Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వాలంటైన్స్ డే రోజు ఈ గుడికి వెళ్తే పెళ్తైనట్లే!..సింగిల్ గా వెళ్తే జంటగా తిరిగొస్తున్నారు!
ఫిబ్రవరి నెలని లవర్స్ మంత్ అని కూడా అంటుంటారు. దీనికి కారణం ఫిబ్రవరి 14న జరుపుకునే వాలంటైన్స్ డే. ఫిబ్రవరి రాగానే ప్రపంచ వ్యాప్తంగా వాలెంటైన్స్ డేకి సన్నాహాలు మొదలవుతాయి. చాలామంది వాలైంటైన్స్ రోజునే తమ ప్రియమైనవారికి తమ ప్రేమను తెలియపరుస్తుంటారు,సర్ ప్రైజ్ చేస్తుంటారు. ఇక, బంటరి వ్యక్తులు ఈ ఏడాది అయినా తమకు భాగస్వామి దొరికేలా చూడమని దేవుడిని ప్రార్థిస్తుంటారు. వాలంటైన్స్ డే వీక్ లో ఓ ఆలయంకి వెళ్లే పెళ్లి కానివాళ్లకు పెళ్లి అయిపోతుందట,లవర్ లేని వాళ్లకు లవర్ దొరుకుతారంట. ఆ గుడి ఎక్కడ ఉంది,దాని ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం.
జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఉలాటు గ్రామంలో ఒక శివాలయం ఉంది. రాంచీలోని YBN యూనివర్సిటీ క్యాంపస్ వెనుక పెద్ద కొండ ఎక్కి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయం ఏడాది పొడవునా భక్తులను ఆకర్షిస్తున్నప్పటికీ, ప్రేమికుల వారంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ శివాలయం నిజమైన ప్రేమను పొందే ప్రదేశంగా ఖ్యాతిని పొందింది. ఈ గుడిలో తల వంచి నమస్కరిస్తే మంచి జీవిత భాగస్వామి లభిస్తారని నమ్మకం.

ఈ ఆలయంలో శివునికి నమస్కరించడం ద్వారా జీవిత భాగస్వామి గురించి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయంట. తమకు తగిన జీవిత భాగస్వామి దొరకాలరుకుంటే యువతీ యువకులు ఆలయానికి వస్తుంటారని ఆలయ పూజారి శంభునాథ్ తెలిపారు. అంతేకాకుండా పూజారి ప్రకారం వారి కోరికలు తరచుగా రెండు మూడు నెలల్లోనే నెరవేరుతాయి. ఈ ఆలయానికి వచ్చిన వెళ్లాక చాలా మంది వ్యక్తులు తమ జీవిత భాగస్వాములను కనుగొనడం, వివాహం చేసుకోవడం, కుటుంబాలు ప్రారంభించడం చూసినట్లు చెప్పారు. ఈ వివాహాలు ఏవీ కూడా విడాకులతో ముగియలేదని చెప్పారు. ఈ ఆలయానికి తమ కృతజ్ఞతలు తెలియజేయడానికి భక్తులు క్రమం తప్పకుండా ఆలయాన్ని సందర్శిస్తూనే ఉంటారని ఆయన చెప్పారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు
ఈ ఆలయంలో పూజించే విధానం విశిష్టమైనది. భక్తులు తమ కోర్కెలు తీర్చుకోవడానికి కొబ్బరికాయలు తీసుకువస్తారు, కానీ ఇతర దేవాలయాల మాదిరిగా ఇక్కడ కొబ్బరికాయలు పగలడం లేదు. బదులుగా, అది ఆలయం వద్ద కట్టివేయబడుతుంది. కోరిక నెరవేరిన తర్వాత భక్తులు కొబ్బరికాయను సేకరించి ప్రసాదంగా పంపిణీ చేస్తారు, కోరిక నెరవేరే వరకు కొబ్బరికాయను తాకకుండా చూసుకుంటారు.



Click it and Unblock the Notifications