For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రీరాముడు తల్లి కౌసల్య తెలుగింటి ఆడపడుచేనా? మన తెలుగు గడ్డపైనే శ్రీరాముడి కళ్యాణం ఎందుకు చేస్తారు?

రామాయణంలో పేర్కొన్న దక్షిణ కోసల ప్రాంతం స్పష్టంగా ఇదీ అని చెప్పలేకున్నా, అది నేటి తెలుగు రాష్ట్రాలకు అతి సమీపంలో ఉందన్న మాట మాత్రం వాస్తవం. శ్రీరాముడు తల్లి కౌసల్య తెలుగింటి ఆడపడుచేనా?

|

శ్రీరాముడు దేవుడు. ఆయనకు ఓ ప్రాంతం అంటూ ఏముంటుంది అనేది అందరూ చెప్పే మాట. మొత్తం భరతజాతికంతటికీ ఆయన ఒక మహానుభావుడు. అయితే రాముని మూలాలు కొన్ని తెలుగునాట కూడా ఉన్నాయని ఒక వాదన వినిపిస్తూ ఉంటుంది. అందుకు ముఖ్యమైన సాక్ష్యం రాముని తల్లి కౌసల్యే! కౌసల్య 'దక్షిణ కోసల' దేశానికి చెందిన రాజకుమారి అని చెబుతారు. ఈ దక్షిణ కోసల దేశం మరేదో కాదు. ఇప్పటి ఛత్తీస్‌ఘడ్‌, ఒడిషాలలోని భాగమే. ఇందులో ఈనాటి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో కొంత భాగం కూడా ఉండి కలిసి ఉండవచ్చు.

దక్షిణ కోసల ప్రాంతం

దక్షిణ కోసల ప్రాంతం

రామాయణంలో పేర్కొన్న దక్షిణ కోసల ప్రాంతం స్పష్టంగా ఇదీ అని చెప్పలేకున్నా, అది నేటి తెలుగు రాష్ట్రాలకు అతి సమీపంలో ఉందన్న మాట మాత్రం వాస్తవం. ఒకప్పుడు తెలుగువారు దక్షిణకోసలలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండేవారు. ఇప్పటికీ ఆయా రాష్ట్రాలలో ఉన్న తెలుగువారి సంఖ్య తక్కువేమీ కాదు. ఒక్క ఛత్తీస్‌ఘడ్‌లోనే పదిలక్షలకు పైగా తెలుగువారు నివసిస్తున్నారు. కాబట్టి శ్రీరాముని తల్లి కౌసల్య, తెలుగింటి ఆడపడుచు అనే మాటను కొట్టి పారేయలేము. ఒకవేళ వారు తెలుగువారు కాకున్నా, తెలుగు సంస్కృతితో పరిచయం మాత్రం తప్పకుండా ఉండి ఉంటుంది.

పర్ణశాలలో రాములవారు సీతాసమేతంగా నివసించారట

పర్ణశాలలో రాములవారు సీతాసమేతంగా నివసించారట

భద్రాచలంలో రాములవారి ఆలయానికి ఎంత ప్రాముఖ్యత ఉందో.. అక్కడికి దగ్గరలో ఉన్న పర్ణశాలకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. భద్రాచలానికి కొద్ది దూరంలో ఉన్న పర్ణశాలలో రాములవారు సీతాసమేతంగా నివసించారని చెబుతారు. ఈ పర్ణశాల నుంచే రావణుడు సీతమ్మవారిని ఎత్తుకుపోయాడట. ఆ సమయంలో జటాయువు అనే పక్షి సీతమ్మను కాపాడే ప్రయత్నం చేయగా, భద్రాచలానికి సమీపంలో ఉన్న యేటపాక అనే స్థలంలో రావణాసురుడు, జటాయువుని అంతమొందించాడన్నది స్థలపురాణం.

సీతమ్మవారు చీరను ఆరవేసిన గుర్తులు

సీతమ్మవారు చీరను ఆరవేసిన గుర్తులు

అలాగే రాముడు పర్ణశాలలో నివసించాడనేందుకు తగిన ఆధారాలున్నాయంని కొందరు పరిశోధకులు కూడా తెలిపారు. అయోధ్య మొదలుకొని లంక వరకు వనవాస సమయంలో రాముడు సాగించిన యాత్రను వీరు భారతదేశ పటంలో గుర్తించారు. ఇలా ఏకంగా 195 ప్రాంతాలను గుర్తించారు. వీటిలో భద్రాచలం కూడా ఒకటి. రాముడు దండకారణ్యంలో యాత్రను సాగిస్తూ, అనేక ఆటంకాలను ఎదుర్కొంటూ..... దండకారణ్యంలో భాగమైన భద్రాచలంలో విడిది చేశారట. ఇక్కడ సీతమ్మవారు చీరను ఆరవేసిన గుర్తులు, ఆమె సేకరించిన కుంకుమరాళ్లు తదితర గుర్తులను ఇప్పటికీ స్థానికులు చూపిస్తూ ఉంటారు.

గోదావరీ తీర ప్రదేశాల్లోనే

గోదావరీ తీర ప్రదేశాల్లోనే

భద్రాచలం నుంచి రాములవారు సీతమ్మను వెతుక్కుంటూ పంపానదీ తీరంలో శబరినీ, ఆ తరువాత రుష్యమూక పర్వతం మీద సుగ్రీవునీ కలుసుకున్నారట. ఇక అక్కడి నుంచి సాగిన రామాయణ కథ అందరికీ తెలిసిందే! అయితే మన భద్రాచలంలో పర్ణశాల ఉన్నట్లు మహారాష్ట్రలోని నాసిక్‌ క్షేత్రంలో పంచవటి అనే ప్రదేశం ఉంది. సీతాపహరణం జరిగింది అక్కడే అని స్థానికుల నమ్మకం. ఇంతకీ సీతాపహరణం భద్రాచలంలోనా, నాసిక్‌లోనా అన్న వివాదాన్ని పక్కన పెడితే గోదావరీ తీర ప్రదేశాలైన ఈ రెండు క్షేత్రాలలోనూ రాములవారు గడిపి ఉంటారని నిస్సందేహంగా భావించవచ్చు.

తెలుగనాట మాత్రమే వాడవాడలా సీతారామకళ్యాణం

తెలుగనాట మాత్రమే వాడవాడలా సీతారామకళ్యాణం

చైత్రశుద్ధ నవమినాడు, మధ్యాహ్నం పన్నెండుగంటల వేళకి రాములవారు జన్మించారన్నది పురాణగాథ. అందుకే భారతదేశమంతా ఆ రోజు శ్రీరామనవమి పేరుతో ఘనంగా జరుపుకుంటారు. కొన్ని చోట్ల రామకథలను గానం చేస్తారు. కొన్ని ప్రాంతాలలో రాముని విగ్రహాన్ని ఊయలలో వేసి ఆడిస్తారు. ఇంకొన్ని ప్రాంతాలలో సీతారాముల విగ్రహాలను ఊరేగిస్తూ రథయాత్రను నిర్వహిస్తారు. కానీ ఒక్క తెలుగనాట మాత్రమే వాడవాడలా సీతారామకళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు.

కౌసల్యాదేవి మన తెలుగింటి ఆడపడుచే

కౌసల్యాదేవి మన తెలుగింటి ఆడపడుచే

తెలుగువారు రాముని తమవాడిగా భావిస్తారు. రాముని తల్లి కౌసల్యాదేవి మన తెలుగింటి ఆడపడుచే అని చాలామంది నమ్మకం. అందుకనే రాముని వనవాసానికి పంపినప్పుడు, తన తల్లి రాజ్యమైన ఆంధ్రదేశంలో కూడా సంచరించాడట. ఆ సమయంలో ఆయన భద్రాచలంలోని పర్ణశాలలో ఉన్నాడనీ, అక్కడే రావణాసురుడు సీతమ్మవారిని అపహరించాడనీ చెబుతారు. ఆ తరువాత వానరసైన్యంతో కలిసి రాముడు లంకకు చేరుకోవడం, అక్కడ రావణాసురుని సంహరించడం తెలిసిందే!

ప్రతి పల్లెకూ విస్తరించింది

ప్రతి పల్లెకూ విస్తరించింది

రాముని జీవితం భద్రాచలంతో ఇంతగా ముడిపడి ఉంది కాబట్టి... అక్కడి ఆలయంలో వైభవంగా సీతారాముల కళ్యాణం చేసే ఆచారం మొదలై ఉంటుంది. భద్రాచల రాముని ఆలయాన్ని పునర్నిర్మించిన కంచర్ల గోపన్నే ఈ ఆచారాన్ని మొదలుపెట్టి ఉంటాడని అంటారు. అలా భద్రాద్రిలో మొదలైన ఆచారం ప్రతి పల్లెకూ విస్తరించింది.

లోకమంతా సుభిక్షంగా ఉంటుందని

లోకమంతా సుభిక్షంగా ఉంటుందని

జీలకర్ర బెల్లం పెట్టడం, మంగళసూత్రం కట్టడం, తలంబ్రాల పోసుకోవడం... ఇలా ఈనాటి తెలుగింట జరిగే వివాహంలాగానే సీతారాముల కళ్యాణం జరుగుతుంది. రాముని తెలుగింటి పిల్లవాడిగా, ఇక్కడే వనవాసం చేసిన అతిథిగా గుర్తిస్తూ... ఆయన జన్మించిన 12 గంటల సమయంలోనే కళ్యాణ ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. ఆ సీతారామకళ్యాణంతో లోకమంతా సుభిక్షంగా ఉంటుందని భావిస్తారు.

English summary

unknown facts about mother of lord rama kaushalya

unknown facts about mother of lord rama kaushalya
Story first published:Saturday, July 7, 2018, 13:32 [IST]
Desktop Bottom Promotion