For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హిందువుల నమ్మకాల వెనుక ఉన్న అసలు నిజాలు మీకు తెలుసా ?

మనషి ఎప్పుడు కానీ స్వతంత్రంగా జీవించే స్వభావం కలవాడు కాదు. ఎప్పుడూ గుంపులుగా జీవించాలి అని భావించే జీవి. మనిషి ఎప్పుడైతే సమాజంలో జీవిస్తూ ఉంటాడో మరియు ఇతర మనుష్యులతో కూడా సంభాషిస్తూ ఉంటాడో, అటువంటి సమ

By R Vishnu Vardhan Reddy
|

మనషి ఎప్పుడు కానీ స్వతంత్రంగా జీవించే స్వభావం కలవాడు కాదు. ఎప్పుడూ గుంపులుగా జీవించాలి అని భావించే జీవి. మనిషి ఎప్పుడైతే సమాజంలో జీవిస్తూ ఉంటాడో మరియు ఇతర మనుష్యులతో కూడా సంభాషిస్తూ ఉంటాడో, అటువంటి సమయంలో ఎవరైనా సరే కొన్ని నియమ నిబంధనలు పాటించవలసి ఉంటుంది.

ఏది తప్పు ఏది ఒప్పు అనే విషయాలను ఈ నియమ నిబంధనలు తెలియజేస్తాయి. మన పూర్వీకులు సంచార మనుష్యులుగా తమ జీవితాన్ని మొదలుపెట్టి నాగరిక జీవితంలోకి ప్రస్తుతం మనందరినీ ప్రవేశింపచేసేలా చేసారు. అందుచేత ప్రతి ఒక్కరు తమని తాము నియంత్రణలోకి ఉంచుకోవడానికి, సరైన పద్ధతిలో వ్యవహరించడానికి కొన్ని నిర్దిష్టమైన నియమ నిబంధనలు ఉండటం చాలా అవసరం. హిందువుల నమ్మకాల వెనుక ఉన్న 15 అసలు నిజాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము.

belief

అది ' మతం ' అనేది ఒకటి రూపుదాల్చిన సమయం. ప్రజలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో తమ జీవనాన్ని సాగిస్తూ ఉండేవారు. ఇలాంటి సమయంలోనే వివిధ మతాలకు బీజం పడింది. క్రైస్తవం, హిందూ మతం, ఇస్లాం, సిక్కిజం మరియు జోరాస్ట్రియన్ అనే మతాలు ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి.

మన దేశంలో హిందూ మతాన్ని అత్యధిక ప్రజలు నమ్ముతారు, పాటిస్తారు. ఈ ప్రపంచంలో ఎవ్వరైనా సరే, వారి జీవిత కాలంలో ఒక్కసారైనా హిందువుని కలుస్తారు. హిందూ మతం భారతదేశంలో జన్మించింది. హిందూయిజం అనేది ఒక మతం కాదు అంతకు మించి, అది ఒక జీవన విధానం అని చాలా మంది నమ్ముతారు.

నిజమే అది ఒక జీవన విధానం. ఈ మతం యొక్క ముఖ్య ఉద్దేశ్యం తో పాటు, వారు నమ్మే విషయం ఏమిటంటే, మనుష్యులు అందరూ దేవుని స్థానాల్లో జన్మించారని చాలామంది విశ్వసిస్తారు. మహోన్నతమైన శక్తి ఒకటే ఉంది మరియు అదే వివిధ రూపాల్లో 33 మిలియన్ రూపాలుగా ఉనికిలో ఉన్నాయని అంటారు. ప్రతి ఒక్కరి కర్తవ్యం ఏమిటంటే, ప్రతి ఒక్కరు దేవుడికి బాకీ పడిన సొమ్ముని అంతా చెల్లించడం ఒక బాధ్యత అని చెబుతారు మరియు ఇతర మనుష్యులు అయిన తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ఆ పరమాత్ముడు పంపించిన దూతలుగా అభివర్ణిస్తారు.

ఈ ఆసక్తికరమైన అంశం ఎన్నో వేలసంవత్సరాలుగా, హిందువుల యొక్క జీవన విధానాన్ని నిర్దేశిస్తూ ఉన్నతమైన స్థానికి వారిని తీసుకు వెళ్తుంది. ఇదే కాకుండా ఈ అద్భుతమైన మతం గురించి మరెన్నో తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి.

ఈ వ్యాసంలో హిందువుల నమ్మకాలకు సంబందించిన 15 అతి ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన నిజాలు గురించి తెలుసుకోబోతున్నాము. ఈ విషయాలు చాలామంది ప్రజలకు తెలియకపోవచ్చు.

ఏ వ్యక్తులు అయితే హిందూ మతాన్ని పాటిస్తారో అటువంటి వారు హిందూయిజం అనే పదాన్ని ఉచ్చరించరు.

1. హిందూయిజం గురించి మొట్టమొదటి నిజం ఇదే ;

1. హిందూయిజం గురించి మొట్టమొదటి నిజం ఇదే ;

హిందూయిజం గురించి మొట్ట మొదటి నిజం ఏమిటంటే, ఎవరైతే ఈ మతాన్ని అనుసరిస్తారో వారు ఎప్పుడు గాని హిందూయిజం అనే పదాన్ని ఉచ్చరించరు. వీరుతమ యొక్క మతం ' సనాతన దర్మం ' అని చెబుతారు. దీనినే మరొక రకంగా చెప్పాలంటే శాశ్వతమైన నిజం అని కూడా అంటారు. ఈ హిందూయిజం అనే పదాన్ని అరబ్బులు మరియు గ్రీకులు ఎక్కువగా వాడేవారు. ఏ వ్యక్తులైతే సింధు నది పరిసర ప్రాంతాల్లో తమ జీవనాన్ని సాగిస్తూ ఉండేవారో, వారందరికీ ఈ హిందూయిజం అనే పదాన్ని ఆపాదించడం జరిగింది.

2. లిఖించబడిన అతి ప్రాచీన మూల గ్రంధం :

2. లిఖించబడిన అతి ప్రాచీన మూల గ్రంధం :

మనకందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, హిందూయిజం కి సంబంధించి 4 వేదాలు ఉన్నాయి. అవి రిగ్వేద, యజుర్వేద, సామవేద మరియు అథర్వవేద. పురాతన సాక్ష్యా ధారాల ఆధారంగా తెలుస్తున్న అంశం ఏమిటంటే, రిగ్వేదను 3800 సంవత్సరాల క్రితం లిఖించారట. ఇందుమూలంగా ప్రపంచంలోనే అతి ప్రాచీన కాలంలో లిఖించబడిన గ్రంధాల్లో ఇది చోటు సంపాదించుకుంది. ఈ విషయాన్ని నిర్ధారించడం ద్వారా హిందూయిజం కూడా అతి ప్రాచీన మతం అని ధ్రువీకరించడం జరిగింది.

3. బహుళ లేఖనాలు, స్థాపకులు ఎవరు లేరు :

3. బహుళ లేఖనాలు, స్థాపకులు ఎవరు లేరు :

హిందువుల నమ్మకం ఎలా ఉంటుందంటే, ఈ మతాన్ని ఎవరో ఒక వ్యక్తి మాత్రమే కనిపెట్టలేదు. అందుచేతనే సహజంగానే ఈ మతం ఎంతో శక్తి శీలమైనది మరియు చలన శీలమైనది అని చాలామంది భావిస్తారు. ఈ మతానికి ఎదో ఒక్కటే పవిత్ర వచనంగా లేదు. భగవత్గీత, ఉపనిష్యత్తులు, రామాయణం, మహా భరతం మరియు మరెన్నో పుస్తకాలూ హిందువుల జీవన విధానం గురించి ఎంతో గొప్పగా ఆవిష్కరిస్తాయి, తెలియజేస్తాయి. అందుచేతనే ఈరోజుకి కూడా వారు జీవించే జీవన విధానాన్ని వ్యాఖ్యానం చేసుకోవడానికి ఇప్పుడు, ఎప్పుడూ తెరిచే ఉంటుంది. దీని ఫలితంగా ప్రపంచంలో ఉన్న అందరికి అనువైన మతాలలో హిందూయిజం కూడా చోటు సంపాదించుకుంది. అంతేకాకుండా మారుతున్న కాలంతో పాటు మారే మతంగా పేరు గడించింది.

4. సమయానికి అనుగుణంగా వృత్తాకార భావన :

4. సమయానికి అనుగుణంగా వృత్తాకార భావన :

మిగతా అన్ని మతాల మధ్య హిందూయిజాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేది ఏమిటంటే, సమయానికి అనుగుణంగా వృత్తాకార భావన. చాలా మతాలు సరళ భావన విధానంలో ఎక్కువగా వెళ్తుంటాయి. కానీ, హిందూయిజం ప్రకారం 4 యుగాలు ఉన్నాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం. ఈ యుగాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి మరియు చాలా మంది నమ్మకాల ప్రకారం కలియుగం అస్తమించిన తర్వాత మళ్ళీ సత్యయుగం మొదలవుతుందట.

5. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మతం:

5. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మతం:

అందరూ గమనించవలసిన మరియు ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ప్రపంచంలో లోనే మూడో అతిపెద్ద మతం అయిన హిందూయిజంకి సంబంధించిన 90% మంది ప్రజలు ఒకే దేశంలో ఉంటున్నారు, అదే భారతదేశం. మరో అతిముఖ్యమైన అంశం ఏంటంటే, హిందూయిజం ఒక మతం అయినప్పటికీ, వీరి జీవన విధానం లోకి మారమని వీరు ఎవ్వర్నీ కానీ బలవంత పెట్టారు. పుట్టుకతోనే ఈ మతాన్ని పుణికి పుచ్చుకున్నవారు లేదా స్వతహాగా వారి ఇష్టానుసారం ఈ మతంలోకి వచ్చినవారే ఈ మతంలో ప్రస్తుతం కొనసాగుతున్నారు.

6. పాకిస్థాన్లో కూడా ప్రజాధారణ ఉంది :

6. పాకిస్థాన్లో కూడా ప్రజాధారణ ఉంది :

పాకిస్థాన్ దేశం ఇస్లాం దేశం అని మనందరికీ తెలుసు. కానీ, మరోవైపు అమెరికా ఒక విభిన్న సంస్కృతుల ప్రజలు నివసించే దేశం. దీనిని దృష్టిలో ఉంచుకొని ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అమెరికాలో కంటే కూడా హిందువుల శాతం పాకిస్థాన్ లోనే అధికంగా ఉంది. పాకిస్థాన్ లో 1.8% మంది హిందువులు నివసిస్తుండగా, అమెరికాలో 0.7% మంది హిందువులు నివసిస్తున్నారు.

7. విభిన్న జాతులు :

7. విభిన్న జాతులు :

శైవ, శక్తి మరియు వైష్ణవ అనే జాతులు హిందూమతంలో ఉన్నాయి. ఒక ఆసక్తికరమైన నిజం ఏమిటంటే, ఈ మతం మరి ఎక్కువ కఠినంగా వ్యవహరించదు మరియు ఈ జాతులను మరీ ఎక్కువగా విడదీసి చూడనవసరంలేదు. ఎన్నో విధాలుగా ఈ మూడు జాతుల యొక్క జీవన విధానం, దాదాపు ఒకేవిధంగా ఉంటుంది మరియు వ్యక్తులు ఎవరైనా సరే వారి ఇష్టానుసారం విభిన్న మార్గాలను ఎంచుకోవచ్చు.

8. దేశం బయట ప్రజాధారణ :

8. దేశం బయట ప్రజాధారణ :

అతిపెద్ద హిందూ దేవాలయం భారతదేశంలో లేదు. కంబోడియా దేశం లో ఉంది. అసలు నిజం ఏమిటంటే, ఈ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన స్మారక చిహ్నం మరియు ఈ దేశానికి వచ్చే 50 శాతం మంది విదేశీ పర్యాటకులు ఈ దేవాలయాన్ని చూడటానికే వస్తారంటే అతిశయోక్తి కాదు.

9. అతి పెద్ద కుంభమేళా :

9. అతి పెద్ద కుంభమేళా :

ప్రపంచం లోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సేకరణగా కుంభమేళాగా పేరు గడించింది. ఇది హిందూ నమ్మకాలకు అనుగుణంగా జరుగుతుంది. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమాన్ని కుంభమేళా అంటారు. పవిత్రమైన నది వద్ద హిందూ భక్తులు లక్షలాది మంది తరలి వచ్చి పూజలు నిర్వహిస్తారు. యునెస్కో వారు మానవత్వానికి మనోగ్రాహ్యంకాని సాంస్కృతిక వారసత్వ పట్టికలో కుంభమేళకు చోటుని కల్పించారు. ఇది భారతదేశంలో చోటుచేసుకుంటుంది.

10. అన్ని ఆత్మలు దివ్యత్వాన్ని పొందుతాయి :

10. అన్ని ఆత్మలు దివ్యత్వాన్ని పొందుతాయి :

హిందువుల నమ్మకాల్లో ఒక ఆసక్తికరమైన నమ్మకం ఏమిటంటే, ఆత్మకు జీవం లేదని బలంగా విశ్వసిస్తారు. జ్ఞానోదయం అయ్యేవరకు అది ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి మారుతుందని నమ్ముతారు. సమానత్వాన్ని ప్రస్ఫుటంగా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అందుచేతనే అన్ని ఆత్మలు దైవసంబంధమైనవి మరియు ఏవి కానీ ఇంకోదానితో పోల్చి చూసినప్పుడు ఉన్నతమైనవి కావు అన్ని సమానమే అని చెబుతారు.

11. మోక్షానికి మార్గం :

11. మోక్షానికి మార్గం :

ప్రపంచంలోనే సర్దుకుపోయే మతాల్లో ఒకటైన హిందూ మతం బలంగా చెప్పేదేమిటంటే, ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా సరే, పట్టుదలతో వ్యవహరించినప్పుడు మరియు అవసరమైనమేర భక్తితో వ్యవహరించినప్పుడు వారు మోక్షాన్ని పొందుతారు అని చెబుతుంది. ఇక్కడ అందరు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, హిందువులు తమ మతం వారు మాత్రమే మోక్షం పొందుతారు అని ఎక్కడ చెప్పలేదు మరియు ఎప్పుడూ ఆలా అనుకోరు.

12. మిగతా మతాల పుట్టుక :

12. మిగతా మతాల పుట్టుక :

హిందువుల యొక్క జీవన విధానం బుద్ధిజం మరియు సిక్కిజం అనే మరో రెండు కొత్త మతాలు జన్మించడానికి తోడ్పడింది. ఈ రెండు మతాలు కూడా ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ముఖ్యమైనవే. ఈ మతాలను కనిపెట్టినవారు పుట్టుకతో హిందువులే మరియు వారి యొక్క భావజాలాలు కూడా ఎక్కువగా హిందూయిజం ద్వారానే ప్రభావితం అయ్యాయి.

13. లింగ సమానత్వం :

13. లింగ సమానత్వం :

అన్ని విధాలుగా సమానత్వం ఉండాలని హిందూమతం నమ్ముతుంది మరియు పురుష మరియు స్త్రీ దేవుళ్ళకు సమానమైన స్థానాన్ని ఇవ్వడమే కాకుండా, సమానంగా పూజిస్తారు హిందువులు. హిందువుల నమ్మకం ప్రకారం దేవుడు ఏ లింగానికి చెందనివాడైన ఉండాలి లేదా రెండు లింగాలు కలిగినవాడైనా ఉండాలి. ఈ యొక్క సమానత్వంతో కూడిన నమ్మకమే హిందూమతాన్ని మిగతా మతాలతో పోల్చి చూసినప్పుడు విభిన్నంగా, ప్రత్యేకంగా నిలబెడుతుంది.

14. ఆయుర్వేదం హిందువులకు ఒక వరం :

14. ఆయుర్వేదం హిందువులకు ఒక వరం :

హిందూ మతం కంటికి కనిపించే దానికంటే కూడా ఎంతో ఉన్నతమైనది మరియు ఉత్తమమైనది. ఆయుర్వేదం చాలా ఎక్కువ ప్రభావంతంగా పనిచేస్తుంది. ఈ విధానం ద్వారా మొక్కల ఆధారంగా మందుల్ని తయారుచేసి వివిధరకాలుగా వ్యాధులకు చికిత్స చేస్తుంటారు. ఇది హిందూ మతం నుండే ఉద్భవించిందని చెబుతారు. ఈ రోజు ఆయుర్వేదం యొక్క శక్తిని అందరూ గుర్తించారు మరియు వీటి యొక్క ఔషదాల పై అత్యధికంగా పరిశోధనలు కూడా జరుగుతున్నాయి.

15. అందరిని గౌరవించడం :

15. అందరిని గౌరవించడం :

హిందూ మతంలో ఒక ఆసక్తికరమైన అబ్బురపరిచే విషయం ఏమిటంటే, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆవులు తో పాటు ఈ ప్రపంచం లోని జీవ వైవిధ్యాన్ని మరియు ప్రకృతిని దేవుళ్లుగా మరియు దేవతలుగా హిందువులు కొలుస్తారు. దీనివల్ల ఈ మతం పర్యావరణ అనుకూలమైనది మాత్రమే కాదు, దీనికి తోడు ఆహార ప్రక్రియ పరిణామ క్రమం దెబ్బతినకుండా ఉండటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుచేతనే వెళ్ళీనుకొని ఉన్న ఈ పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా కాపాడటంలో ఈ మతం కొన్ని వేల సంవత్సరాలుగా ఎంతో వెన్నుదన్నుగా నిలుస్తోంది. అంతేకాకుండా క్లిష్టసమయాలను ఎదుర్కొన్న ప్రతిసారి వాటిని అధిగమించి మరింత ఉన్నత స్థితికి హిందూ మతం చేరుకుంటోంది.

English summary

15 Truths About The Hindu Belief

With Hinduism having its origin in India, it is fair to say that Hinduism is more than just a religion. It is in fact a way of life. The primary essence of this religion lays in the fact that Hindus believe that as humans, we are all born in debt to the Gods. There is only one supreme power and
Story first published:Friday, January 12, 2018, 11:13 [IST]
Desktop Bottom Promotion