For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కలహ ప్రియుడు నారద ముని గురించి ఆసక్తికరమైన విషయాలు!

కలహ ప్రియుడు నారద ముని గురించి ఆసక్తికరమైన విషయాలు!

|

నారదుడి పేరు ప్రస్తావించని హిందూ పురాణం లేదు. నారదుడు లేదా నారద మహర్షిని కలహ ప్రియుడు, కలహ భోజనుడు అంటారు. పిల్లలు కూడా గుర్తుపడతారు. తలపై చిన్న కొప్పు, అందులో పూలు.. మెడలో దండ, చేతిలో చిడతలు, మహతి మీటుతూ మాటిమాటికీ నారాయణ మంత్రం జపించడం.. ఇదీ నారదుని తీరు.

Things You Need To Know About Narada Muni in Telugu

పురాణ పాత్రల్లో నారదుని గుర్తుపట్టడం ఎంత తేలికో అర్ధం చేసుకోవడం అంత కష్టం. నారదముని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..

అష్టాదశ పురాణాలు, రామాయణ, మహాభారతాల్లో

అష్టాదశ పురాణాలు, రామాయణ, మహాభారతాల్లో

అష్టాదశ పురాణాలు, రామాయణ, మహాభారతాల్లోనూ నారదుడు పాత్ర గురించి వివరించారు. బ్రహ్మ, సరస్వతి కుమారుడైన నారదుడు త్రిలోక సంచారి. సంగీత విద్యాంసుడైన నారదుడు సమాచారంతో జీవులను వివేకవంతులను గావించాడు.

తెలుగు సాహిత్యంలోనూ, తెలుగు సినిమాలలోనూ

తెలుగు సాహిత్యంలోనూ, తెలుగు సినిమాలలోనూ

తెలుగు సాహిత్యంలోనూ, తెలుగు సినిమాలలోనూ నారదుని కలహ ప్రియత్వం, వాక్చతురత తరచు ప్రస్తావించబడుతాయి. ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములలో నారదుని కథలు బహుళంగా వస్తాయి.

<strong>MOST READ:</strong>పరమశివుడు మరియు ఆయన రహస్యాలు MOST READ:పరమశివుడు మరియు ఆయన రహస్యాలు

నారాయణుడికి పరమ భక్తుడు

నారాయణుడికి పరమ భక్తుడు

అంతే కాదు నారాయణుడికి పరమ భక్తుడు. విరాట రూపంలోని శ్రీమహావిష్ణువును గుర్తించిన యోగి. రుషి సనత్కుమార చంద్యోగపనిషత్తు ఏడో భాగంలోని భూమ విద్య గురించి నారదుడుకి బోధించాడు. ఉపనిషత్తుల్లోని అత్యంత ఉన్నతమైన ఈ విద్యను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని నారద మహర్షికి సనత్కుమార సూచించాడు.

మహాభారతంలో నారదుడు కీలక పాత్ర పోషించాడు

మహాభారతంలో నారదుడు కీలక పాత్ర పోషించాడు

మహాభారతంలో నారదుడు కీలక పాత్ర పోషించాడు. పాండవుల వెన్నంటి ఉండి, యుధిష్ఠరుడికి ధర్మ మార్గాన్ని నిర్దేశించాడు. పన్నెండు మంది చిరంజీవుల్లో నారదుడు కూడా ఒకరు.

64 విద్యలకు అధిపతి

64 విద్యలకు అధిపతి

సజీవంగా ఉన్నాడు కాబట్టే మన మనసుల్లో నివశిస్తున్నాడు. 64 విద్యలకు అధిపతిగా పేర్కొంటారు. నారదుడి యొక్క భక్తి సూత్రాలను ఒక కళాఖండంగా చెప్పవచ్చు. భక్తి గురించి ఇతర పుస్తకాలతో పోలికలేని సూత్రాలు ఇవి. ఇందులో భక్తి అధికారం, తత్వశాస్త్రం గురించి స్పష్టంగా వివరించాయి. ఎలాంటి వారైనా అర్ధం చేసుకునే పదాలు ఇందులో ఉన్నాయి.

పరిపూర్ణమైన దేవదూత

పరిపూర్ణమైన దేవదూత

పరిపూర్ణమైన దేవదూత. ముల్లోకాలలో అలుపు లేకుండా సంచరించే శక్తి నారదుడి సొంతం. ఆ మార్గంలో కలిసిన ప్రతి ఒక్కరికీ సమాచారాన్ని భాగాలుగా పంచాడు. మానవులు, దేవతలు, రాక్షసులతోనూ ఒకేలా వ్యవహరించాడు.

దైవం జ్ఞానాన్ని ప్రసాదించే వ్యక్తి

దైవం జ్ఞానాన్ని ప్రసాదించే వ్యక్తి

దైవం జ్ఞానాన్ని ప్రసాదించే వ్యక్తిగా శబ్దకల్పద్రుమలో పేర్కొన్నాడు. నారదుడు కలహ ప్రియుడిగా ప్రసిద్ధి గాంచాడు. నారదుడు బ్రహ్మ మానసపుత్రుడు. సిసలైన ఋషిపుంగవుడు. అంతరంగం స్వచ్చంగా, నిర్మలంగా ఉంటుంది.

MOST READ:లక్ష్మీదేవికి అష్టరూపాలు ఎందుకు ? ఒక్కో రూపం విశిష్టత ఏంటి ?MOST READ:లక్ష్మీదేవికి అష్టరూపాలు ఎందుకు ? ఒక్కో రూపం విశిష్టత ఏంటి ?

నారద ముని ఏ పని చేసినా అది జగత్ కల్యాణానికే

నారద ముని ఏ పని చేసినా అది జగత్ కల్యాణానికే

మరి పురాణాల్లో ఎందరికో, ఎన్నోసార్లు తగవులు ఎందుకు పెడతాడంటే వాటి వెనుక మర్మం వేరే ఉంటుంది. ప్రతిదానికీ కార్య కారణ సంబంధం ఉంటుంది. నారద ముని ఏ పని చేసినా అది జగత్ కల్యాణానికే ఉపయోగపడుతుంది.

ఒకానొక సందర్భంలో జలంధురడనే రాక్షసుడు

ఒకానొక సందర్భంలో జలంధురడనే రాక్షసుడు

ఒకానొక సందర్భంలో జలంధురడనే రాక్షసుడు క్రూరంగా మారి దేవ, మానవులను హింసిస్తుంటే అతడి సంహారానికి నారదుడు యుక్తి పన్నాడు. శివుడి నుంచి వరం పొందడంతో జలంధరుడి ఆగడాలకు అడ్డుకట్టే లేకుండా పోయింది.

 పార్వతి అందాన్ని వర్ణించి జలంధురుడికి మోహం కలిగించాడు

పార్వతి అందాన్ని వర్ణించి జలంధురుడికి మోహం కలిగించాడు

దీంతో నారదుడు పార్వతి అందాన్ని వర్ణించి జలంధురుడికి మోహం కలిగించాడు. వర గర్వంతో జగన్మాతను మోహించి ఆమెను పొందడానికి ప్రయత్నించడంతో చివరకు శివుడు సంహరించాడు.

English summary

Things You Need To Know About Narada Muni in Telugu

Narada Muni is infamous in the mythologies for being meddlesome and a gossip monger. But that could not be more far from the truth. Malice is never the intention of this Great Sage. His actions are often the seeds for great good in the long run. Narada Muni has been the catalyst of many important events in the Hindu mythology.
Desktop Bottom Promotion