For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోరి వచ్చిన ఊర్వశిని అర్జునుడు ఎందుకు కాదన్నాడో తెలుసా?

ఊర్వశికి కోపం కట్టలు తెచ్చుకుంది. నన్ను ఇప్పటి వరకు ఇలా అవమానపరిచిన వాళ్లు ఎవరూ లేరు అని బాధపడింది. ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను.కోరి వచ్చిన ఊర్వశిని అర్జునుడు ఎందుకు కాదన్నాడో తెలుసా?

|

ఊర్వశి మహా అందెగత్తె. ఆమె అందానికి ఎవరైనా సరే దాసోహం కావల్సిందే. అయితే అర్జునుడిని శివుడు పరీక్షించాలనుకుంటాడు. అర్జునుడి విద్యలను మొత్తం కూడా శివుడు కిరాతుకుడి రూపంలోకి మారి పరీక్షిస్తాడు. అందులో అర్జునుడు నెగ్గుతాడు. తర్వాత అర్జునుడిని ప్రశంసిస్తూ ఇంద్రలోకంలోని దేవతలు కూడా ఆయనకు ఎంతో విలువైన అస్త్రాలు ఇచ్చేందుకు అర్జునుడుని స్వర్గలోకానికి ఆహ్వానిస్తారు.

ఊర్వశి నాట్యాన్ని చూసి మైమరిచిపోతాడు

ఊర్వశి నాట్యాన్ని చూసి మైమరిచిపోతాడు

స్వర్గంలో అర్జునుడికి అందరూ ఎంతో మర్యాదగా స్వాగతం పలుకుతారు. తర్వాత అర్జునుడిని వినోదపరిచేందుకు నాట్య ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. రంభ, మేనక, ఊర్వశి, అప్సరసలంతా కలిసి నాట్యం చేసి అర్జునుడిని సంతోషపరుస్తారు. రెప్పార్పకుండా అర్జునుడు ఆ నాట్యాలను చూస్తాడు. అయితే ఊర్వశి నాట్యాన్ని చూసి మైమరిచిపోతాడు.

అర్జునుడు మోజుపడినట్లున్నాడు

అర్జునుడు మోజుపడినట్లున్నాడు

ఊర్వశి తాను నాట్యం చేస్తున్నంత సేపు అర్జునుడినే గమనిస్తూ ఉంటుంది. అర్జునుడు నాపై మోజుపడినట్లున్నాడు.. అందుకే నన్ను తదేకంగా చూస్తూ ఉన్నాడనుకుంటుంది. సరే నాట్యం అయిపోయాక తన పరువాలు మొత్తం అర్జునుడికి సమర్పించి ఆనందింపచేద్దామనుకుంది.

నువ్వు నా వంకే చూస్తున్నావు

నువ్వు నా వంకే చూస్తున్నావు

నాట్యం అయిపోయాక అర్జునుడు వెళ్లి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అక్కడికి ఊర్వశి వెళ్తుంది. ఊర్వశి రాగానే పడుకున్న అర్జునుడు వెంటనే లేచి కూర్చొంటాడు. మీరు ఏంటి ఇలా వచ్చారని అడుగుతాడు అర్జునుడు. "అర్జునా... నేను నాట్యం చేస్తున్నప్పుడు నువ్వు నా వంకే చూస్తున్నావు.

నేను గమనించాను. " అని అంటుంది ఊర్వశి.

నువ్వు నాకు నచ్చావు

నువ్వు నాకు నచ్చావు

"నేను నీకు బాగా నచ్చినట్లున్నాను. నువ్వు కూడా నాకు బాగా నచ్చావ్. నీ గురించి నేను విన్నాను. నువ్వు ఎంతో ధైర్యవంతుడివి అని, అస్త్ర విద్యల్లో నిన్ను మించి మగాడులేడని నేను విన్నాను. అందుకే నువ్వు నాకు నచ్చావు.

నేను ఇప్పుడు నిన్ను డైరెక్ట్ గా చూస్తున్నాను. నిజంగా నువ్వు నన్ను మాయలో పడేశావు. నేను నీతో గడిపాలనుకుంటున్నాను. నిన్ను సంతోషపెట్టానుకుంటున్నాను" అని అంటుంది ఊర్వశి.

మీ భర్త పురూరవుడు మా వంశస్తుడే

మీ భర్త పురూరవుడు మా వంశస్తుడే

ఆ మాటలు విన్న అర్జునుడు ఆశ్చర్యపోతాడు. "అమ్మా.. నువ్వేనా ఈ మాటలు అంటుంది. నువ్వు నాకు తల్లిలాంటి దానివి. నీపై నేను మోజుపడడం ఏమిటమ్మా. మీ భర్త పురూరవుడు మా వంశస్తుడే. అంటే మీరు నాకు తల్లితో సమానం. అలాగే ఇంద్రుడికి కూడా మీరు ఎంతో నచ్చినవారు. అలాంటి నీతో నేను ఎలా కామ సుఖం పొందగలనమ్మా. " అని అర్జునుడు అంటాడు.

ఆ మాటలు ఊర్వశికి కోపం తెప్పించాయి

ఆ మాటలు ఊర్వశికి కోపం తెప్పించాయి

నేను నిన్ను మోహించలేదు. అలా ఎప్పటికీ చెయ్యను. కేవలం నీ నాట్యాన్ని చూసి మాత్రమే నన్ను నేను మైమరిచిపోయాను. నాకు ఎలాంటి ఆలోచనలు లేవు. సరే తల్లి నువ్వు వెళ్లి పడుకోపో అని అర్జునుడు అంటాడు. అయితే ఆ మాటలు ఊర్వశికి కోపం తెప్పించాయి.

అహం దెబ్బతింది

అహం దెబ్బతింది

కోరి వస్తే నన్నే తిరస్కరిస్తాడా? అని ఆమె అహం దెబ్బతింది.

ఆమె కోపంతో రగిలిపోయింది. సరే అర్జునుడికి అసలు మ్యాటర్ అర్థం కావడం లేదని అతనికి దగ్గరకు మళ్లీ వెళ్లి.. ఇది దేవలోకం ఇక్కడ అలాంటి నీతులు ఏమి ఉండవని చెప్పింది. అప్సరసల బాధ్యత ఆనందింప చేయడమేనని చెబుతుంది. అయినా అర్జునుడు రెండు చేతులు జోడించి మొక్కి వెళ్లిపో అంటాడు.

ఊర్వశికి కోపం కట్టలు తెచ్చుకుంది

ఊర్వశికి కోపం కట్టలు తెచ్చుకుంది

ఇక ఊర్వశికి కోపం కట్టలు తెచ్చుకుంది. నన్ను ఇప్పటి వరకు ఇలా అవమానపరిచిన వాళ్లు ఎవరూ లేరు అని బాధపడింది. ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను... కోరి వచ్చిన అందాన్ని కాదన్నావు కాబట్టి నీ జీవితంలో నువ్వు కొన్ని రోజులు నపుంసకుడిగా ఉండాలి అని శపిస్తుంది.

శాపమే వరం అయ్యింది

శాపమే వరం అయ్యింది

నీ ధైర్యపరాక్రమాలన్నీ పోయి నువ్వు ఆడవారితో ఉండాల్సి వస్తుందని శపిస్తుంది. దీంతో పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు బృహన్న మాదిరిగా మారిపోవాల్సి వస్తుంది. బృహన్న మాదిరిగా అర్జునుడు సంవత్సరం పాటు గడుపుతాడు. అయితే అర్జునుడికి ఆ శాపం కూడా అజ్ఞాతవాసంలో వరం అయ్యింది.

English summary

urvashis curse to arjuna

urvashis curse to arjuna, Urvashi, the celestial Apsara came to meet Arjuna in heaven. Beholding her at night in his mansion, Arjuna stepped up to receive her
Story first published:Thursday, July 19, 2018, 10:18 [IST]
Desktop Bottom Promotion