Just In
- 37 min ago
మీ కొలెస్ట్రాల్ స్థాయిని మరియు PPని తగ్గించడానికి ఈ 3 పదార్థాల మిశ్రమాన్ని తాగడం సరిపోతుంది!
- 1 hr ago
రాత్రి పడుకునే ముందు పాలలో చెంచా నెయ్యి కలుపుకుని తింటే ఎన్ని లాభాలో తెలుసా?
- 2 hrs ago
రొమాన్స్ లో గ్యాప్ రాకుండా చూసుకోండి.. లేదంటే ఎన్ని ప్రమాదాలో తెలుసా...
- 3 hrs ago
జుట్టు రాలిపోతుందా? దీన్ని రోజూ ఖాళీ కడుపుతో తింటే మీ జుట్టు రెండింతలు వేగంగా పెరుగుతుంది...
Don't Miss
- Movies
Dhagad Saamba Review సంపూర్ణేష్ బాబు మూవీ ఎలా ఉందంటే?
- News
అందరూ వదిలేసిన ఒంటరి జగన్, ఏ నదిపై ప్రాజెక్టు ఉందో తెలియని బడుద్దాయి అంబటి: బుద్దా
- Sports
ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్‌ల కోసం తమ స్క్వాడ్‌ను ప్రకటించిన శ్రీలంక బోర్డు
- Finance
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 1534 పాయింట్లు జంప్
- Technology
స్పామ్ కాల్లతో విసిగిపోయారా? అయితే ఇలా బ్లాక్ చేయండి...
- Automobiles
నా భార్య కోసం XUV700 బుక్ చేశా.. డెలివరీ కోసం నేను కూడా క్యూలో వెయిట్ చేస్తున్నా: ఆనంద్ మహీంద్రా
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Vaikuntha Ekadashi 2022:ఈ ఏడాది తొలి ఏకాదశి ఎప్పుడు? శ్రీహరి ఆశీస్సులు పొందాలంటే ఏమి చేయాలి?
హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర మాసం శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసం మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం, శ్రీరంగనాథునిగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందింది.
ప్రతిరోజూ పాసురంతో శ్రీ మహావిష్ణువుని స్తుతించిన గోదాదేవి తనను ప్రసన్నం చేసుకుంది. ఇక పుష్యమాసంలో వచ్చే శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుడిని దర్శించుకోవాలని ఎంతోమంది భక్తులు ఆరాటపడతారు.
ప్రతి ఏటా వచ్చే 24 ఏకాదశుల్లో ప్రతి ఏకాదశి పవిత్రమైనదే. అయితే వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం ఉండదు. ఎందుకంటే మిగిలిన ఏకాదశులన్నీ చంద్ర మానం లెక్కిస్తారు. వాటికి భిన్నంగా సూర్య కాల మానం ప్రకారం దీన్ని లెక్కిస్తారు. సూర్యుడు ఉత్తరాయాణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ పర్వదినాన శ్రీమహా విష్ణువు గరుడ వాహనంపై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని, అందుకే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని పండితులు చెబుతున్నారు. ఇంతటి పవిత్రమైన ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వచ్చే ఫలితాలేంటి.. ఈరోజున విష్ణుమూర్తిని ఎందుకు ఆరాధించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Indian
Festivals
Calendar
2022
:ఈ
ఏడాది
ముఖ్య
పండుగలు,
వ్రతాలు,
సెలవుల
తేదీలివే...

శుభ సమయం ఎప్పుడంటే?
పుష్య మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి జనవరి 12వ తేదీ సాయంత్రం 04:49 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు జనవరి 13వ తేదీ రాత్రి 7:32 గంటల వరకు కొనసాగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజున మధ్యాహ్నం 12:35 గంటల వరకు శుభ యోగం ఉంటుంది. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి వ్రతం రోజున ఉదయాన్నే పూజలు చేయడం ఉత్తమం.

విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు..
ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం, నూతన సంవత్సరం ప్రారంభమైంది. అలాగే కొత్త సంవత్సరాలు అన్ని ఉపవాసాలు మరియు పండుగలు వచ్చాయి. అందులో ఏకాదశి ఉపవాసాలు అత్యంత ముఖ్యమైన ఉపవాసాలుగా పరిగణించబడతాయి. పుష్య మాసంలో వచ్చే తొలి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈరోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తే.. మరణానంతరం మోక్షం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

వైకుంఠ ఏకాదశి విశిష్టత..
హిందూ మత విశ్వాసాల ప్రకారం, వైకుంఠ ఏకాదశి రోజున విష్ణువు యొక్క వైకుంఠ ధామం యొక్క తలుపు తెరుచుకుంటుంది. ఈరోజున ఉపవాసం ఉండి నిజమైన భక్తితో పూజించడం వల్ల మరణానంతరం మోక్షం లభిస్తుంది. వైకుంఠ ధామంలో శ్రీహరి పాదాల చెంత స్థానం లభిస్తుంది. ఈ పవిత్రమైన రోజునే ఉపవాసం ఉండటం వల్ల సంతానం పొందే అనుగ్రహం కూడా లభిస్తుంది. సంతానం లేని సమస్యతో బాధపడేవారు ఈ ఏకాదశి రోజున తప్పక ఉపవాసం ఉండాలని పండితులు చెబుతారు.
Ekadashi
2022
Dates:ఈ
ఏడాదిలో
ఏకాదశి
తేదీలు
ఎప్పుడొచ్చాయి..
శుభ
ముహుర్తాలివే...

పూజా పద్ధతి..
ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామున లేచి, స్నానం చేయాలి. ఆలయాన్ని శుభ్రపరచి, గుడితో సహా ఇల్లంతా గంగాజలం చల్లాలి. ఆ తర్వాత తులసి ఆకులు, అక్షింతలను దేవుడికి సమర్పించి పూలతో అలంకరించాలి. వైకుంఠ ఏకాదశి పూజను గణేశుని హారతితో ప్రారంభించండి. దీని తర్వాత, విష్ణువు మరియు లక్ష్మీదేవికి హారతి చేయండి. శ్రీ మహా విష్ణువుకు సాత్విక ఆహారాన్ని మాత్రమే సమర్పించండి. అందులో తులసిని తప్పనిసరిగా సమర్పించాలి.

ఈ మంత్రాలను జపించండి..
ఓం విష్ణు..
ఓం నారాయణ నమః
నారాయణ విద్మ హే.. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం నమో నారాయణ నమః
శ్రీమన్నారాయణ హరి హరి.

ఓ పురాణ కథ..
కృత యుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు. తను నిత్యం దేవతలను, రుషులను, ప్రజానీకాన్ని పట్టిపీడిస్తూ క్రూరంగా హింసించేవాడు. ముర హింసను తట్టుకోలేని దేవతలు శ్రీమహా విష్ణువుకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో మురాసరుడిని సంహరించబడానికి శ్రీహరి బయలుదేరతాడు. తనను అంతమొందించేందుకు శ్రీవిష్ణువు వస్తున్న విషయం తెలుసుకున్న మురాసరుడు సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. తనను బయటకు రప్పించేందుకు శ్రీమన్నారాయణుడు ఓ గుహలో నిద్రపోతున్నట్లు నటిస్తాడు. ఇదే అదనుగా భావించిన మురాసరుడు గుహలోకి ప్రవేశించి స్వామిని వధించేందుకు కత్తి దూయగానే ఒక శక్తి ఉద్భవించి మురాసరుడిని అంతమొందిస్తుంది.. ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఈ శక్తికే ఏకాదశి అని పేరు పెట్టారు.
పుష్య మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి జనవరి 12వ తేదీ సాయంత్రం 04:49 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు జనవరి 13వ తేదీ రాత్రి 7:32 గంటల వరకు కొనసాగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజున మధ్యాహ్నం 12:35 గంటల వరకు శుభ యోగం ఉంటుంది. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి వ్రతం రోజున ఉదయాన్నే పూజలు చేయడం ఉత్తమం.