Latest Updates
-
శుక్ర గోచారం 2026..ఆగష్టు 25 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు! -
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు.. -
రాఖీ 2026 స్పెషల్: స్వీట్ షాప్ టేస్ట్‌ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్ బర్ఫీ.! -
పాతకాలం పద్దతిలో జొన్నల అన్నం..శరీరానికి అపరిమిత బలం..వారానికి 2 సార్లు తిన్నా 100 ఏళ్లు బలంగా బతికేస్తారు! -
ఒకేసారి ఇడ్లీ, రైస్‌లోకి పర్ఫెక్ట్ రెసిపీ.. నోరూరించే ఘాటుతో టిఫిన్ సెంటర్ స్టైల్ టొమాటో చట్నీ.! -
ఆగష్టు 28న చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త.! -
ఒక్కసారి ఈ టర్కిష్ టమాటో ఆనియన్ సలాడ్ రుచి చూస్తే..నాలుక నిద్రలేచి నాట్యమాడతది! -
నోట్లో ఇట్టే కరిగిపోయే జ్యూసీ మటన్ తహరీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!
Ugadi 2023: ఉగాది ప్రాముక్యత ఏంటి? చైత్రమాస శుద్ద పాడ్యమి రోజు ఉగాది ఎందుకు జరుపుకుంటారు! ?
Ugadi 2023: ఉగాది ప్రాముక్యత ఏంటి? చైత్రమాస శుద్ద పాడ్యమి రోజు ఉగాది ఎందుకు జరుపుకుంటారు!
సృష్టికర్త బ్రహ్మ దేవుడు ఈ రోజున ప్రజలను, ప్రపంచాన్ని, వారం, నెల, సంవత్సరం మరియు రోజును సృష్టించినందున ఉగాది పండుగ వచ్చిందని కొందరు నమ్ముతారు. ఉగాది పండుగ చైత్ర మాస సుద్ద పాఢ్యమి నాడు జరుపుకుంటారు. ఈ రోజు దేవాలయాల్లో మల్లెపూల దండలు దేవుడికి సమర్పిస్తారు.
చైత్ర శుద్ధ పాడ్యమి-ఉగాది నుండి చైత్ర శుద్ధ నవమి వరకూ వసంత నవరాత్రులు... సంవత్సరంలో మనం మూడు సార్లు నవరాత్రులు జరుపుకుంటాము. మొదటిది చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు , రెండవది భాద్రపదమాసంలో వచ్చే గణపతి నవరాత్రులు, మూడవది ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు. సంవత్సరంలో మొదటగా వచ్చే వసంత నవరాత్రులని ప్రజలంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఈ నవరాత్రులలో లలితాదేవిని కూడా ఆరాధించాలి. అంతేకాకుండా ఈ తొమ్మిది రోజులూ రామాయణాన్ని పారాయణ చేసి, నవరాత్రుల చివరి రోజున సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా చేసి, చూసి తరిస్తారు.

ఏటా చైత్ర మాసంలో పాడ్యమి రోజు వచ్చే ఉగాది పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వసంత బుతువులో తొలి మాసం చైత్రమాసం. సంవత్సరానికి తొలి మాసం కూడా. బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ. మొదటి ఋతువు వసంతం.మొదటి నెల చైత్రం.మొదటి తిథి పాడ్యమి.మొదటి వారం ఆదివారం. ఆ రోజే సృష్టి ప్రారంభమైంది. చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయవేళకు పాడ్యమి తిథి ఉన్నరోజును ఉగాదిగా నిర్ణయిస్తారు.
చైత్రమాసం అనగానే మనకి ఉగాది , శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. అవే కాదు , దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం , యజ్ఞ వరాహమూర్తి జయంతి , సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి. అలా చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక , అనేక ఆధ్యాత్మిక , పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా.
సంవత్సరమునకు యుగము అనే పేరు కూడా ఉంది. అందుకే యుగాది , ఉగాది అయింది. చాంద్రమానాన్ని అనుసరించేవారే కాక , సౌరమానాన్ని అనుసరించే కొంతమంది కూడా ఈ రోజు నుండీ సంవత్సరాదిని జరుపుకుంటారు. ఉగాది నాడు కొన్ని పనులను చేయాలని పెద్దలు చెప్పారు. అవి ఏమిటంటే ,ఉగాది నాడు తైలాభ్యంగన స్నానం చేసి , నూతన వస్త్రాలు ధరించాలి. ప్రతీ గృహమునందు ధ్వజారోహణం , లేదా జయకేతనం ఎగురవేయాలి. సృష్టి మొదలు అయిన రోజున (యుగాది) సృష్టిని చేసిన బ్రహ్మగారిని పూజించాలి. ఉగాది నాడు షడ్రుచులతో కూడిన పచ్చడిసేవనం(నింబకుసుమ భక్షణం), పంచాంగ శ్రవణం , తెలుగు వారికే ప్రత్యేకమైన అవధానం , వంటివి పండుగకే శోభనిస్తాయి.
వేదాలు రక్షించినరోజు ఇదే
- మహావిష్ణువు మత్స్యావతారము ధరించి సోమకుడిని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజుకూడా ఇదేనని ప్రతీతి
- శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజుకూడా ఉగాదే
- వరాహమిహిరుడు పంచాగాన్ని జాతికి అంకితం చేసినది ఉగాదినాడే
- తెలుగువాళ్ల చాంద్రమానాన్ని అనుసరిస్తారు.



Click it and Unblock the Notifications