Latest Updates
-
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..!
మంగళవారం ఏ పనులు చేయాలి? ఏ పనులు చేయకూడదు...
మంగళ వారం కుజునికి సంకేతం . కుజుడు ధరిత్రి పుత్రుడు. కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది. భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
కుజుడు కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. కనుకే కుజగ్రహ ప్రభావం ఉండే మంగళవారంనానడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు. వీటితో పాటు మరికొన్ని పనులు చేయకూడదు. అవేంటో తెలుసుకోవాలంటే ఈక్రింది స్లైడ్ క్లిక్ చేయండి...

మంగళవారం ఏ పనులు చేయకూడదు.?
మంగళవారం రోజున గోళ్ళు కత్తిరించడం, క్షవరం మొదలైన పనులు చేయకూడదు.

మంగళవారం ఏ పనులు చేయకూడదు.?
మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం. అప్పు తీసుకున్నట్లైతే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది.

మంగళవారం ఏ పనులు చేయకూడదు.?
మంగళవారం దైవ కార్యాలకూ, విద్యా, వైద్య పరమైన బుణాలకు ఇది వర్తించదు.

మంగళవారం ఏ పనులు చేయకూడదు.?
మంగళవారం రోజును చాలా మంది కొత్త బట్టలు వేసుకోరు. వేసుకోరాదు కూడా.

మంగళవారం ఏ పనులు చేయకూడదు.?
అలాగే మంగళవారం తలంటు స్నానం చేయడం శుభకరం కాదంటారు .

మంగళవారం ఏ పనులు చేయకూడదు.?
ముఖ్యమైన ప్రయాణాలు చేయవల్సి వస్తే భగవంతుని ధ్యానించి తర్వాత ప్రయాణం సాగించాలి.

మంగళవారం ఏ పనులు చేయకూడదు.?
మంగళవారం ఉపవాసం చేసే వారు రాత్రి పూట ఉప్పు వేసిన పదార్థాలు తినరాదు.

మంగళవారం చేయదగిన పనులు:
మంగళవారం ఆంజనేయున్ని ధ్యానించడం వల్ల ధైర్యం చేకూరుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం వల్ల కుజగ్రహ ప్రభావం కారణంగా కలిగే అనేక ప్రమాదాలను నివారించుకోవచ్చు.

మంగళవారం చేయదగిన పనులు:
మంగళవారం కాళికాదేవిని ధ్యానించడం వల్ల శత్రువులపై జయం కలుగుతుంది.

మంగళవారం చేయదగిన పనులు:
కుజునికి ప్రీతిపాత్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరించడం, ఎరుపు రంగు పువ్వులతో ఇష్టదైవాన్ని పూజించడం వల్ల మంచి జరుగుతుంది. జాతకంలో కుజగ్రహం వక్ర ద్రుష్టితో చూస్తున్నట్లైతే ఎరుపు వస్త్రాలు ధరించరాదు.

మంగళవారం చేయదగిన పనులు:
హనుమంతుడిని సిందూరంతో పూజించడం వల్ల లేదా సుబ్రమణ్య స్వామికి పదకొండు ప్రదక్షిణలు చేయడం వల్ల దోష ప్రభావం తగ్గుతుంది.



Click it and Unblock the Notifications
