For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Vaisakha Amavasya 2021: వైశాఖ అమావాస్య ప్రత్యేకతలేంటో తెలుసా...

వైశాఖ అమావాస్య 2021 తేదీ, ముహుర్తం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడిలో జాబిల్లి పూర్తిగా కలిసిపోతాడు. అందుకే ఆ రోజు మొత్తం ఆకాశమంతా చీకటిగా మారిపోతుంది. అమావాస్య అంటే ఆధ్యాత్మిక పరంగా ఎంతో గొప్పది.

Vaisakha Amavasya 2021 Date, Time and Significance in Telugu

పురాణాల ప్రకారం నింగిలో జాబిల్లి కనబడని రోజునే అమావాస్య అని చాలా మంది విశ్వసిస్తారు. అంతేకాదు ఈరోజు ఎలాంటి పనులు చేపట్టినా అవి విజయవంతంగా పూర్తి కావు అని చాలా మంది నమ్ముతారు.

Vaisakha Amavasya 2021 Date, Time and Significance in Telugu

ఈ సందర్భంగా 2021లో వైశాఖ అమావాస్య ఎప్పుడొచ్చింది.. శుభముహుర్తం ఎప్పుడు.. ఈ వైశాఖ అమావాస్య ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Akshaya Trititya 2021: అక్షయ తృతీయ రోజున ఈ మంత్రాలు పఠిస్తే.. లక్ష్మీదేవి కటాక్షం గ్యారంటీ...!Akshaya Trititya 2021: అక్షయ తృతీయ రోజున ఈ మంత్రాలు పఠిస్తే.. లక్ష్మీదేవి కటాక్షం గ్యారంటీ...!

వైశాఖ అమావాస్య ఎప్పుడు..

వైశాఖ అమావాస్య ఎప్పుడు..

హిందూ క్యాలెండర్ ప్రకారం, వైశాఖ బహుళ అమావాస్య 2021 సంవత్సరంలో మే 11వ తేదీ అంటే మంగళవారం నుండి ప్రారంభమవుతుంది. హిందూ పురాణాల ప్రకారం, ఈ రోజు నుండే వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. ఈరోజున దేవుళ్లకు పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. జీవితంలో సుఖ సంతోషాలొస్తాయని భక్తుల విశ్వాసం.

వైశాఖ అమావాస్య ముహుర్తం..

వైశాఖ అమావాస్య ముహుర్తం..

వైశాఖ అమావాస్య తిథి 2021లో మే 10వ తేదీ రాత్రి 9:55 నుండి ప్రారంభమవుతుంది.

వైశాఖ అమావాస్య తిథి మే 11వ తేదీ మధ్యాహ్నం 2:50 గంటల వరకు ముగుస్తుంది.

వైశాఖ అమావాస్య ప్రాముఖ్యత..

వైశాఖ అమావాస్య ప్రాముఖ్యత..

హిందూ పురాణాల ప్రకారం, వైశాఖ అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను ఆరాధించడం వల్ల వారి ఆశీర్వాదం లభిస్తుందని పండితులు చెబుతారు. అలాగే ఈరోజున పేదలకు దానధర్మాలు చేస్తే రెట్టింపు ప్రయోజనాలు దక్కుతాయట.

ఏమి చేయాలి..

ఏమి చేయాలి..

వైశాఖ అమావాస్య రోజున తెల్లవారుజామునే నిద్ర లేవాలి, ప్రవహించే నీటిలో లేదా నదిలో స్నానం చేయాలి. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా బయటకు వెళ్లడం అంత శ్రేయస్కరం కాదు.. కాబట్టి బయటకు వెళ్లడం మానుకోండి. ఇంట్లోనే స్నానం చేసే సమయంలో గంగా నీటిని కొంత కలుపుకోండి.

స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ గదిలో ఒక దీపం వెలిగించాలి.

ఈ పవిత్రమైన రోజున పూర్వీకులకు సంబంధించిన పనులు చేయాలి.

సాధ్యమైనంత ఎక్కువగా భగవంతుడిని స్మరిస్తూ ద్యానం చేయాలి.

వైశాఖ అమావాస్య రోజున శని దేవుని ఆరాధన కూడా ముఖ్యమే.

శని దేవుని అనుగ్రహం కోసం నువ్వులు, ఆవ నూనె మొదలైన వాటిని సమర్పించండి.

Akshaya Tritiya 2021: అక్షయ తృతీయ రోజున ఏ రాశి వారు ఏమి దానం చేయాలంటే...!Akshaya Tritiya 2021: అక్షయ తృతీయ రోజున ఏ రాశి వారు ఏమి దానం చేయాలంటే...!

మూడు యోగాలు

మూడు యోగాలు

ఈ సంవత్సరం వైశాఖ అమావాస్య సందర్భంగా రెండు ప్రత్యేక యోగాలు నిర్వహిస్తున్నారు. ఈరోజున సౌభాగ్య యోగ, శోభన్ యోగం ఏర్పడుతున్నాయి. మే 11వ తేదీ రాత్రి 10:43 నుండి సౌభాగ్య యోగం ప్రారంభమవుతుంది. దీని తర్వాత శోభన్ యోగం కూడా జరుగురుతుంది. వీటితో పాటు సిద్ధార్థ యోగం కూడా చేయనున్నారు. మే 11వ తేదీ రాత్రి మొదలైన ఈ యోగం మే 12వ తేదీ ఉదయం 5 గంటల 32 నిమిషాల వరకు ఉంటుంది. ఈ మూడు యోగాలు ముఖ్యమైనవే. వీటిలో సౌభాగ్య యోగం వల్ల అద్రుష్టం పెరుగుతుంది. అలాగే శోభన్ యోగం వల్ల శుభ ఫలితాలొస్తాయి.

ఉపవాసం ఉంటే..

ఉపవాసం ఉంటే..

ఈ పవిత్రమైన రోజు ఉపవాసం ఉంటే.. అనేక ప్రయోజనాలు చేకూరతాయని చాలా మంది నమ్మకం. ఈ రోజున ఉపవాసం ఉంటే.. మన పూర్వీకుల బాధతలను తీర్చడమే కాక.. రాహువు బలహీనత మరియు ఇతర సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతారు.

English summary

Vaisakha Amavasya 2021 Date, Time and Significance in Telugu

Here we are talking about the vaisakha amavasya 2021 date, time and significance in Telugu. Read on
Story first published:Monday, May 10, 2021, 20:47 [IST]
Desktop Bottom Promotion