For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆశ్చర్యపరుస్తున్న శ్రీరాముడి సోదరి రహస్య జీవితం.. !!

By Swathi
|

రామాయణం అంటే అందరికీ శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఇలా ప్రధాన పాత్రల గురించే తెలుసు. కానీ ఆ శ్రీరామచంద్రుడికి సోదరి ఉందని చాలా మందికి తెలియదు. రామాయణం గురించి వచ్చిన సినిమాలు, సీరియల్స్ లో కూడా రాముడి సోదరి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఎందుకు ? రాముడి అక్క గురించి ఎందుకంత రహస్యంగా ఉంచడం వెనక కారణం ఏంటి ?

సీతారామ లక్ష్మణులు ఎలా చనిపోయారో తెలుసా ?

కోశాల రాజు అయిన దశరథుడికి ముగ్గురు భార్యలు. కౌశల్య, సుమిత్రా, కైకేయి. కానీ వీళ్లకు పిల్లలు లేనందువల్ల రాజ్యమంతా దుఖంలో ఉంది. అప్పుడు మహర్షుల సూచన మేరకు దశరథ మహారాజు.. పుత్రకామేష్టి యాగం నిర్వహించాడు. ఆ యాగం చేసిన వెంటనే నలుగురు కొడుకులు జన్మించారు. కౌశల్యాకు రాముడు, సుమిత్రా దేవికి లక్ష్మణుడు, కైకేయికి భరతుడు, శత్రుజ్ఝుడు జన్మించాడు. నలుగురు కొడుకులు పుట్టడంతో.. కోశాల రాజధాని అయోధ్య సంబరాల్లో మునిగిపోయింది.

బ్రహ్మ తలను శివుడు నరికేశాడా ? ఎందుకు ?

వాల్మీకి రాసిన వశిష్ట రామాయణానికి చెందిన ఆది పర్వంలో దశరథుడు ఎలా రాజు అయ్యాడు అనేది వివరించారు. ఇందులో ఎవరికీ తెలియని దశరథుడి యుక్తవయస్సు, వివాహం, కూతురు గురించి ప్రస్తావించారు. అద్భుత రామాయణం, ఆధ్యాత్మ రామాయణం కూడా.. ఈ విషయం గురించి ప్రస్తావించింది. అందరిలోనూ ఎంతో ఆసక్తిని క్రియేట్ చేస్తున్న శ్రీరాముని సోదరి గురించి పూర్తీ వివరాలు ఇందులో ఉన్నాయి. దాని ఆధారంగా రామచంద్రుడి సోదరి గురించి కొన్ని రహస్యాలు మీతో పంచుకోబోతున్నాం..

కోశల రాజు

కోశల రాజు

కోశాల రాజు అయిన అజా మరణించిన సమయంలో.. కొడుకు దశరథుడికి కేవలం 8 నెలలు. అతనికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత కోశాల సామ్రాజ్యానికి రాజు అయ్యాడు. ఇతను రాజు శక్తివంతమైన రాజుగా కీర్తింపబడ్డాడు.

కౌశల్యా

కౌశల్యా

ఉత్తర కోశాల రాజ్యానికి చెందిన రాజుకి ఒక అందమైన కూతురు ఉంది. ఆమె.. కౌశల్య. ఈమెను దశరథుడు పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఆ రాజు కూడా అంగీకరించాడు. కానీ.. ఆ రాజు, దశరథుడు బంధువులవుతారని, ఒకే గోత్రానికి చెందిన వాళ్లని తెలియదు.

రావణుడికి కౌశల్యపై వ్యామోహం

రావణుడికి కౌశల్యపై వ్యామోహం

మరోవైపు లంక రాజ్యాధినేత రావణుడు కూడా కౌశల్యను పెళ్లి చేసుకోవాలని భావించాడు. అయితే అంతలోనే దశరథుడు, కౌశల్యకు జన్మించిన పుత్రుడి చేతిలో తన మరణం ఉంటుందని బ్రహ్మ ద్వారా రావణుడికి తెలుస్తుంది.

కౌశల్యను చంపాలనుకున్న రావణుడు

కౌశల్యను చంపాలనుకున్న రావణుడు

తన మరణానికి కారణమవుతారని భావించిన రావణుడు.. వాళ్ల పెళ్లికి ముందే కౌశల్యను చంపాలని భావించాడు. కానీ రావణుడి భార్య మండోధరి స్త్రీ హత్య మహాపాపం అని.. అలా చంపద్దని ప్రాధేయపడింది.

మండోదరి సలహా

మండోదరి సలహా

అయితే దశరథుడిని, కౌశల్యను విడదీయడం ద్వారా పెళ్లి జరకుండా అడ్డుకోవచ్చని మండోదరి రావణుడికి సూచించింది.

కౌశల్యను అపహరించిన రావణుడు

కౌశల్యను అపహరించిన రావణుడు

కౌశల్యను అపహరించడానికి కొంతమందిని పంపించాడు రావణుడు. ఆమెను కిడ్నాప్ చేసి.. ఒకపెట్టెలో బంధించి, సరయు నదిలో వదిలిపెట్టారు.

కాపాడిన దశరథుడు

కాపాడిన దశరథుడు

ఒకరోజు దశరథుడు సరయు నది దాటుతుండగా.. నదిలో కొట్టుకుపోతున్న పెట్టెను చూసి.. నదిలో దూకి ఆ పెట్టెను ఒడ్డుకు చేర్చి తెరిచి చూశాడు. ఆశ్చర్యపోయిన దశరథుడు రక్షించినది ఎవరినో కాదు కౌశల్యని.

పెళ్లి చేసుకున్న దశరథుడు

పెళ్లి చేసుకున్న దశరథుడు

అక్కడే కనిపించిన నారద మహర్షి.. వాళ్లిద్దరూ పెళ్లిచేసుకోవడానికి ఇదే సమయమని.. వెంటనే పెళ్లి చేసుకోమని సూచించాడు. వెంటనే పెళ్లి చేసుకున్నారు.

ఆడపిల్లకు జన్మ

ఆడపిల్లకు జన్మ

ఆ తర్వాత కౌశల్య ఆడపిల్లకు జన్మనిచ్చింది. కానీ.. ఆ పాప కాలు సరిగాలేకపోవడంతో వికలాంగురాలైంది. ఆ పాపకు శాంతా అని పేరు పెట్టారు.

వికలాంగురాలు

వికలాంగురాలు

దగ్గరి బంధువులు పెళ్లి చేసుకోవడం వల్ల పుట్టిన బిడ్డ వికలాంగురాలైందని మహర్షులు వివరించారు. అలాగే ఆ బిడ్డను ఎవరైనా దివ్యమైన జంటకు దత్తత ఇస్తే.. సాధారణ స్థితికి వస్తుందని సూచించారు.

దత్తత

దత్తత

అంగదేశ రాజు అయిన రోమాపాడకి ఆ పాపను దత్తత ఇచ్చారు. సరైన జాగ్రత్తలు, ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా శాంతాకి వికలత్వం పోయింది.

రిష్యశ్రీంగ మహర్షితో వివాహం

రిష్యశ్రీంగ మహర్షితో వివాహం

ఆ తర్వాత రోమాపాడ శాంతాని రిష్యశ్రీంగ మహర్షితో వివాహం చేశారు.

సుమిత్రా, కైకేయితో వివాహం

సుమిత్రా, కైకేయితో వివాహం

తర్వాత ఆరోగ్యవంతమైన పిల్లలు కలుగుతారని భావించి కూతురిని దత్తత ఇచ్చిన తర్వాత దశరథుడు సుమిత్రా, కైకేయిని వివాహం చేసుకున్నారు.

పుత్రకామేష్టి యాగం

పుత్రకామేష్టి యాగం

ఎంతకాలానికి పిల్లలు కలగకపోవడంతో.. మహర్షుల సూచన మేరకు జరిపిన పుత్రకామేష్టి యాగం.. తన కూతురి భర్త అయిన రిష్యశ్రీంగ మహర్షి దగ్గర ఉండి నిర్వహించాడు. ఈ యాగం తర్వాత.. దశరథుడు నలుగురు కొడుకులకు జన్మనిచ్చారు.

ఇది చూశారుగా శ్రీరాముడి సోదరి కథేంటో.

English summary

Unkown Story: The secretive life of Lord Rama’s sister

Unkown Story: The secretive life of Lord Rama’s sister. The unknown story in the Ramayana highlights that Shantai was Sri Rama's elder sister.
Story first published:Wednesday, June 8, 2016, 14:07 [IST]
Desktop Bottom Promotion