For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ugadi 2021: ఉగాది పూజా విధానం.. పంచాంగ శ్రవణ శుభ సమయం..

|

శార్వరి నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ శ్రీ ఫ్లవ నామ తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను జరుపుకునే సమయం, ముహుర్తం గురించి పండితులు తెలియజేశారు.

2021 సంవత్సరంలో ఏప్రిల్ 13వ తేదీన మంగళవారం ఉగాది పర్వదినాన్ని జరుపుకోనున్నారు. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఈ ఉగాది ఉత్సవాన్ని జరుపుకుంటారు.

ఈ సందర్భంగా పూజా విధానం, శుభ ముహుర్తం, ఉగాది కథ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

Ugadi 2021:ఉగాది రోజున చేయాల్సిన, చేయకూడని పనులేంటో తెలుసా...

ఉగాది పచ్చడి..

ఉగాది పచ్చడి..

ఉగాది పండుగ రోజున తయారు చేసే పచ్చడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పచ్చడిని పండుగ రోజున ఏ సమయంలో తీసుకోవాలనే వివరాలను కూడా పండితులే చెబుతారు. అయితే దీని తయారీకి ముందు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే అభ్యంగన స్నానం చేయాలి. ఆ తర్వాతే పచ్చడిని తయారు చేయడం ఆరంభించాలి. దీన్ని దేవుడికి సమర్పించిన తర్వాతే ఉదయం 8 గంటల నుండి తీసుకోవాలని పండితులు చెబుతున్నారు.

పచ్చడి తీసుకునేటప్పుడు..

పచ్చడి తీసుకునేటప్పుడు..

పచ్చడి తీసుకునేందుకు ఉగాది అత్యంత అనుకూలమైన సమయం కాబట్టి, ఈ సమయంలో ‘శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ, సర్వారిష్ట వినాశాయనింకం దళబక్షణం' అనే మంత్రాన్ని ప్రత్యేకంగా జపించి ఈ పచ్చడిని తీసుకోవాలి. దీనర్థం.. వందేళ్ల పాటు వజ్రదేహంతో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలని కోరుకోవడం.

పంచాంగ శ్రవణం..

పంచాంగ శ్రవణం..

ఉగాది రోజున చేయాల్సిన మరో ముఖ్యమైన పని. పంచాంగ పూజ, పంచాంగ శ్రవణం. ఉగాది రోజు తెలుగు వారికి నూతన సంవత్సరానికి ప్రారంభ రోజు కాబట్టి. ఈరోజు మీ పూజా గదిలో పంచాంగం కచ్చితంగా ఉండాలి. కొత్త ఏడాదిలో మనం చేయాల్సిన కార్యక్రమాలకు అనువైన వాటిని చూపించే కరదీపికగా దీన్ని భావిస్తారు.

Ugadi 2021: ఈ ఏడాది ఉగాది పండుగ ఎప్పుడొచ్చింది? ఈ ఫెస్టివల్ ప్రత్యేకతేంటో తెలుసుకుందామా...

కొత్త బట్టలు..

కొత్త బట్టలు..

ఈ పండుగ రోజున కొత్త బట్టలు ధరించి, పంచాంగానికి పూజ చేసి, మధ్యాహ్నం సమయంలో కొత్త బట్టలు కట్టుకుని బ్రహ్మాణ ముఖంగా లేదా జ్యోతిష్యుల ముఖంగా కూర్చుని ఆ పంచాంగాన్ని వినాలి. అలా వినడాన్నే పంచాంగ శ్రవణం అంటారు. పంచాంగ శ్రవణం వల్ల గంగాస్నానం చేసిన ఫలితం మరియు గోదానం చేసిన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతారు. అంతేకాదు శత్రువలు కూడా దూరమవుతారని, సంతాన సౌభాగ్యం దొరుకుతుందని చెబుతారు.

ఉగాది కథ..

ఉగాది కథ..

పురాణాల ప్రకారం.. ఉగాదిలో ‘ఉగ' అంటే నక్షత్రాల ప్రయాణం లేదా జన్మ ఆయుష్షు అని అర్థాలు ఉన్నాయి. వీటికి ఆది ఉగాది. అంటే ఈ లోకంలో జనుల ప్రాణాలకు తొలిరోజు కాబట్టి ఉగాదిగా మారింది. యుగం అంటే రెండు అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయనాలకు ఆయన ద్వయ సంయుతం‘యుగం'(ఏడాది) కాబట్టి ఈ యుగానికి ఆది ఉగాది అయ్యింది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడే కలియుగం ప్రారంభమైంది. త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది. ఈ పవిత్రమైన రోజే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసరుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. ఉగాది రోజే విక్రమార్కుడు, శాలివాహన చక్రవర్తి సింహాసనాన్ని అధిష్టించారు.

వసంత నవరాత్రులు..

వసంత నవరాత్రులు..

దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారి పూజలు ఎలా చేస్తారో.. వసంత నవరాత్రుల్లోనూ అమ్మవారిని అలాగే పూజిస్తారు. వసంత నవరాత్రుల్లో రామాయణ పారాయణ కాని, సుందరకాండ పారాయణం కాని, రామనామ జపాన్ని ప్రత్యేకంగా చేస్తారు. కొన్నిచోట్ల నింబకుసుమ భక్షణం చేస్తారు. వాతావరణాన్ని అనుసరించి ఇది ఏర్పడిందని పెద్దలు చెబుతారు. నింబ కుసుమం అంటే వేపపువ్వు. నింబ పత్ర అంటే వేపాకు. వీటిని ప్రతి ఒక్కరూ ఉగాది రోజున తినాలని పండితులు చెబుతున్నారు. దీని నుండే మనకు ఉగాది పచ్చడి ఏర్పడిందని చెబుతారు.

English summary

Ugadi 2021 Puja Vidhi, Katha, Samagri, Timings, Mantra, and Muhurat in telugu

Here we are talking about the ugadi puja vidhi, katha, samagri, timings, mantra, and muhurat in Telugu. Read on