Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సంక్రాంతికి వారం నుంచి ఈ ఒక్క మంత్రం జపిస్తే చాలు.. లక్ష్మీదేవి మీపై డబ్బుల వర్షం కురిపిస్తుంది!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభా సంతరించుకుంది. గోదావరి జిలాల్లో ఇప్పటికే హరిదాసుల సందడి మొదలయ్యింది. పట్టణాల్లో ఉన్న ప్రజలు సంక్రాంతికి ఊరెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు, ప్రయాణాలు మొదలుపెట్టేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సంక్రాంతిని ఘనంగా నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యారు. ఎన్నో ఏళ్లుగా అనాదిగా వస్తున్న ఈ సంక్రాంతి నాడు ప్రజలు ఓ చిన్న పని చేయడం వల్ల సకల ఐశ్వర్యం వారికి కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. దానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఇంటిని శుభ్రంగా ఉంచడం
మకర సంక్రాంతి అంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల మకర సంక్రాంతి ఏర్పడుతుంది. ఆ రోజు చాలా ప్రత్యేకమైనది. దేవతలు అనుగ్రహించే రోజుగా చెప్పుకుంటారు. అలంటి పవిత్రమైన రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలా శుభ్రంగా ఉంచుకోవడం అనేది లక్ష్మీదేవి చాలా ఇష్టం. సంక్రాంతికి ముందు ఇంటిని బాగా శుభ్రం చేసి, పూలు, తోరణాలు అలంకరించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

దీపారాధన
దీపారాధన ఏరోజైనా చేయడం చాలా మంచిది. కానీ సంక్రాంతి రోజు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం చాలా శుభాలను తీసుకొస్తుంది. లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవడానికి ఆవు నెయ్యితో దీపారాధనం చేయడం శ్రేయస్కరం. ఇది ఆయుష్షుతో పాటు ఇంట్లో ఆర్ధిక పరిస్థితులను కూడా మెరుగుపరుస్తుంది.
పూజ
మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పండగకు పూజలు చేస్తుంటాము. దేవతలకు పూజలు చేసిన తరువాతే పండగను జరుపుకుంటాము. అలానే ఈ సంక్రాంతి కూడా లక్ష్మీదివిని పూజించడం చాలా మంచిది. లక్ష్మీదేవికి పూలు, ఐవేద్యం, దీపం అగరబత్తి వంటివి సమర్పించి పూజించడం ద్వారా ఆమె ప్రసన్నం అవుతుంది. వరాల జల్లు కురిపిస్తుంది.
దానం
సంక్రాంతి రోజున దానం చేయడం చాలా మంచిదని సిద్థాంతులతో పాటు మన పెద్దలు కూడా చెబుతున్నారు. సంక్రాంతి రోజున తెల్ల నువ్వులు దానం చేస్తే చాలా మంచిదని, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెబుతున్నారు. మీకు వీలైతే సంక్రాంతికి దానం చేయడం మర్చిపోకండి. అలాగే నువ్వులు దానం చేయడం కచ్చితంగా చేయండి
పవిత్ర నదుల్లో స్నానం
సంక్రాంతికి ఉదయాన్నే పవిత్రమైన నదుల్లో స్నానం చేయడం చాలా మంచిది. పవిత్రమైన నదుల్లో స్నానం చేయడం వల్ల పాపాలు తొలిగిపోతాయి. అలాగే ఎన్నో పుణ్యఫలాలు దక్కుతాయని పెద్దలు చెబుతున్నారు. అందుకే ఈ సంక్రాంతి రోజున నదిలో స్నానం చేయడం మాత్రం మర్చిపోకండి.
పితృ తర్పణం
సంక్రాంతికి దేవతలను మాత్రమే కాదు, పితృ దేవతలను కూడా పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట. పితృ దేవతలను పూజించి వారికి నైవేద్యం సమర్పించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని చెబుతున్నారు.
ఈ మంత్రం పఠించండి
సంక్రాంతి పండగ రోజున ఓం హ్రీమ్ హ్రీమ్ శ్రీ సూర్య సహస్రకిరణాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే మంచి శుభ పరిణామాలు జరుగుతాయట. మకర సంక్రాంతి రోజున ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే.. కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతారు. మకర సంక్రాంతి రోజు బియ్యం, కిచిడీ, బెల్లం, నల్ల నువ్వులు, దుప్పట్లు దానం చేస్తే సూర్యుడు, శని, బుధుడు, గురు, చంద్రుడు, రాహు దోషాలు తొలగిపోతాయట.



Click it and Unblock the Notifications