For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరలక్ష్మీ వ్రతంలో ఉన్నప్పుడు ఏమి తినాలి.. ఏమి తినకూడదో చూసెయ్యండి...

వరలక్ష్మీ వ్రతంలో ఉన్న వారంతా ఎక్కువగా పాలు, అరటిపండ్లు వంటి వాటినే ఎక్కువగా తీసుకోవాలి.ఈ ఫలహారాలను ఎక్కువగా తీసుకుంటే మహిళల్లో పూజ చేసేందుకు కావాల్సిన శక్తి, సామర్థ్యాలు వస్తాయి. ఎక్కువగా అరటిపండ్లు,

|

దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రధానమైన పూజలలో లక్ష్మీదేవి పూజ ప్రముఖంగా ప్రసిద్ధి గాంచింది. ఈ వ్రతాన్ని వివాహమైన మహిళలు ఎక్కువగా చేస్తారు. శ్రావణమాసంలో వచ్చే శుక్రవారం రోజున వారు వ్రతాన్ని ఆచరిస్తారు. వారి కుటుంబంలో అందరూ సుఖసంతోషాలతో జీవించాలని, భర్తల ఆరోగ్యం బాగుండాలని ఈ పూజను చేస్తారు. ఈ పూజ చేస్తే సుదీర్ఘ కాలం పాటు ఆయురారోగ్యాలతో, హాయిగా జీవిస్తారని వారి నమ్మకం. ఈ పూజ పూర్తయ్యే వరకు వ్రతం చేసే మహిళలంతా ఉపవాసం ఉండాలి. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఎక్కువగా ఈ పూజ చేస్తుంటారు.

Varalakshmi Puja

ఈ ఫలహారాలను ఎక్కువగా తీసుకుంటే మహిళల్లో పూజ చేసేందుకు కావాల్సిన శక్తి, సామర్థ్యాలు వస్తాయి. ఎక్కువగా అరటిపండ్లు, బాదంపప్పు, ఎండుద్రాక్షలు, పండ్ల రసాలు, పాలు వంటివి తీసుకుంటే ఉపవాసం ఉండే మహిళలకు పూజ చేసుకుకేనేందుకు చాలా వీలుగా ఉంటుంది.

అరటిపండు

అరటిపండు

అరటిపండు మన శరీరంలో శక్తిని పెంచేందుకు చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పోటాషియం, సహజ గ్లూకోజ్ అరటిపండును సమృద్ధిగా తయారు చేస్తుంది. ఈ రెండు కలిసే మన శక్తి, సామర్థ్యాలను పెంచడానికి ఎక్కువగా సహాయపడుతుంది. ఈ అరటిని పండ్ల రూపంలో లేదా జ్యూస్ రూపంలోనైనా చేసుకొని తీసుకోవచ్చు. కనీసం ఒక అరటిపండును తిన్నా కూడా పనిభారాన్ని తట్టుకునే శక్తినిస్తుంది. అంతేకాదు మనకు సంపూర్ణత్వ భావనను కలిగిస్తుంది.

పాలు :

పాలు :

పాలలో విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం వంటివి సమృద్ధిగా లభిస్తాయి. మనం ఉపవాసం ఉన్న సమయంలో ఇది స్వచ్ఛమైనదిగా పరిగణించొచ్చు. చాలా మంది దేవతలు కూడా చాలా పనులకు పాలనే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక కప్పు పాలు తాగడం ద్వారా పూజ చేసే రోజున ఉపవాసం ఉన్న మహిళలకు చాలా శక్తి లభిస్తుంది.

పండ్ల రసాలు :

పండ్ల రసాలు :

పాలు, అరటిపండు అందుబాటులో లేకపోతే మనం తాజా పండ్ల రసాలను కూడా తీసుకోవచ్చు. ఈ పండ్ల రసాలలో బొప్పాయి, పుచ్చకాయ, నారింజ, దానిమ్మతో పాటు ఇతర పండ్ల రసాలను కూడా తీసుకోవచ్చు. ఉపవాసం ఉన్న వారు వీటిని తీసుకోవడం ద్వారా శక్తివంతంగా తయారవ్వడమేకాక ఆరోగ్యకరంగానూ ఉంటారు.

గింజలు:

గింజలు:

వరలక్ష్మీ వ్రతం రోజున ఉపవాసం ఉండే మహిళలకు కొన్ని గింజలు వేగంగా శక్తిని ఇచ్చేందుకు ఉపయోగపడతాయి.

ఈ గింజలలో ముఖ్యంగా బాదం, ఎండుద్రాక్షలు అత్యంత వేగంగా శక్తినిస్తాయి.

బాదం పండ్లలో విటమిన్ ఇ, మెగ్నీషియం అధికంగా ఉంటాయి.

మూడు లేదా నాలుగు బాదం పప్పుగింజలను, నాలుగు లేదా ఐదు ఎండుద్రాక్షలను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి, ఉపవాసం ఉండే రోజు ఉదయాన్నే తీసుకోవాలి.

ఇది పూజ చేసే సమయంలో శక్తిని అందించేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది.

రైస్ ఐటమ్స్..

రైస్ ఐటమ్స్..

వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే వారు రైస్ ఐటమ్స్ తీసుకోకపోవడం చాలా మంచిది. ఎందుకంటే బియ్యంతో వండిన పదార్థాల వల్ల మీకు కొంచెం నిద్ర మత్తు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మీ వ్రతానికి భంగం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. అయితే వరలక్ష్మీ వ్రతం పూర్తయ్యాక దద్దోజనం లేదా పులిహోర చేసుకుని తీసుకుంటే మంచి ప్రయోజనాలుంటాయి.

ఫాస్ట్ ఫుడ్ వద్దు..

ఫాస్ట్ ఫుడ్ వద్దు..

వరలక్ష్మీ వ్రతం చేయాలనుకునేవారు ఫాస్ట్ ఫుడ్ వంటివి తీసుకోకపోవడం చాలా ఉత్తమం. ఇందులో ఉండే ఫైబర్, మసాలాలు, నూనె కారణంగా మీరు వ్రతంలో కూర్చొన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు వ్రతంలో పాల్గొనడానికి ముందు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లకండి.

Read more about: festival pooja fasting
English summary

Varalakshmi Puja 2022: What To Eat While You Are On Vrata (Fasting)

Many women worship Varalakshmi on the first Friday of the month of Shravan. Fasting on the same day. It is believed that this puja will lead to a long life with ayurvedic ailments. All women who fast till the completion of this puja must fast. Most of the pujas are performed on the Friday before the full moon in the Shravanamsa. Whatever diet they take, the body gets energized. How fast you get energy. Let's find out how much it is used to worship.
Desktop Bottom Promotion