For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tulsi Vivah 2021 : కోరుకున్న భాగస్వామి కోసం ఈ పరిహారాలు పాటించండి...!

తులసి వివాహం సమయంలో ఈ పరిహారాలు పాటిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి.

|

హిందువులకు పవిత్రమైన మాసాలలో కార్తీక మాసం ఒకటి. ఈ కార్తీక మాసంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ మాసం ప్రారంభంలోనే దీపాల పండుగ దీపావళి వస్తుంది. ఇది ముగిసిన కొద్ది రోజులకే ఇదే నెలలో ఏకాదశి రోజున అంటే నవంబర్ 26వ తేదీన తులసి పండుగ వస్తుంది.

Tulsi Vivah 2020: Do These Remedies To Fulfil Your Desires

పురాణాల ప్రకారం, ఇదే రోజున విష్ణుమూర్తి నిద్ర నుండి మేల్కొని, బృందావనంలోకి ప్రవేశిస్తాడని, అందువల్ల ఈరోజు బృందావనంలో పూజ చేయడం ఆచారంగా మారింది. దీనినే మథన ద్వాదశిగా చెప్తారు. పాల సముద్రాన్ని మథించిన రోజు అని, అందుకే మథన ద్వాదశిగా దీనికే మరోపేరు చిలుకు ద్వాదశి.... అంటే, శ్రీమన్నారాయణ పాలకడలిలో తన సంతోషకరమైన జీవితం నుండి లేచి తన నిద్రను గ్రహించిన రోజు భక్తులకు ఒక రోజు.

Tulsi Vivah 2020: Do These Remedies To Fulfil Your Desires

విష్ణు చంద్ర నెల 12 వ రోజు, విష్ణు స్వరూపి ఉసిరి చెట్టుతో తులసి వివాహం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తులసి చెట్టుకు పసుపుకొమ్మలు కట్టి.. తులసి మొక్క వద్ద దీపాలను వెలిగిస్తారు. అయితే ఈ పవిత్రమైన రోజున మీరు కోరిన కోరికలు నెరవేరాలంటే కొన్ని పరిహారాలు పాటించాలి. ముఖ్యంగా మీరు కోరుకున్న భాగస్వామి కావాలంటే ఈ పరిహారాలను కచ్చితంగా పాటించాల్సిందే. ఇంతకీ ఆ రెమెడీస్ ఏంటో ఇప్పుడే చూసేద్దాం రండి...

26న తులసి వివాహం: కార్తీక మాసంలో తులసి వివాహం జరుపుకునే విధానం, విశిష్టత26న తులసి వివాహం: కార్తీక మాసంలో తులసి వివాహం జరుపుకునే విధానం, విశిష్టత

విష్ణువు ఆరాధన..

విష్ణువు ఆరాధన..

తులసి వివాహం సందర్భంగా మీరు కోరుకున్న భాగస్వామిని పొందడానికి, మొత్తం ఏడు పసుపు కొమ్మలు, కొంచెం కుంకుమ పువ్వు, కొద్దిగా బెల్లం మరియు ఒక గ్రాము కాయధాన్యాలు పసుపు వస్త్రంలో కట్టి విష్ణువు ఆలయానికి తీసుకెళ్లి విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఈ పరిహారం చేయడం వల్ల మీరు కోరిక నెరవేరుతుంది.

ఎరుపు రంగు..

ఎరుపు రంగు..

తులసి వివాహం రోజున కోరుకున్న భాగస్వామి పొందడానికి మరో పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తులసి వివాహం రోజున ఎరుపు రంగు వస్త్రాన్ని అమ్మవారి వద్ద ఉంచి.. దాన్ని మరుసటి రోజున మీ వద్ద ఉంచుకోవాలి. ఈ పరిహారం చేయడం వల్ల కూడా మీరు కోరుకున్న కోరిక నెరవేరే అవకాశం ఉంది.

దీపం వెలిగిస్తే..

దీపం వెలిగిస్తే..

తులసి పెళ్లి రోజున సాయంత్రం వేళలో తులసి మొక్క దగ్గర ఆవు నెయ్యి లేదా ఆవ నూనె దీపాన్ని వెలిగించాలి. ఇదే పద్ధతి ప్రతిరోజూ కొనసాగించాలి. ఇలాంటి పరిహారం చేయడం వల్ల పెళ్లికాని వారికి మంచి భాగస్వామి వస్తారు. అదే సమయంలో వివాహిత మహిళలకు వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

చివరి చంద్ర గ్రహణం ఎప్పుడు? ఈ గ్రహణం వల్ల ఎవరిపై ప్రభావం పడుతుందంటే...!చివరి చంద్ర గ్రహణం ఎప్పుడు? ఈ గ్రహణం వల్ల ఎవరిపై ప్రభావం పడుతుందంటే...!

ఈ మంత్రం..

ఈ మంత్రం..

తులసి వివాహం రోజున ఈ మంత్రం జపిస్తే మీరు అనేక ప్రయోజనాలను పొందొచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ పరిహారం చేయడం వల్ల మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు సంతోషంగా ఉంటుంది. ఇదివరకు మీ వైవాహిక జీవితంలో ఏవైనా కష్టాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి.

తులసి వివాహం రోజున..

తులసి వివాహం రోజున..

తులసి వివాహాం రోజున మీరు కచ్చితంగా ఉపవాసం ఉండాలి. అదే సమయంలో తులసి వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. మీరు ఉపవాసం ఉండటం ద్వారా లార్డ్ శాలిగ్రామ్ మరియు తులసి మాతా వివాహాన్ని జరిపించాలి. ఇలా చేయడం వల్ల మీ వివాహంలో ఆలస్యమయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి.

దుస్తులు దానం చేయండి..

దుస్తులు దానం చేయండి..

తులసి వివాహం రోజున ఆ మాతకు చేసే అలంకరణకు వాడే దుస్తులను ఇతర మహిళలకు దానం చేయండి. ఈ పరిహారం వల్ల మీ వైవాహిక జీవితంలో ప్రేమ మరియు అనురాగాలు, ఆప్యాయత పెరుగుతాయి. అంతేకాదు కుటుంబమంతా సంతోషంగా ఉంటారు.

English summary

Tulsi Vivah 2020: Do These Remedies To Fulfil Your Desires

Here we talking about the Tulsi Vivah 2020: Do These Remedies To Fulfil Your Desires. Read on
Desktop Bottom Promotion