For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కృష్ణాష్టమి 2019: కృష్ణాష్టమి నాడు చేయకూడని పనులను గురించి తెలుసుకుందాం!

|

దేశవ్యాప్తంగా కృష్ణ భక్తులు అత్యంత భక్తిప్రపత్తులతో మరియు ఉత్సాహంతో జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు. శ్రీకృష్ణుని జన్మదినోత్సవం సందర్భంగా జరుపుకునే ఈ పండుగ రోజున, ప్రతి ఒక్కరూ శ్రీ కృష్ణుని జన్మ వృత్తాంతాన్ని గుర్తు చేసుకుంటారు. కృష్ణుడి తండ్రి అయిన వాసుదేవుడు, కృష్ణుడిని సురక్షితంగా ఉంచటానికి, వానహోరులో యమునా నదిని దాటుకుంటూ అతన్ని నందుని ఇంటికి చేర్చాడు.

విష్ణు భగవానుని ఎనిమిదవ అవతారం అయిన శ్రీకృష్ణుడు, భూమిపై ధర్మాన్ని పునరుద్ధరించడానికి జన్మించాడు. ఈ సంవత్సరం జన్మాష్టమి, ఆగస్టు 24, 2019న జరుపుకోబోతున్నారు. కృష్ణ భక్తులు చాలా మంది, ఈ రోజున ఉపవాసం పాటిస్తారు. కొందరు శ్రీకృష్ణుని అనుగ్రహ ప్రాప్తికై, కొన్ని నియమాలను అనుసరిస్తారు. ఈ రోజు చేయకూడని కొన్ని పనులను గురించి, ఇప్పుడు తెలుసుకుందాం.

Things that you shouldnt do on Krishna Janmashtami

తులసి ఆకులను కోయడం :

జన్మాష్టమి రోజున, తులసి ఆకులను కోయరాదు. తులసి మొక్క విష్ణువుకు చాలా ప్రియమైనది. తులసి విష్ణువుని వివాహం చేసుకోవాలని తీవ్రమైన తపస్సు చేసింది. అయితే, తులసి ఆకులను విష్ణువుకు సమర్పించడానికైతే మాత్రం, కోయవచ్చు.

పేదవారిని అగౌరపరిచేలా ప్రవర్తించరాదు:

కృష్ణుడు అందరిని ఆర్థిక హోదాతో సంబంధం లేకుండా ప్రేమిస్తాడు. అతని ప్రియమిత్రుడైన సుధాముడు, పేదవాడు అయినప్పటికీ కృష్ణుడికి అత్యంత ప్రియమైనవాడు. కనుక ఈ రోజున, పేదలను అవమానించడం, కృష్ణుడిని అసంతృప్తికి లోనుచేస్తుంది. పేదవారిని అగౌరవ పరచడం, శని దేవునికి కోపాన్ని కలిగిస్తుందని నమ్మకం. ఈ రోజున అగౌరవపరచకుండా, పేదలను సత్కరించాలి. వీలైతే, జన్మాష్టమి నాడు పేదలకు విరాళం ఇవ్వాలి.

Things that you shouldnt do on Krishna Janmashtami

చెట్లను నరకడం:

జన్మాష్టమి నాడు చెట్లను నరకడం కూడా దురదృష్టకరం అని భావిస్తారు. ఒక కుటుంబంలోని సభ్యుల సంఖ్యకు తగినన్ని మొక్కలు నాటాలి. ఇలా చేస్తే, ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. మహాభారతం యొక్క ఎనిమిదవ అధ్యాయంలో కృష్ణుడు తాను అన్నింటా మరియు అంతా ఉన్నానని, ఆయనలో అంతా ఉన్నాడని తెలిపాడు. కనుక, ఈ రోజున మనం ఎవరికైనా హాని తలపెట్టే, ఆలోచన కూడా చేయకూడదు.

మాంసాహారాన్ని భుజించరాదు:

హిందూమతం ప్రకారం, భక్తులు మాంసాహార ఆహారాన్ని తీసుకోరాదు. చతుర్మాస సమయంలో, మాంసాహారం నుండి దూరంగా ఉండాలి. నాలుగు నెలల చతుర్మాస సమయంలో, విష్ణువు నిద్రిస్తున్నందున, శివుడు ఆ బాధ్యతలను తాను తీసుకుంటాడు. జన్మాష్టమి రోజున, మద్యం కూడా సేవించరాదు.

భౌతిక సంబంధాలు:

జన్మాష్టమి నాడు బ్రహ్మచార్యం పాటించాలి. ఈనాడు శారీరక సంబంధాల నుండి దూరంగా ఉండాలి. ఈ రోజున పవిత్రమైన తనుమనస్సులతో కృష్ణుడిని పూజించాలి. ఈ రోజున, బ్రహ్మచర్యాన్ని పాటించకపోతే, కృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడానికి చేసిన అన్ని ప్రయత్నాలు వృథా అవుతాయి.

ఆవును అగౌరవపరచడం:

కృష్ణుడిని తరచుగా గోపాలకుడిగా చిత్రీకరిస్తారు. అతను తన చిన్ననాటి సమయంలో, ఆవులతో దూడలతో ఆడుతున్న చిత్రాలు, ఆయనకు ఆవులు ఎంత ప్రియమైనవో తెలియజేస్తున్నాయి. ఆవులను పూజించే వ్యక్తికి, తప్పక కృష్ణుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. ఆవులను అగౌరవపరిస్తే, కృష్ణుడిని అసంతృప్తికి గురిచేసినట్లే! జన్మాష్టమి రోజున, ఒక గోశాలకు విరాళము ఇవ్వడం, లేదా ఒక గాయపడిన ఆవుకు ఆహారాన్ని అందించడానికి సహాయం చేస్తే మంచిది.

English summary

Things that you shouldn't do on Krishna Janmashtami

Janmashtami falls on the eighth day during the Krishna Paksha in the month of Bhadrapad. Krishna was the eighth child of Devaki and Vasudev, and he was carried to Gokul amidst the heavy rains so that he could be saved from Kamsa. While a majority of the Hindus observe a fast on this day, there are some rules which are to be followed by all.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more