For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాల్మీకి జయంతిని ఎందుకు జరుపుకుంటారు.. ఆ పేరు ఎలా వచ్చింది...

వాల్మీకి జయంతి 2020 తేదీ, జన్మకథ, విశిష్టత మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

|

హిందూ క్యాలెండర్ ప్రకారం, వాల్మీకి మహర్షి జయంతిని ప్రతి సంవత్సరం అశ్విని నెలలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన శనివారం రోజున ఈ పండుగను జరుపుకుంటున్నాం. వాల్మీకి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా ఈ వేడుకలు జరుపుకోవడం సాధ్యం కాకపోవచ్చు.

Valmiki Jayanti 2020 Date, Janma Katha, Importance and Significance

ఇప్పటివరకు వాల్మీకి పుట్టుక గురించి స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ అతను మహర్షి కశ్యప మరియు అదితి తొమ్మిదో కుమారుడు వరుణ్, చార్సి దంపుతలకు జన్మించాడని పండితులు చెబుతారు.

Valmiki Jayanti 2020 Date, Janma Katha, Importance and Significance

దీంతో పాటు వాల్మీకి మహర్షి గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. పురాణాల ప్రకారం వాల్మీకి బ్రహ్మ అంశతో పుట్టాడని కొందరు పండితులు చెబుతుంటారు. దారి దోపిడీలు... జంతువులను వేటాడి.. వెంటాడి వధించడం.. తదితర హత్యలు చేస్తున్న వాల్మీకి, సప్త రుషుల బోధనల వల్ల మహర్షిగా మారాడని, చెడు సహవాసాలతో కిరాతకుడిగా మారిన రత్నాకరుడికి నారదుడు 'రామ' నామాన్ని ఉపదేశించాడట.

Valmiki Jayanti 2020 Date, Janma Katha, Importance and Significance

ఆ నామం జపిస్తూ తీవ్రమైన తపస్సు చేసిన ఆయన చుట్టూ పుట్టలు పెరిగిపోయాయట. ఆ పుట్టల మధ్య నుండి బయటపడ్డ రత్నాకారుడే వాల్మీకిగా మారారని మరో కథలో ఉంది. ఈ నేపథ్యంలో బోయవాడిగా ఉన్న వాల్మీకి రుషిగా, రచయితగా ఎలా మారాడనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆ పేరు ఎలా వచ్చింది...

ఆ పేరు ఎలా వచ్చింది...

పురాణాల ప్రకారం వాల్మీకి మహర్షి ఘోర తపస్సులో మునిగిపోయాడు. అప్పుడు అతని శరీరంలోకి చెద పురుగులు ఎక్కాయి. వాల్మీకి మహర్షి తపస్సు పూర్తయిన తర్వాత వాటిని తొలగించారు. అలాంటి పరిస్థితిని అప్పట్లో వాల్మీకి అని పిలిచేవారు. అలా ఈయనకు వాల్మీకి రత్నాకర్ అనే పేరు వచ్చింది.

వాల్మీకి ఆశ్రమంలో..

వాల్మీకి ఆశ్రమంలో..

పురాణాల ప్రకారం శ్రీరాముడు సీతను విడిచి దూరంగా ఉన్న కాలంలో సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో చాలా సంవత్సరాలు నివసించింది. ఇక్కడే తల్లి సీతాదేవి లవ,కుశలకు జన్మనిచ్చింది. సీతమ్మ తల్లిని వాన్ దేవి అని పిలవడానికి కూడా కారణం ఇదే.

వాల్మీకి ఎవరు..

వాల్మీకి ఎవరు..

వాల్మీకి రత్నాకర్ అని కూడా పిలుస్తారు. ఒక భిలానీ రత్నాకరుడు దొంగిలించాడని, దీని కారణంగా అతను భిల్ సమాజంలో పెరిగాడు. తర్వాత ఒక దొంగగా మారాడు. రత్నాకర్ తాను తప్పు మార్గంలో ఉన్నానని తెలుసుకున్నప్పుడు, తాను మళ్లీ ఆ తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. కొత్త మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాడు.

నారదుని సలహాతో..

నారదుని సలహాతో..

ఆ సమయంలో నారద మహర్షిని సంప్రదించగా.. ‘రామ'పేరు జపించమని.. తన మార్గంలో వెళ్లమని నారదుడు సూచించాడు. అప్పటి నుండి సన్యాసిగా మారి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఏదేమైనా, బ్రహ్మ ఈ తపస్సుకు మెచ్చి తనకు జ్ణానాన్ని ఇచ్చాడు. అంతేకాదు. అతనికి రామాయణం రాసే సామర్థ్యాన్ని సైతం ఇచ్చాడు. వాల్మీకి గురించి ఇంకా కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

వాల్మీకి జయంతి శుభ ముహుర్తం..

వాల్మీకి జయంతి శుభ ముహుర్తం..

హిందూ క్యాలెండర్ ప్రకారం అశ్విని నెల పౌర్ణమి రోజున, అంటే అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం 5:45 గంటలకు ప్రారంభమై, అక్టోబర్ 31వ తేదీన ఉదయం 8:18 గంటలకు ముగుస్తుంది. ఈ విధంగా అక్టోబర్ 31న వాల్మీకి జయంతిని జరుపుకుంటారు.

English summary

Valmiki Jayanti 2021 Date, Janma Katha, Importance and Significance

Here we talking about the valmiki jayanti 2021 date, janma katha, importance and significance. Read on.
Desktop Bottom Promotion