For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tulsi Vivah 2023: ఉసిరితోనే తులసి వివాహం ఎందుకు జరుగుతుందో తెలుసా...

|

హిందువుల ఇళ్లలోని చాలా మంది తులసి మొక్కను పవిత్ర మొక్కగా పరిగణిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా హిందువులందరికీ తులసి పండుగ చాలా పవిత్రమైనది. హిందూ క్యాలెండర్ విక్రమ్ సంవత్ ప్రకారం ప్రతి సంవత్సరం ఈ పండుగను కార్తీక మాసంలో శుక్లపక్షం (రెండో పక్షం) ఏకాదశి నాడు జరుపుకుంటారు.

Tulsi Vivah 2021 Date, Puja Time, Muhurat, Rituals and Significance in Telugu

2021వ సంవత్సరంలో నవంబర్ 23వ తేదీన అంటే కార్తీక సోమవారం నాడు ఈ పండుగను జరుపుకుంటారు. ఆ రోజున హిందూ భక్తులందరూ తులసి చెట్టుకు వివాహం జరిపిస్తారు. ఇంతకీ తులసి చెట్టుకు ఎవరు తాళి కడతారు? ఎవరితో వివాహం జరిపిస్తారు? ఎందుకు ఈ పండుగను ఎలా జరుపుకుంటారు? తులసి వివాహం యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

Tulsi Vivah 2021 Date, Puja Time, Muhurat, Rituals and Significance in Telugu

Tulsi Vivah 2021 : ఈ పండుగ ప్రాముఖ్యత, పూజా విధులుTulsi Vivah 2021 : ఈ పండుగ ప్రాముఖ్యత, పూజా విధులు

కార్తీక ఏకాదశి రోజున..

కార్తీక ఏకాదశి రోజున..

కార్తీక మాసం హిందువులకు చాలా పవిత్రమైన నెల. ప్రతి రోజూ దీపం వెలిగించి సాయంత్రం భగవంతుడిని పూజిస్తారు. ఈ నెల శివుడికి అంకితం చేయబడింది. కార్తీక శుద్ధ ద్వాదశి తెలుగువారికి పండుగ. ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు నిద్రనుండి మేల్కొని బృందావనంలోకి ప్రవేశిస్తాడని, అందువల్ల ఈ రోజు బృందావనంలో పూజ చేయడం ఆచారంగా మారింది.

తులసి వివాహం..

తులసి వివాహం..

అంటే, శ్రీమన్నారాయణ పాలకడలిలో తన సంతోషకరమైన జీవితం నుండి లేచి తన నిద్రను గ్రహించిన రోజు భక్తులకు ఒక రోజు. విష్ణు చంద్ర నెల 12 వ రోజు, విష్ణు స్వరూపి ఉసిరి చెట్టుతో తులసి వివాహం జరుగుతుంది. ఈ ఏడాది నవంబర్ 15వ తేదీన, అంటే కార్తీక సోమవారం తులసి వివాహం జరగనుంది. తులసి మొక్క హిందువులందరికీ ఆరాధ్యదైవం. తులసి మొక్క లేని హిందువులు ఉండరు. ప్రతీరోజు ఈ మొక్కకు నీరు పోసి, ఉదయం, సాయంత్రంలో దీపాలు వెలిగిస్తారు.

తులసి వివాహ పూజ..

తులసి వివాహ పూజ..

* తులసి చెట్టును లేదా తులసి మొక్క తీసుకుని చిన్న మండపంలా ఏర్పాటు చేసుకోండి.

* మండపం చుట్టూ ఎర్రటి చీర లేదా పచ్చని రంగు చీరతో కట్టండి. అలాగే తులసి మొక్కను లేదా చెట్టును కూడా ఎర్రటి వస్త్రం లేదా పచ్చని వస్త్రంతో చుట్టొచ్చు.

* ఆ తర్వాత తులసి కొమ్మలకు ఎర్రటి గాజులతో అలంకరించండి.

* విఘ్నేశ్వరుడు మరియు ఇతర దేవుళ్లకు ప్రార్థనలు చేయండి. అప్పుడు సాలిగ్రామ్ ను కూడా ఆరాధించండి.

* తులసి చెట్టు దగ్గర కొబ్బరికాయ, చక్కెర బొమ్మలు, ఐదు రకాల పండ్లను ఉంచండి.

* అనంతరం హారతి ఇచ్చి తులసి మరియు లార్డ్ సాలిగ్రామ్ జపిస్తూ ప్రార్థించండి.

కార్తీక మాసంలోనే వనభోజనాలెందుకు చేస్తారు.. ఆ చెట్టు కిందే తినాలని ఎందుకంటారో తెలుసా...కార్తీక మాసంలోనే వనభోజనాలెందుకు చేస్తారు.. ఆ చెట్టు కిందే తినాలని ఎందుకంటారో తెలుసా...

మహావిష్ణు భక్తురాలు..

మహావిష్ణు భక్తురాలు..

హిందూ పురాణాలలో తులసి దేవిని వృందగా పిలుస్తారు. ఈమె కాలనేమి అనే రాక్షసుడికి అందమైన కూతురు. ఈ యువరాణి జలంధర్ అనే రాక్షసుడిని వివాహం చేసుకుంటుంది. శివుడి మూడో కన్ను నుండి పుట్టిన అగ్నిలో నుండి పుట్టడం వల్ల జలంధరుడికి అపారమైన శక్తులు ఉంటాయి. జలంధరుడికి దేవుళ్లంటే అసహ్యం. కానీ దేవుళ్లను అమితంగా ఆరాధించే వృందను ప్రేమిస్తు ఉంటాడు. ఈమె మహావిష్ణువుకు మహాభక్తురాలు.

విష్ణు మాయ..

విష్ణు మాయ..

ఆ యువరాణితో పెళ్లి తర్వాత ఆమె భక్తి, పవిత్రత వల్ల జలంధరుడికి శక్తి మరింత పెరిగిపోతుంది. అది ఎంతలా అంటే ఆఖరికి ఈశ్వరుడు కూడా జలంధరుడిని ఓడించలేకపోతాడు. అతని మూర్ఖత్వంతో శివుడినే ఓడించి ఈ సమస్త విశ్వానికి అధిపతి కావాలని కలలు గంటాడు. ఈ సమయంలో దేవుళ్లందరూ విష్ణుమూర్తి సహాయం కోరతారు. విష్ణుమూర్తి వృంద తన భక్తురాలు కావటంతో ఆమెకు జరగబోయే అన్యాయం వల్ల సందిగ్ధంలో పడతాడు. కానీ జలంధరుడి వల్ల జరిగే నష్టం వల్ల విష్ణువు ఓ మాయ చేయాలని నిర్ణయించుకుంటాడు.

విష్ణువు నిజ రూపం..

విష్ణువు నిజ రూపం..

పరమ శివునితో జలంధరుడు యుద్ధంలో ఉండగా, విష్ణువు వృంద వద్దకు జలంధర రూపంలో వస్తాడు. ఆమె అతన్ని గుర్తు పట్టలేక అతడే జలంధర్ అని భావిస్తుంది. కానీ అతను ఆమె తాకగానే తన భర్త కాదని గ్రహిస్తుంది. దీంతో ఆమె పతివ్రత నిష్ట భగ్నం అవుతుంది. వెంటనే జలంధరుడు బలహీనుడు అవుతాడు. అంతలోనే నిజం తెలుసుకున్న ఆమె మహావిష్ణువు నిజ రూపాన్ని కోరుతుంది. ఆమె తను పూజించిన దేవుడే తనను మాయ చేశాడని తెలుసుకుని బాధపడుతుంది.

సాలిగ్రామ శిలగా..

సాలిగ్రామ శిలగా..

శ్రీ మహావిష్ణువు మారు రూపం తెలుసుకుని, తన పవిత్రతపై జరిగిన మోసానికి ఆమె విష్ణువుని రాయిలా మారిపోమని శపిస్తుంది. విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండక నది వద్ద సాలిగ్రామ శిలగా మారతాడు. ఆ తర్వాత జలంధరుడు పరమశివుని చేతిలో హతుడవుతాడు. దీంతో ఆమె బాధపడుతూ, తన జీవితాన్ని కూడా ముగించాలి అనుకుంటుంది. అయితే లక్ష్మీదేవి వినతితో ఆమె తన శాపాన్ని వెనక్కి తీసుకుంటుంది. అయితే విష్ణువు యొక్క సాలిగ్రామ రూపాన్ని వివాహం చేసుకున్న తర్వాత ఈ శాపం అంతమవుతుందని చెబుతుంది. ఆ తర్వాత ఆమె శరీరం పూర్తిగా కాలిపోయిన తర్వాత తులసి మొక్క బూడిద నుండి పుట్టిందని పురాణాల ద్వారా తెలుస్తోంది.

ఉసిరి మొక్కను విష్ణుమూర్తిగా..

ఉసిరి మొక్కను విష్ణుమూర్తిగా..

మరో కథనం ప్రకారం తులసి మొక్కను గౌరీదేవిగా, ఉసిరి మొక్కను శ్రీ విష్ణుమూర్తిగా భావిస్తారు. కాబట్టి ఈ పవిత్రమైన రోజున పూజలు చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని, సిరి సంపదలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. ఉసిరి మొక్క ఎక్కడుంటే.. లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. లక్ష్మీదేవి ఉండే కరువు అనేదే ఉండదు. అందుకే కార్తీక మాసంలో ఉసిరి మరియు తులసి పూజ చేస్తే శుభఫలితాలు కలుగుతాయని చాలా మంది నమ్ముతారు.

FAQ's
  • 2021లో తులసి వివాహం ఎప్పుడు జరుపుకుంటారు?

    హిందూ క్యాలెండర్ విక్రమ్ సంవత్ ప్రకారం ప్రతి సంవత్సరం ఈ పండుగను కార్తీక మాసంలో శుక్లపక్షం (రెండో పక్షం) ఏకాదశి నాడు జరుపుకుంటారు. 2021వ సంవత్సరంలో నవంబర్ 15వ తేదీన అంటే కార్తీక సోమవారం నాడు ఈ పండుగను జరుపుకుంటారు.

English summary

Tulsi Vivah 2023 Date, Puja Time, Muhurat, Rituals and Significance in Telugu

Here we are talking about the tulsi vivah 2021 date, puja time, muhurat, rituals and significance in Telugu. Read on
Desktop Bottom Promotion