Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
2025 Ugadi: ఉగాది రోజున ఈ పనులు అస్సలు చేయకూడదు.. చేస్తే దారిద్రమంతా మీకే!
ఉగాది అనేది తెలుగు ప్రజలకు ఎంతో ప్రత్యేకమైన పండగ. ఈ పండగతోనే తెలుగు ప్రజలకు నూనత సంవత్సరం ప్రారంభం అవుతుంది. రెండు రాష్ట్రాల్లోని ప్రజలకు ఇది ఎంతో ప్రత్యేకమైన ఇష్టమైన పండగ ఇది. ఈ పవిత్రమైన పండగను సంప్రదాయ బద్ధంగా, తెలుగు ఆచారాల ప్రకారంగా జరుపుకుంటారు. తమ కుటుంబాల నుంచి దూరంగా ఉన్నా.. ఎక్కడ ఉన్నా ఈ పండగను సంప్రదాయ బద్ధంగా జరుపుకుంటారు. అయితే అంతటి పవిత్రమైన పండగ రోజున ప్రతి ఒక్కరూ కొన్ని పనులను చేయకూడదు. ఆ పనులు చేయడం వలన అపశకునాలు, చెడు జరిగే అవకాశం ఉంటుందని పండితులు చెబుతుంటారు. ఆ సంవత్సరం మొత్తం అత్యంత దుర్భరమైన ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. అసలు ఉగాది రోజున ఎలాంటి పనులు చేయకూడదు? చేస్తే ఏమవుతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఉగాది రోజు చేయకూడని పనులు
ఇంటిని శుభ్రం చేయడం
ఉగాది రోజున ఎట్టి పరిస్థితుల్లో ఇంటిని శుభ్రపరచకూడదు. ఇలా చేయడం వలన ఇంట్లోని లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందని చెబుతుంటారు. అందుకే చాలా మంది నిపుణులు, పెద్దలు ఉగాది రోజున ఇంటిని శుభ్రపరచకూడదని, శుభ్రపరిస్తే మంచిది కాదని చెబుతారు. ఒకవేళ మీ ఇంటిని శుభ్రపరుచుకోవాలనుకుంటే ముందురోజే ఇంటిని శుభ్రపరుచుకోవాలి.

మాంసాహారం, మద్యం సేవించడం
ఉగాది చాలా సాంప్రదాయకమైన పండగ అని తెలిసిందే. ఈ సాంప్రదాయకమైన పండగకు తెలుగు ఆచారాల్లో చాలా ప్రత్యేకత ఉంటుంది. అందుకే ఈ పండగ రోజున ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తినడం, మద్యం సేవించడం వంటివి చేయకూడదు. ఇలా చేయడం అశుభం అని, ఇలా చేస్తే నెగెటివ్ ఎనర్జీ, దుష్ప్రయోజనాలు కలుగుతాయని చెబుతుంటారు. అందుకే ఈ ఉగాది రోజున మీరు మాంసాహారం తినడం, మద్యం సేవించడం తినకూడదు.
అప్పులు ఇవ్వడం, తీసుకోవడం
ఉగాది రోజున చేయకూడని పనుల్లో అప్పులు తీసుకోవడం, ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని చెబుతుంటారు. ఆరోజున అప్పులు తీసుకున్నా, ఇచ్చినా చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అప్పు ఇస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని, ఆ డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటుందని చెబుతుంటారు. అలాగే అప్పు తీసుకుంటే ఆ అప్పు తీరడానికి చాలా సమయం తీసుకుంటుందని, తీరడం చాలా కష్టమని పేర్కొంటుంటారు.
గొడవలకు దిగడం
ఉగాది అనేది చాలా ప్రత్యేకమైన పండగ. తెలుగు ప్రజలకు తొలి పండగ. అలాంటి పండగ రోజున ఎలాంటి పరిస్థితుల్లో అయినా అస్సలు గొడవలు దిగకూడదని చెబుతుంటారు. ఇతరులను గేలి చేయడం కూడా చాలా ప్రమాదకరమని, ఇలా చేయడం వలన చెడు ఫలితాలు కలుగుతాయని చెబుతుంటారు. అలాగే సంవత్సరం మొత్తం ఇలాంటి గొడవలే వస్తాయని పేర్కొంటుంటారు.
చెత్తను బయట పడేయడం
పవిత్రమైన ఉగాది పండుగ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోని చెత్తను బయట పడేయకూడదని చెబుతుంటారు. ఒకవేళ మీ ఇంట్లో చెత్త ఉంటే ముందు రోజు సాయంత్రం లోపు ఇంటిని శుభ్రం చేసి చెత్త బయట పడేయాలి. ఉగాది రోజు చెత్త బయట పడేయడం వలన ఇంట్లో సంపద నశిస్తుంది.
చిరిగిన దుస్తులు ధరించడం
ఉగాది చాలా ప్రత్యేకమైన పండగ అని తెలిసిందే. చాలా సాంప్రదాయకమైన పండగ. ఇలాంటి పండగ రోజున కచ్చితంగా కొత్త దుస్తులను ధరించాలి. విడిచిన బట్టలను ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు. అలాగే చిరిగిన దుస్తులను కూడా ధరించకూడదు. అలా చేయడం వలన ఇంట్లోకి దరిద్రం వస్తుందని చెబుతుంటారు. ఈ పనులను మాత్రం ఈ ఉగాది రోజున అసలు చేయకూడదు.



Click it and Unblock the Notifications