంటి పనులు చేయకూడదట.

విదేశీ ప్రయాణాలు
భార్య గర్భం ధాల్చిన తర్వాత విదేశీ ప్రయాణాలు చేయడం భార్యను విడిచి దూరంగా వెళ్ళడం లాంటివి చేయకూడదట.

తీర్థయాత్ర,
భార్య గర్భం దాల్చిన ఏడవ నెల మొదలైనప్పటి నుండి క్షౌరము, తీర్థయాత్ర, నావ యొక్కుట వంటి పనులకు దూరంగా ఉండాలి.

గ్రుహారంభము కానీ, వాస్తుకర్మ కానీ, చేయకూడదట.
పర్వతారోహణము, యుద్దము చేయుట వంటివి వాటికి దూరంగా ఉండాలి. ఇంటికి స్తంభ ముహోర్తము గానీ, గ్రుహారంభము కానీ, వాస్తుకర్మ కానీ, చేయకూడదట. ఈ పనులకు దూరంగా ఉండటమే మంచిదట.

శవాన్ని అనుసరించి వెళ్ళరాదు.
అలాగే శవాన్ని అనుసరించి వెళ్ళరాదు. అలాగే ప్రేతకర్మలు చేయకూడట. ఇంకా ఉపశమనం, పిండదానం వంటి పనులు కూడదు.



Click it and Unblock the Notifications