Latest Updates
-
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.! -
రాఖీ స్పెషల్: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కమ్మటి బేసన్ లడ్డూ..చాలా ఈజీగా చేసుకోండిలా -
మీ సోదరుడి రాశి చక్రం ఆధారంగా ఈ రాఖీలు కడితే.. వారి సంతోషానికి ఢోకా ఉండదు.! -
పకోడీలు, బజ్జీలు బోర్ కొట్టాయా? అయితే ఈ కరకరలాడే మునగకాయ స్నాక్ ట్రై చేయండి! -
డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ ఏ టైంకి తింటున్నారు? ప్రాణగండం ఉంది జాగ్రత్త! -
సోదరి లేకపోతే ఎవరు రాఖీ కట్టవచ్చు.. రక్షాబంధన్ ఉద్దేశం, నియమాలు తెలుసుకోండి.! -
మై బ్రదర్, మై సూపర్ హీరో..మీ సోదరుడికి రాఖీ విషెస్ చెప్పండిలా -
టేస్టీ అండ్ క్రంచీ స్నాక్ ..కరకరలాడే శనగపిండి మసాలా పల్లీలు ఇలా చేసుకోండి
ధనత్రయోదశి (దంతేరాస్) న బంగారం కొనే ఆచారం ఎందుకు, ఎలా వచ్చింది ?
అసలు ధనత్రయోదశి రోజు బంగారం ఎందుకు కొంటారు ? దీని వెనక ఉన్న ఆంతర్యం, కథ ఏంటి ? బంగారం కొనడం వెనక అసలు కారణం ఏంటి ?
కార్తీకమాసంలో దంతేరాస్ పండుగ వస్తుంది. దీన్నే ధన త్రయోదశి, దంతేరాస్, ధనవంతరి జయంతి అని పిలుస్తారు. ఈ పండుగ దీపావళికి రెండు రోజుల ముందు వస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 28న దంతేరాస్ జరుపుకుంటున్నాం.

అయితే.. ఈ ధనత్రయోదశి రోజు బంగారం లేదా వెండి లేదా ఏవైనా వంట సామాగ్రి కొనడం వల్ల.. సంపద పొందుతారని నమ్ముతారు. అలాగే అదృష్టవంతులవుతారని, కుటుంబ శ్రేయస్సుకి మంచిదని భావిస్తారు. అందుకే.. దంతేరాస్ రోజు ఏదో ఒక చిన్న వస్తువైనా కొంటారు.
అయితే ఈ దంతేరాస్ ని.. ఎక్కువగా నార్త్ ఇండియన్స్ జరుపుకుంటారు. ఇటీవల సౌత్ ఇండియన్స్ లో కొంతమంది ఈ పండుగపై ఆసక్తి, ప్రచారం, అదృష్టం వరిస్తుందన్న నమ్మకంతో.. జరుపుకుంటున్నారు. అయితే అసలు ధనత్రయోదశి రోజు బంగారం ఎందుకు కొంటారు ? దీని వెనక ఉన్న ఆంతర్యం, కథ ఏంటి ? బంగారం కొనడం వెనక అసలు కారణం ఏంటి ?

దంతేరాస్ ఎందుకు జరుపుకుంటాం
పురాణాల ప్రకారం హిమ రాజు కొడుకికి 16ఏళ్లు. ఇతను తన పెళ్లి అయిన నాలుగోరోజు పాముకాటు వల్ల చాలా విచారకర పరిస్థితిలో మరణానికి చేరువయ్యాడు.

దంతేరాస్ ఎందుకు జరుపుకుంటాం
ఈ విషయం గుర్తించిన అతని భార్య నాలుగోరోజు రాత్రి ఎవరినీ పడుకోనివ్వలేదు. ఆమె బంగారు ఆభరణాలు, బంగారు నాణేలను తీసి.. తలుపు ముందు పెట్టి.. పాటలు పాడింది.

దంతేరాస్ ఎందుకు జరుపుకుంటాం
యముడు ఆ ఇంటి తలుపు దగ్గరకు పాము రూపంలో వచ్చాక.. ఆభరణాల వెలుక వల్ల కంటిచూపు కోల్పోయాడు. దీంతో తలుపు ద్వారం దాటుకోలేకపోయాడు.

దంతేరాస్ ఎందుకు జరుపుకుంటాం
బంగారు నగలపై కూర్చుని రాత్రంతా.. పాటలు విన్నాడు. తర్వాత రోజు ఉదయం.. వెళ్లిపోతాడు.

దంతేరాస్ ఎందుకు జరుపుకుంటాం
ఇలా.. ఆ యువరాణి తన భర్తను మరణం నుంచి చాలా తెలివిగా తప్పించింది. అలా ఆ రోజుని దంతేరాస్ గా జరుపుకుంటున్నాం.

దంతేరాస్ ఎందుకు జరుపుకుంటాం
కాబట్టి దంతేరాస్ లేదా ధనత్రయోదశి రోజు బంగారం కొనడం వల్ల.. మీ ఇంట్లో ఉన్న బ్యాడ్ లక్.. వెళ్లిపోయేలా చేస్తుంది.



Click it and Unblock the Notifications