Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
ఇంట్లో తులసి మొక్క తరచూ ఎండిపోతుందా? ఇది ఖచ్చితంగా దానికి సంకేతమే
పట్నం అయినా పల్లెటూరైనా మనదేశంలోని దాదాపు ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్క లేకుండా ఇంటి ప్రాంగణం అసంపూర్ణంగా కనిపిస్తుంది. సనాతన ధర్మంలో తులసి మొక్క చాలా పవిత్రమైనదిగా భావించబడుతుంది. తులసి విష్ణువు, లక్ష్మి ఇద్దరికీ ప్రీతికరమైనది. అందుకే తులసిని హరిప్రియ అని కూడా అంటారు. తులసి మొక్కను లక్ష్మీ దేవి నివాసం అని నమ్ముతారు. తులసి మొక్క ఉన్న ఇళ్లలో, క్రమం తప్పకుండా తులసిని పూజించే ఇళ్లలో లక్ష్మీ దేవి, విష్ణువు ఆశీస్సులు ఉంటాయని విశ్వాసం.
అయితే ఇంట్లో తులసిని పూజిస్తుంటే దానికి సంబంధించిన నియమాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. తులసి మొక్క నాటడం మొదలుకుని,సంరక్షణ కూడా నియమాలతో కూడుకుని ఉంది. అయితే మీరు తులసి చెట్టుకి నీళ్లు పోస్తున్నా కూడా మళ్లీ మళ్లీ ఎండిపోతుందా? తులసి మొక్క ఎండిపోవడం దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం.

తులసి ఎండిపోవడం దేన్ని సూచిస్తుంది?
తులసి మొక్క పచ్చగా ఆ కుటుంబం మీద దైవానుగ్రహం ఉంటుందని నమ్ముతారు. ప్రతికూల శక్తులు ఇంటి దరిదాపుల్లో కూడా ఉండలేవు. అయితే ఇంట్లో ఉండే తులసి మొక్క పచ్చగా లేకపోయినా, తరచూ ఎండిపోతున్న మొక్క సరిగా పెరగకపోయినా ఏదో అశుభానికి సంకేతమని అర్థం చేసుకోవాలి. ఆర్థిక సంక్షోభం రాబోతున్న సమయంలో తులసి మొక్క ఎండిపోతుంది. మీ ఇంట్లో ప్రతికూల శక్తులు, చెడు దుష్టశక్తులు ఉన్నాయని చెప్పేందుకు చిహ్నంగా ఈ సంకేతాన్ని భావించాలి. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబంలో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. తులసి మొక్క ఎండిపోవడానికి మరొక కారణం ఇంట్లో వాళ్ళ నిర్లక్ష్యం కూడా ఉంటుంది. తులసిని సరైన పద్ధతిలో సంరక్షించుకోకపోతే దాని ప్రభావం మొక్క మీద కనిపిస్తుంది. సరిగా సంరక్షణ చేసుకోలేకపోతే కుటుంబంలో తగాదాలు, గొడవలు జరుగుతాయి. ఘర్షణ వాతావరణం నెలకొన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించడానికి ఇష్టపడదు.
అశుద్ధంగా ఉన్నప్పుడు తాకవద్దు.
అపవిత్ర స్థితిలో తులసిని తాకకూడదు. స్నానం చేయకుండా తులసి ఆకులను తాకడం అరిష్టం. స్నానం చేయకుండా తాకినా, ఆకులు తెంపినా అవి పూజలో ఆమోదయోగ్యంగా కావు. తులసికి రోజూ దీపదానం చేయడం వల్ల నరకానికి వెళ్లకుండా ఉపశమనం లభిస్తుంది. అందుచేత ప్రతిరోజు సాయంత్రం తులసికి దీపదానం చేయాలి. ఆదివారం నాడు తులసికి నీరు పెట్టకూడదు. ఈ రోజున ఆకులు తీయకూడదు. ఎందుకంటే ఆదివారం నాడు తులసి మాత ఉపవాసం ఉంటుంది. నీరు పోయడం వల్ల ఉపవాసం భగ్నమవుతుందని విశ్వసిస్తారు.
ఎలా సేవ్ చేయాలి
తులసి వేరుకు పసుపు, గంగాజలం కలిపితే చెడిపోదని,ఎండిపోకుండా కాపాడుతుందని కూడా చెబుతారు. ఇది కాకుండా తులసి మొక్కను చల్లని గాలి, మంచు నుండి రక్షించడానికి సూర్యరశ్మి,నేరుగా గాలి లేని ప్రదేశంలో ఉంచండి. శీతాకాలంలో కూడా ఈ మొక్కను సన్నని గుడ్డతో కప్పి ఉంచవచ్చు. తులసి మొక్క శీతాకాలంలో ఎక్కువ పువ్వులను ఉత్పత్తి చేస్తుంది, కాబట్టి మీరు వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి.
గమనిక: మత విశ్వాసాలు,ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. బోల్డ్ స్కై తెలుగు దీనిని ధృవీకరించలేదు. దీనిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోండి.



Click it and Unblock the Notifications