For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ugadi 2023: తెలుగు వారి తొలి పండుగ వెనుక శాస్త్రీయ కారణాలేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు...

ఉగాది పండుగ సందర్భంగా అనేక రకాల విషజ్వరాలు, ఆటలమ్మ, ఇంకా చాలా రకాల వ్యాధులు వ్యాపించే సమయమిది. అనేక మంది వీటి బారిన పడి మరణిస్తుంటారు.

|

యుగానికి ఆది ఉగాది. మన నేచర్ లో ప్రతి సంవత్సరం వచ్చే మార్పు కారణంగా వచ్చే మొట్టమొదటి పండుగ ఉగాది. ఈ పండుగ అంటే ప్రతి ఒక్కరి మదిలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఈ పండుగ సందర్భంగా పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచుల కలయిక గల పచ్చడిని తీసుకుంటారు.

Ugadi 2020 : Scientific Reasons Behind Ugadi Festival

అంతేకాదు ఈ ఉగాది పండుగ మన జీవితంలో ఎదరయ్యే మంచి, చెడు, కష్ట, సుఖాలను ఒకేలా స్వీకరించాలన్న సందేశాన్ని సైతం ఇస్తుంది. అలాగే ఉగాది పండుగ సందర్భంగా అనేక రకాల విషజ్వరాలు, ఆటలమ్మ, ఇంకా చాలా రకాల వ్యాధులు వ్యాపించే సమయమిది. అనేక మంది వీటి బారిన పడి మరణిస్తుంటారు. ఇప్పటికే కరోనా వైరస్ అనే మహమ్మారి కూడా ప్రపంచాన్ని వణికిస్తోంది.

Ugadi 2020 : Scientific Reasons Behind Ugadi Festival

మన దేశంలో కూడా ఈ కరోనా భూతం రోజురోజుకు చాలా మందిని కలవరపెడుతోంది. ఈ సమయాన్నే ఈ సమయాన్నే మన బుషులు 'యమద్రంస్టలు'అన్నారు. యమద్రంస్టలంటే యముడు తన కోరలు బయటకు పెట్టి అనేక మంది జనాలను నాశనం చేస్తాడని అర్ధం. కాబట్టి జనం ఈ కాలంలో ఆరోగ్య జాగ్రత్తలు బాగా తీసుకోవాలి.

ఉగాది పచ్చడి మహాఔషధం..

ఉగాది పచ్చడి మహాఔషధం..

ఉగాది పండుగ వెనుక ఒక వైజ్జానిక అంశం కూడా ఉంది. ఉగాది పచ్చడిని ఒక మహాఔషధమని చాలా మంది పెద్దలు చెబుతుంటారు. ఈ ఉగాది పచ్చడిని ఈ పండుగ నుండి శ్రీరామనవమి వరకూ లేదా చైత్ర పౌర్ణమి వరకు ప్రతిరోజూ స్వీకరించాలి. అలా 9 లేదా 15 రోజుల పాటు ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఆ సంవత్సరం మొత్తం రోగాలనేవి దరిచేరవు.

నులిపురుగులను చంపేస్తుంది.

నులిపురుగులను చంపేస్తుంది.

ఉగాది పచ్చడిలో ఉండే వేప పువ్వు కడుపులో ఉన్న నులిపురుగులను చంపేస్తుంది. వేపగాలి ఆటలమ్మ, అమ్మోరు మొదలైన వ్యాధులను దగ్గరకు రానీయదు. మామిడి యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉన్నది. ఇది కఫము, వాతము, పైత్యాలనే మూడు దోషాలను అదుపులో ఉంచుతుంది ఈ ఉగాది పచ్చడి. మనకు వచ్చే జబ్బుల్లో చాలా వరకూ వీటి వల్లే వస్తాయి.

విషపదార్థాలను తొలగిస్తుంది..

విషపదార్థాలను తొలగిస్తుంది..

ఉగాది పండుగ రోజున చేసే తైల అభ్యంగన స్నానం (శరీరానికి నువ్వులు నూనె పట్టించి నలుగుపిండితో చేసే స్నానం)శరీరంలో ఉన్న టాక్సిన్స్ (విషపదార్థాలు)ను తొలగిస్తుంది. ఉగాది కోసం ఇల్లు శుభ్రం చేస్తాం. పాత చెత్త, పనికిరాని వస్తువులు తీసేస్తాం. ఇళ్ళు చక్కగా కడిగి, గడపకు మామిడి తోరణాలు, బంతిపూలు కడతాం. ఇలా శుభ్రం చేయడం వల్లన మన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి మనకు రోగాలు సంక్రమించే అవకాశం తగ్గిపోతుంది.

బంతిపూల అలంకరణ వల్ల

బంతిపూల అలంకరణ వల్ల

ఉగాది పండుగ సందర్భంగా మన ఇంటిని పూలతో అలంకరించుకుంటూ ఉంటాం. బంతి పూలు యాంటీసెప్టిక్, యాంటీ బయోటిక్ లక్షణాలు కలిగినవి. మామిడి ఆకుల గురించి ఇందాకే చెప్పుకున్నాం. ఇవి ఇంట్లోకి రోగకారక క్రిములు రాకుండా ఆపేస్తాయి.

క్రిములు నాశనం..

క్రిములు నాశనం..

ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ 9 రోజుల పాటూ వసంతనవరాత్రులు పేరుతో అమ్మవారిని, శ్రీరామచంద్ర మూర్తిని విశేషంగా పూజిస్తాం. చైత్రపౌర్ణమి వరకూ దమన పూజ పేరుతో రోజుకొక దేవుడిని ప్రత్యేకంగా పూజించాలి. వైజ్ఝానికంగా చూస్తే, ఒక్క రోజుకాదు, దాదాపు 15 రోజుల పాటు ఎంతో శుచిశుభ్రతగా ఉంటూ, రోజు దేవుడికి నివేదన చేయడం కోసం పవిత్రంగా తయారుచేసిన ఆహారం తింటూ గడిపేస్తాం. మొత్తంగా చూస్తే ఉగాది పచ్చడి శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, కాబట్టి శరీరంలో ఉన్న క్రిములు నాశనం అవుతాయి.

శరీరంలోని మలినాలను..

శరీరంలోని మలినాలను..

ఉగాది స్నానం శరీరంలో మలినాలను, విషాలను తీసేస్తుంది. ఇంటి శుభ్రత మంగళ తోరణాలు బయట నుంచి వ్యాధులు సంక్రమించకుండా రక్షిస్తాయి. ఈ 15 రోజుల పాటు నియమబద్ద జీవితం, పవిత్రమైన, పుష్టికరమైన ఆహారం ఆరోగ్యానికి హేతువులు.

ఆయుర్వేద శాస్త్రంలో..

ఆయుర్వేద శాస్త్రంలో..

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఉగాది పచ్చడిని ‘నింబ కుసుమ భక్షణం‘, ‘అశోకకళికా ప్రాశనం‘ అని పేర్లతో వ్యవహరించేవారు. రుతువులలో వచ్చే మార్పుల కారణంగా మనకు వచ్చే రోగాల నుండి రక్షణగా, ఈ పచ్చడిని ఔషధంగా తీసుకోవడం ఆనవాయితీగా మారింది. ఇంతకుముందు ఉగాది పచ్చడిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, మిరపకాయలు, మామిడికాయలు ఉపయోగించేవారు.

పలు సంకేతాలు..

పలు సంకేతాలు..

బెల్లంలోని తీపి సుఖానికీ, లాభానికీ, ప్రేమకు విజయానికి సంకేతంగా భావిస్తారు. వేపలోని చేదు దు:ఖానికి, నష్టానికీ, ద్వేాషానికీ, అపజయానికి సంకేతంగా భావిస్తారు. ఈ రెండు కలిపి తీసుకుంటే కష్టసుఖాలు, ప్రేమానురాగాలు, విజయం చేకూరాలని చెప్పడమే.

‘త్వామష్ఠ శోక నరాభీష్ట, మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మమ శోకం సదా కురు‘ అనే మంత్రాన్ని చదువతూ ఉగాది పచ్చడిని తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఉగాది పచ్చడి హిందూ పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని వివరిస్తోంది.

ప్రపంచంలోని తెలుగు వారందరికీ బోల్డ్ స్కై తెలుగు తరపున ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీకు, మీ కుటుంబసభ్యులకు మంచి చేకూర్చాలని కోరుకుంటూ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

English summary

Ugadi 2023: Scientific Reasons Behind Ugadi Festival

Here are the scientific reasons behind ugadi festival. Take a look
Desktop Bottom Promotion