For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆఫీస్ రాజకీయాల్లో సతమతంకాకండి, చాణుక్యుడు చెప్పిన సూత్రాలు పాటిస్తే ఎవన్నైనా మట్టికరింపిచొచ్చు

ఆఫీసుల్లో కచ్చితంగా చెత్త రాజకీయాలుంటాయి. పై స్థాయిలో ఉండే వారి దగ్గర పేరు సంపాదించడం కోసం చాలా మంది ఎంప్లాయిస్ నానా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఆఫీస్ రాజకీయాల్లో సతమతంకాకండి, చాణుక్యుడు సూత్రాలు

|

ఆఫీస్.. కొందరు బతకడానికి అక్కడికి వెళ్తారు. కొందరు ఏ పని చేయాలో అర్థం కాక ఏదో ఆఫర్ వచ్చింది కదా అని టైమ్ పాస్ కోసం వెళ్తారు. ఇంకొందరు రాజకీయాలు చేయడానికి వెళ్తారు. మరికొందరు తమ అందాలు ఆరబోసి అమాయక అబ్బాయిలకు గాలం వేసి వారి జీవితాలను ఆడుకోవడానికి వెళ్తారు.

ఒక్కొక్కరు ఒక్కో రకం కారణం చేత ఆఫీసుల్లో ఉద్యోగాలు చేస్తుంటారు. అలా రకరరకాల మనుషుల రూపంలో ఉన్న పాములతో నిండిపోయిన ఆఫీస్ లో ఏదో పాము నిన్ను కాటేయచ్చు.

బుసలు కొడతాయి, చల్లబడతాయి

బుసలు కొడతాయి, చల్లబడతాయి

కొన్ని పాములు బుసలు కొడతాయి, చల్లబడతాయి. మరికొన్ని పగపడతాయి. మరికొన్ని తెలివిగా కాటు వేయాలని చూస్తాయి. ఇంకొన్ని నమ్మించి కాటు వేస్తాయి. అలాంటి పాముల నుంచి తప్పించుకోవాలంటే నీకు చాలా విషయాలు తెలిసి ఉండాలి.

చెత్త రాజకీయాలుంటాయి

చెత్త రాజకీయాలుంటాయి

ఆఫీసుల్లో కచ్చితంగా చెత్త రాజకీయాలుంటాయి. పై స్థాయిలో ఉండే వారి దగ్గర పేరు సంపాదించడం కోసం చాలా మంది ఎంప్లాయిస్ నానా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. వీలైతే పై స్థాయి అధికారి ఏది నాకమంటే అది నాకుతారు. ఇలాంటి పనులు చేసేది కేవలం పని రాని వారే. మనం కూడా పై స్థాయి అధికారులకు గౌరవం ఇస్తాం. కానీ లిమిట్స్ లో ఉంటాం.

ఎవడు లుచ్చాగాడు, ఎవడు మంచోడు

ఎవడు లుచ్చాగాడు, ఎవడు మంచోడు

అయితే ఇవన్నీ ఆ పై అధికారులకు అర్థంకావా? అంటే కచ్చితంగా వారికి అర్థం అవుతాయి. ఆఫీసులో ఎవడు లుచ్చాగాడు, ఎవడు మంచోడనేది వారికి ఒక అంచనా ఉంటుంది. కానీ ఆఫీస్ రాజకీయాలు చెడ్డోళ్లకు బాగా అబ్బి ఉంటాయి. అందువల్ల మంచోళ్లు కూడా ఆ రాజకీయాలు నేర్చుకుని చెడ్డోళ్లకు చుక్కులు చూపించాలి. అప్పుడే నువ్వు అక్కడ మనగగలుగుతావు.

మెంటల్ టార్చర్ చేస్తే

మెంటల్ టార్చర్ చేస్తే

ఏదో ఒకట్రెండు సార్లు నిన్ను టార్గెట్ చేస్తే వదిలెయ్. కానీ నిన్ను అదేపనిగా ఆడుకుంటూ మెంటల్ టార్చర్ చేస్తే మాత్రం ఎవ్వర్ని వదలిపెట్టుకు. ఒక్కొక్కరికి సినిమా చూపెట్టు. చాలా మంది ఎంప్లాయిస్ కొన్ని జిమ్మిక్కులు పాటించలేరు. దీంతో అనవసరంగా బుక్ అయిపోతుంటారు.

సలహాలను పాటిస్తే

సలహాలను పాటిస్తే

ఆచార్యచాణ‌క్యుడు సూచించిన కొన్ని సలహాలను పాటిస్తే మాత్రం కచ్చితంగా ఆఫీసుల్లో అందరినీ మట్టికరిపించి దర్జాగా రాణించొచ్చు. ఎవడు ఎలాంటి కుట్ర పన్నినా కూడా అందులో నుంచి తేలిగ్గా బయటికి రావొచ్చు. నిన్ను టార్గెట్ చేసిన ఏ ఒక్కర్నీ వదలకు.

సిగ్గు మానం తీసిపాడెయ్

సిగ్గు మానం తీసిపాడెయ్

వాళ్లు నిన్ను దొంగ దెబ్బ తీస్తే నువ్వు మాత్రం ధైర్యంగా వాళ్ల ముందే వాళ్ల తప్పులన్నీ బయటపెట్టి సిగ్గు మానం తీసిపాడెయ్. అధర్మంపై అలాగే యుద్ధం చేయాలి మరి.అయితే ఆఫీసులో ఉన్న పామున్నింటికీ విషం ఉండకపోవొచ్చు. కానీ విషం ఉన్నట్లు ప్రవర్తిస్తుంటాయి. అయితే మీరు కూడా అలాగే ప్రవర్తిస్తే ఆఫీసు రాజ‌కీయాల్లో మీదే పై చేయి ఉంటుంది.

సీక్రెట్స్ చెప్పకండి

సీక్రెట్స్ చెప్పకండి

అలాగే మీ సీక్రెట్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో చెప్పకండి. మీరు అవతలి వ్యక్తి చాలా మంచి వ్యక్తి అనుకుని సీక్రెట్స్ చెబితే వాళ్లు మిమ్మల్ని నమ్మించి గొంతుకోయొచ్చు. అందుకే చెప్పకండి.

మూర్ఖుల‌తో వాదించకండి

మూర్ఖుల‌తో వాదించకండి

ఇక బాగా అహంకారంతో అన్నీ మాకే తెలుసు అనుకునేవారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాంటి వారు చాలా డేంజర్. అలాంటి మూర్ఖుల‌తో అస్సలు వాదించకండి. అలా వాదించకుండా ఉంటేనే మీకు మేలు. లేదంటే అనవసరంగా చిక్కుల్లో చిక్కుకుంటారు.

ఎప్పటికీ భయపడకండి

ఎప్పటికీ భయపడకండి

ఇక మీరు చేసే పని విషయంలో ఎప్పటికీ భయపడకండి. మీకు ఎన్ని ఆటంకాలు కలిగించినా కూడా ధైర్యంతో ముందుకెళ్లండి. కుక్కులు మొరుగుతూ ఉంటాయని వదిలెయ్యండి. నీ శత్రువును తెలివితో దెబ్బతీయాలి. అనసరంగా రచ్చరచ్చ చేయకుండా తెలివితో నువ్వు కొట్టే దెబ్బకు మళ్లీ అస్సలు కోలుకోకూడదు, నిన్ను కెలకాలంటేనే భయపడాలి అలాంటి దెబ్బకొట్టు.

అవసరమైనప్పుడు దాన్ని వాడుకో

అవసరమైనప్పుడు దాన్ని వాడుకో

కోపాన్ని బహిరంగంగా ప్రదర్శించకుండా మనస్సులోనే పెట్టుకుని అవసరమైనప్పుడు దాన్ని వాడుకో. అవతలి వ్యక్తిని చిత్తుచిత్తుగా పతనం చెయ్యి. ఎప్పటికప్పుడు గుణపాఠాలు నేర్చుకోవాలి. అవసరమైనప్పుడు మాత్రమే నువ్వు ఆఫీసులోని శత్రువుపై అస్త్రం సంధించాలి.

నీ ఆవేశాన్ని బయటపెట్టకు

నీ ఆవేశాన్ని బయటపెట్టకు

అనవసరంగా నీ ఆవేశాన్ని బయటపెట్టకు. అయితే ఎక్కువగా నిజాయితీ ఉండడం కూడా చేటే. నిజాయితీగా ఉన్నవాళ్లనే దుర్మార్గులు ఎక్కువగా టార్గెట్ చేస్తారు కాబట్టి అలాంటి వ్యక్తుల దగ్గర నిజాయితీగా ఉండాల్సిన అవసరం లేదు.

మిగతా వారి సపోర్ట్ కూడా ఉంటుంది

మిగతా వారి సపోర్ట్ కూడా ఉంటుంది

మీ దగ్గర బాగా పని చేసే టాలెంట్ ఉంటే మీకు మిగతా వారి సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి పనే దైవంగా భావించండి. అలాగే నిన్ను నమ్మి నీకోసం ఏమైనా చేసే ఒక్క వ్యక్తి నీ పక్కనుంటే చాలు. ఉత్త మాటలు చెప్పే వందల మంది అవసరం లేదు.

నిజాయితీగా ఉండాలి

నిజాయితీగా ఉండాలి

అయితే అవతలి వ్యకులపై... పై చేయి సాధించాలంటే మీరు కూడా కొన్ని విలువలు కలిగి ఉండాలి. మీరు నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా, స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా లేని వారు కచ్చితంగా ఏదో ఒక రోజు అపజయం పాలు కావాల్సి వస్తుంది. నిజాయితీ గల వారు ఎలాంటి వ్యక్తులైనైనా చిత్తుచిత్తు చేయగలరు.

మిమ్మల్ని ఎవ్వడూ పీకలేడు

మిమ్మల్ని ఎవ్వడూ పీకలేడు

అలాగే వీలైనంత స్మార్ట్ గా మెలగండి. అందరితో కలిసిపోయినట్లుగా ఉండండి. ఎందుకంటే మీ ప్రత్యర్థులు కూడా అలాగే నటిస్తూ ఉంటారు. అయితే మీరు నటించకండి... నిజాయితీగానే ఫ్రెండ్ షిప్ చేయండి.

మీరు చేసే పనిలో మీకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకోండి.

మీ దగ్గర పని చేసే సత్తా ఉంటే మిమ్మల్ని ఎవ్వడూ పీకలేడు అనేది గుర్తించుకోండి. అలాగే మూడు ప్రశ్నలు మీరు రెగ్యులర్ గా వేసుకుంటూ ఉండండి.

ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండాలి

ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండాలి

నేను ఎందుకోసం పని చేస్తున్నాను, నేను చేసే పని వల్ల ఫలితాలు ఏమిటి, నేను ఆఫీసులో పని విషయంలో విజయవంతం కావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటనేవి మీరు ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎంతటి హార్ట్ వర్క్ అయినా సరే ఎప్పుడూ కూడా మీరు వెనుకంజ వేయకండి.

టైమ్ చూసుకుని మూతి మీదే కొట్టు

టైమ్ చూసుకుని మూతి మీదే కొట్టు

నిన్ను అనవసరంగా భయపెట్టేవాణ్ని వదలకు. కొన్ని ఆఫీసుల్లో మిమ్మల్ని ఆడవారు కూడా టార్గెట్ చేయొచ్చు అలా అని కనికరం చూపాల్సిన అవసరం లేదు. శత్రువు ఎవరైనా సరే నిన్ను దొంగదెబ్బ కొడితే నువ్వు టైమ్ చూసుకుని మూతి మీదే కొట్టు. ఛల్.. దెబ్బకు వాడు మళ్లీ మీ జోలికి రాకూడదు.

నైపుణ్యాన్ని పెంచుకోండి

నైపుణ్యాన్ని పెంచుకోండి

కానీ మీరు నిరంతంర కొత్త విషయాలను నేర్చుకుంటూ మీ నైపుణ్యాన్ని పెంచుకోండం మాత్రం మానివేయకూడదు. నీ దగ్గర టాలెంట్ ఉంటే ఏ ఆఫీస్ లోనైనా నువ్వు సత్తా చాటవచ్చు. అలా చేయని వారికి ఎప్పటికైనా పతనం తప్పుదు. కేవలం మాయమాటలు చెప్పి ఏ పని చేయకున్నా కూడా కవరింగ్ చేసే వాళ్లకు ఏదో ఒక రోజు కంపెనీ ముగింపు పలుకుతుంది. అలాంటి వారు మీ శత్రువులుగా ఉంటే ఏమీ భయపడకండి. ఏదో ఒక రోజు వారు ఆఫీస్ కి గుడ్ బై చెప్పి వెళ్తారు.

English summary

top 20 chanakya niti for office and work great thoughts of chanakya

top 20 chanakya niti for office and work great thoughts of chanakya
Desktop Bottom Promotion