For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ugadi 2023: ఈ ఏడాది ఉగాది పండుగ ఎప్పుడొచ్చింది? ఈ ఫెస్టివల్ ప్రత్యేకతేంటో తెలుసుకుందామా...

2023లో ఉగాది పండుగ, తేదీ, చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

|

ఆంగ్లేయులకు నూతన సంవత్సరం జనవరి మాసంలో వస్తే.. తెలుగు వారికి మాత్రం ఉగాది పండుగ రోజు నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.

Ugadi 2021 Date, History and Significance in Telugu

మరికొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉగాది పండుగను జరుపుకోనున్నారు. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో తొలిరోజున జరుపుకునే పండుగే ఉగాది. ఈ ఏడాది మార్చి 22వ తేదీన అంటే బుధవారం నాడు ఈ పండుగ వచ్చింది.

Ugadi 2021 Date, History and Significance in Telugu

ఈ పండుగను కేరళలో విజు అని, మహారాష్ట్రలో గుడి పడ్వా అని పిలుస్తారు. ఈ సందర్భంగా ఈ పండుగ యొక్క చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

ఉగాది అంటే..

ఉగాది అంటే..

చరిత్రను పరిశీలిస్తే.. ఉగాది.. ‘ఉగ' అంటే నక్షత్ర గమనం లేదా జన్మ.. ఆయుషు అని అర్థాలు ఉన్నాయి. వీటికి ఆది ఉగాది.చైత్ర మాసంలోని పాడ్యమి రోజే కలియుగం ప్రారంభమైంది. త్రేతాయుగంలో ఉగాది నాడే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది. ఈ పవిత్రమైన రోజే శ్రీమహా విష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుని సంహరించినట్లు పురాణాల్లో పేర్కొన్నారు.

ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా..

ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా..

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, బెంగాల్, ఉత్తర భారతంలో ఘనంగా జరుపుకుంటారు. మహారాష్ట్రలో ఈ పండుగ ‘గుడి పడ్వ' అని పిలుస్తారు. తమిళనాడులో ‘పుత్తాండు' అని.. కేరళలో ‘విజు'అని, సిక్కులు ‘వైశాఖీ' అని.. బెంగాలీలు ‘పొయ్ లా బైశాఖ్' అనే పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున కొత్త పనులు ప్రారంభిస్తూ ఉంటారు.

వసంత కాలంలో..

వసంత కాలంలో..

ఈ పండుగ వసంత కాలంలో వస్తుంది. అనేక రకాల విషజ్వరాలు, ఆటలమ్మ, ఇంకా చాల రకాల వ్యాధులు వ్యాపించే సమయమిది. అనేక మంది వీటి బారిన పడి మరణిస్తుంటారు. ఈ సమయాన్నే మన బుషులు 'యమద్రంస్టలు'అన్నారు. యమద్రంస్టలంటే యముడు తన కోరలు బయటకు పెట్టి అనేక మంది జనాలను నాశనం చేస్తాడని అర్ధం. కాబట్టి జనం ఈ కాలంలో ఆరోగ్య జాగ్రత్తలు బాగా తీసుకోవాలి. ఉగాది వెను ఉన్న వైజ్జానికి అంశం కూడా ఇదే...

ఉగాది రోజున..

ఉగాది రోజున..

ఉగాది కోసం ఇల్లు శుభ్రం చేస్తాం. పాత చెత్త, పనికిరాని వస్తువులు తీసేస్తాం. ఇళ్ళు చక్కగా కడిగి, గడపకు మామిడి తోరణాలు, బంతిపూలు కడతాం. ఇలా శుభ్రం చేయడం వల్లన మన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి మనకు రోగాలు సంక్రమించే అవకాశం తగ్గిపోతుంది. బంతి పూలు యాంటీసెప్టిక్, యాంటీ బయోటిక్ లక్షణాలు కలిగినవి. ఇవి ఇంట్లోకి రోగకారక క్రిములు రాకుండా ఆపేస్తాయి.

పవిత్రమైన ప్రసాదం..

పవిత్రమైన ప్రసాదం..

ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ 9 రోజుల పాటూ వసంతనవరాత్రులు పేరుతో అమ్మవారిని, శ్రీరామచంద్ర మూర్తిని విశేషంగా పూజిస్తాం. చైత్రపౌర్ణమి వరకూ దమన పూజ పేరుతో రోజుకొక దేవుడిని ప్రత్యేకంగా పూజించాలి. వైజ్ఝానికంగా చూస్తే, ఒక్క రోజుకాదు, దాదాపు 15 రోజుల పాటు ఎంతో శుచిశుభ్రతగా ఉంటూ, రోజు దేవుడికి నివేదన చేయడం కోసం పవిత్రంగా తయారుచేసిన ఆహారం తింటూ గడిపేస్తాం.

ఉగాది పచ్చడి

ఉగాది పచ్చడి

ఈ పచ్చడి శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, కాబట్టి శరీరంలో ఉన్న క్రిములు నాశనం అవుతాయి. ఉగాది స్నానం శరీరంలో మలినాలను, విషాలను తీసేస్తుంది. ఇంటి శుభ్రత మంగళ తోరణాలు బయట నుంచి వ్యాధులు సంక్రమించకుండా రక్షిస్తాయి. ఈ 15రోజుల పాటు నియమబద్ద జీవితం, పవిత్రమైన, పుష్టికరమైన ఆహారం ఆరోగ్యానికి హేతువులు

English summary

Ugadi 2023 Date, History and Significance in Telugu

Here we are talking about the ugadi 2021 date, history and significance in telugu. Read on
Desktop Bottom Promotion