For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బక్రీద్ రోజున ప్రతి ఒక్కరూ చేయాల్సిన పనులు

ఇస్లామిక్ లోని చంద్ర క్యాలెండర్ ప్రకారం ధుల్-హిజ్జా నెల పదవ రోజున ఈ పండుగ వస్తుంది. ముస్లింలకు రంజాన్ అతి ముఖ్యమైన పండుగ ఏదైనా ఉందంటే అది బక్రీద్ పండుగే.

|

బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే జంతువు.. ఈద్ అంటే పండుగ అనే అర్థాలొస్తాయి. బక్రీద్ పండుగ అంటే జంతువును ఖుర్బాని ఇచ్చే పండుగ కాబట్టి దీనిని ఈదుల్ ఖుర్బాని అని కూడా అంటారు.

bakrid

ఇస్లామిక్ లోని చంద్ర క్యాలెండర్ ప్రకారం ధుల్-హిజ్జా నెల పదవ రోజున ఈ పండుగ వస్తుంది. ముస్లింలకు రంజాన్ అతి ముఖ్యమైన పండుగ ఏదైనా ఉందంటే అది బక్రీద్ పండుగే. ప్రపంచంలోని ప్రతి మూలలో ఉన్న ముస్లింలు ఈ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.

bakrid1

బక్రీద్ పండుగ విశేషాలేంటో తెలుసుకుందాం..
మహ్మదీయుల సంవత్సరాన్ని హిజ్రీ అంటారు. హిజ్రీ అంటే వలస వెళ్లడం అని అర్థం. మహ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనాకు వెళ్లడాన్ని హిజ్రీగా పేర్కొంటారు. ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలన్నది ఇస్లాం సూత్రాల్లో ఒకటి. అది కూడా తాము కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే ఆ యాత్ర చేయాలని నిబంధన సైతం ఉంది. త్యాగనిరతతో పాటు మనోవాంఛ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలను కూడా విడిచిపెట్టి మానవత్వం వెదజల్లాలన్నదే బక్రీద్ పండుగలోని ఆంతర్యం.

అంతిమ దైవ గ్రంథం ఖురాన్ ప్రకారం అస్ సాఫ్ఫాత్ 37 : 100-113లో బక్రీద్ కు సంబంధించి పూర్తి వివరాలు మనకు లభిస్తాయి. ఇస్లాం ధర్మంలోని ప్రవక్తల్లోనే పెద్ద ప్రవక్త ఇబ్రహీం. ఆయనకు దాదాపు 90 సంవత్సరాల వయసులో ఒక బిడ్డ పుడతారు. ఎన్నాళ్లకో పుట్టిన ఆ బిడ్డకు ఇస్మాయిల్ అని పేరు పెడతారు. ఒకరోజు ఇస్మాయిల్ మెడపై కత్తిపెట్టి కోస్తున్నట్లు ఇబ్రహీం కలగంటాడు. అల్లాహ్ ఖుర్బాని కోరుతున్నాడేమోనని ఓ ఒంటెను బలిచ్చేస్తాడు. అయినా, మళ్లీ అదే కల వస్తుంది. దీంతో తన కుమారుడినే అల్లాహ్ బలిదానం కోరుకుంటున్నారని భావించి ఇస్మాయిల్ ను బలి ఇచ్చేందుకు సిద్ధపడతాడు. ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి మరి జుబాహ్ కు ఇబ్రహీం
సిద్ధమవుతుండగా అతని త్యాగానికి ముగ్ధుడైన అల్లాహ్ ఇందుకు బదులుగా ఓ జీవాన్ని బలి ఇవ్వాలని జిబ్రాయిల్ అనే దూత ద్వారా సమాచారం పంపుతాడు. అప్పటి నుండి బక్రీద్ పండుగ రోజున ఖుర్బాని ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని ముస్లింలు భావిస్తున్నారు.

ఖుర్బాని అంటే పేదలకు మాంసాన్ని దానం ఇవ్వడం, త్యాగం చేయడం అనే అర్థాలున్నాయి. ఖుర్బాని అంటే సాన్నిధ్యం, సామీప్యం, సమర్పణ, త్యాగం అనే అర్థాలు కూడా వస్తాయి. అంటే దేవ సాన్నిధ్యాన్ని పొందడం అని ముస్లింలు నమ్ముతారు. దైవానికి సమర్పించేందుకు దైవం కోసం త్యాగం చేయడం అని భావిస్తారు. కానీ, ఖుర్బాని అంటే రక్తమాంసాలు సమర్పించడం కాదని, రక్తం లాంటివి అల్లాహ్ కు చేరవని, భక్తి, పారాయణత హృదయంలో జనించే త్యాగభావం, భయం, భక్తి మాత్రమే ఆయనకు చేరుతాయని ముస్లింలు నమ్ముతారు. అదొక్కటే కాదు ప్రాణత్యాగానికైనా వెనుకాడబోమని అర్థం అని, ఇదే ఖుర్బాని పరమార్థమని ముస్లిం పెద్దలు కొందరు చెబుతుంటారు.
ముందుగా మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగం పేదలకు, రెండో భాగం బంధువులకు, మరో భాగం తమ కుటుంబ సభ్యుల కోసం
వినియోగిస్తారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరూ బక్రీద్ రోజున ఖుర్బాని ఇస్తారు. బక్రీద్ తర్వాతి రెండు రోజులు కూడా ఖుర్బాని ఇస్తూనే ఉంటారు.

bakrid2

కోడి పుంజును బలి ఇవ్వరాదు
ఖుర్బానిగా సమర్పించే జంతువులలో అవయవ లోపం లేనివి, ఆరోగ్యకరమైనవిగా ఉండాలనే నిబంధన కూడా ఉంది. ఒంటె, మేక, లేదా గొర్రెను దైవమార్గంలో సమర్పించాలి. ముస్లింలలో వారి వారి స్తోమత మేరకు ప్రతి ముస్లిం దీనిని తప్పనిసరిగా ఆచరించాలి. అల్లాహ్ నియమ నిబంధనల మేరకు ఖుర్బానిగా కోడిపుంజును అస్సలు బలి ఇవ్వరాదు. ఐదేళ్ల వయసు పైబడిన ఒంటె, రెండేళ్లు పైబడిన ఎద్దు, కనీసం ఏడాది వయసున్న మేక, గొర్రెలను ఎక్కువగా బలి ఇవ్వాలనే నిబంధన ఉంది. ఖుర్బాని వడ్డీతో కూడిన రుణం ఇవ్వడం, తీసుకోవడం వంటివి కూడా అసలు చేయకూడదు.

bakrid3

ప్రతి ఒక్కరూ ప్రార్థనలు
బక్రీద్ పండుగ రోజున ముస్లింలందరూ విధిగా ప్రార్థనలు చేస్తారు. పురుషులంతా మసీదులకు వెళ్లి ప్రార్థనలు చేస్తారు. ఇక మహిళలు వారి ఇళ్లలోనే ప్రార్థనలు చేస్తారు. అంతకంటే ముందు ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. సువాసన వెదజల్లే అత్తరును బట్టల మీద చల్లుకుంటారు. ప్రార్థన తర్వాతే మిగతా కార్యక్రమాలను మొదలు పెడతారు.

bakrid

బంధువులకు బహుమతులు..
బక్రీద్ పండుగ రోజున ముస్లింలంతా తమ బంధువులకు, సన్నిహితులను సందర్శిస్తారు. బక్రీద్ శుభాకాంక్షలను తెలుపుకుంటారు. ఈ సంతోషకరమైన వేడుకను కలిసిమెలసి జరుపుకుంటారు. అనంతరం ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకుంటారు. ఇంకొందరు బహుమతులు కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. చివరిగా బక్రీద్ వేడుకలు ముగిసిన తర్వాత వారి వారి కుటుంబసభ్యులంతా కలిసి దేవుని ఆశీర్వాదాలను కోరుతారు.

bakrid5

దానం ఇవ్వడం..
ముస్లింల ఆచారాలలో దానమివ్వడం అనేది అత్యంత ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ పేదలకు తమకు తోచినంత తప్పనిసరిగా దానామివ్వాలనే నిబంధన కూడా ఉంది. అలాగే బట్టలు, నగదుతో పాటు ఇంకా ఏవైనా ఇతర వస్తువులను కూడా దానం ఇవ్వాలి.

bakrid6

English summary

Things One Must Do On Bakrid

There is also a provision for animals to be healthy and free of organ defects. The camel, the goat, or the lamb must be offered in the way of God. Every Muslim must practice this to the extent of their consent among Muslims. Chickens should not be sacrificed in accordance with the rules of Allah. A five-year-old camel, two-year-old bull, at least a year-old goat and a sheep are required to be sacrificed.
Story first published:Saturday, August 10, 2019, 18:20 [IST]
Desktop Bottom Promotion