For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరలక్ష్మీ వ్రతం : పెళ్లి కానీ అమ్మాయిలు ఈ వ్రతం చేయొచ్చా...?

వరలక్ష్మీ వ్రతం యొక్క తేదీ, ముహుర్తం మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకందాం.

|

శ్రావణ మాసాన్ని హిందువులందరూ ఎంతో పవిత్రమైనది మరియు శుభప్రదమైనదిగా పరిగణిస్తారు. ఈ నెలలో వచ్చే ప్రతిరోజూ ప్రత్యేకమైనదిగా భావిస్తారు. అయితే వీటన్నింటిలో శుక్రవారం లక్ష్మీదేవి అంకితం చేయబడిందని అందరూ నమ్ముతారు. ఆరోజున చాలా మంది స్త్రీలు వరలక్ష్మీ వ్రతం చేయడంతో పాటు ఉపవాసం ఉంటారు.

Varalakshmi Vratam 2020 Date, Shubh muhurat and Significance

పురాణాల ప్రకారం ఆనందం, ఐశ్వర్యం, సంపద మొదలైన వాటి కోసం వరలక్ష్మీ వ్రతం రోజున ఉపవాసం పాటిస్తారు. ఈ సందర్భంగా ఈ ఏడాది అది కూడా కరోనా లాక్ డౌన్ సమయంలో వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు వచ్చింది.. ఏరోజున ఆరాధన చేయాలి.. ఈ పూజకు సంబంధించిన శుభ ముహుర్తంతో పాటు ఈరోజున ఉపవాసం ఎన్ని ప్రయోజనాలో ఇప్పుడు తెలుసుకుందాం...

వరలక్ష్మీ తేదీ, పవిత్ర సమయం..

వరలక్ష్మీ తేదీ, పవిత్ర సమయం..

  • ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 5వ తేదీన శుక్రవారం నాడు వచ్చింది.
  • ఉదయం పూజ ముహూర్తం: 06:14 నుండి 08:32 వరకు
  • మధ్యాహ్నం పూజ ముహూర్తం: 01:07 నుండి 03:26 వరకు
  • సాయంత్రం పూజ ముహూర్తం: 07:12 నుండి 08:40 వరకు
  • ఉపవాసం ప్రయోజనాలు..

    ఉపవాసం ప్రయోజనాలు..

    వరలక్ష్మీ వ్రతం రోజున ఉపవాసం ఉంటే అనేక ప్రయోజనాలు లభిస్తాయని చాలా మంది నమ్మకం. ఈరోజున లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈరోజున ఉపవాసం ఉండే వారి ఇంట్లో డబ్బు, ధాన్యంతో పాటు సకల సంపదలు లభిస్తాయని పండితులు చెబుతారు. ఈరోజున ఉపవాసం చేయడం వల్ల సరస్వతీ దేవితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. అంతేకాదు మీ మేధస్సు పెరుగుతుంది. ఈరోజున ఉపవాసం పాటించి వారి జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. పెండింగులో ఉన్న మీ పనులన్నీ పూర్తవువాతాయి. అంతేకాదు మీకు ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

    వివాహితులకు ప్రత్యేక ప్రయోజనాలు..

    వివాహితులకు ప్రత్యేక ప్రయోజనాలు..

    వరలక్ష్మీ వ్రతాన్ని పెళ్లికాని అమ్మాయిలు చేయకూడదు.. హిందూ ఆచారాల ప్రకారం, వివాహిత మహిళలు మాత్రమే వరలక్ష్మీ వ్రతాన్ని చేయాలి. ఈ ఉపవాసం కన్యలుగా ఉండే అమ్మాయిలకు నిషేధించారు. ఎందుకంటే వివాహితులు తమ కుటుంబం యొక్క ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు కోసం ఈ ఉపవాసాన్ని పాటిస్తారు. భార్యభర్తలిద్దరూ కలిసి ఈ వ్రతం చేస్తే ఇద్దరికీ ఆ లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుంది. ఆ తల్లి అనుగ్రహం వల్ల మీకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.

    వరలక్ష్మీ వ్రతం కథ చదవాలి..

    వరలక్ష్మీ వ్రతం కథ చదవాలి..

    పురాణాల ప్రకారం ఒకప్పుడు మగధ రాజ్యంలో కుండి అనే నగరం ఉండేది. ఈ నగరంలో చారుమతి అనే బ్రాహ్మణ మహిళ తన కుటుంబంతో కలిసి నివసించింది. చారుమతి ఒక విధేయతగల మహిళ ఉండేది. ఆమె తన అత్తగారు, బావ, మరియు భర్తకు సేవ చయడం ద్వారా మరియు లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా ఆదర్శవంతమైన మహిళా జీవితాన్ని గడిపింది.

    వరలక్ష్మీ ఉపవాసం..

    వరలక్ష్మీ ఉపవాసం..

    ఒక రాత్రి చారుమతి కలలో లక్ష్మీ దేవి కలలో శుక్రవారం నాడు ఉపవాసం చేయమని చెప్పింది. ఈ ఉపవాసం ప్రభావం వల్ల మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. మరుసటి రోజు ఉదయం, లక్ష్మీదేవి చెప్పినట్లు చారుమతితో పాటు ఇతర మహిళలు కూడా వరలక్ష్మీ వ్రతాన్ని చేశారు.

    అంతా బంగారమే..!

    అంతా బంగారమే..!

    అలా లక్ష్మీదేవి ఆరాధన సమయంలో అమ్మవారి విగ్రహానికి బంగారు ఆభరణాలతో అలంకరించారు. దీంతో వారి ఇళ్లు కూడా బంగారంగా మారిపోయాయట. అంతేకాదు గుర్రాలు, ఏనుగులు, ఆవులు మొదలైన జంతువులు వారి వద్దకు వచ్చాయి. అప్పుడు మహిళలంతా కలిసి చారుమతి ఉపవాస పద్ధతిని వివరించినందుకు ఆమెను ప్రశంసించారు. తర్వాత శివుడు పార్వతీదేవికి ఈ కథ చెప్పాడు. అందుకే ఈ సమయంలో ఉపవాసం చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని చాలా మంది నమ్మకం.

English summary

Varalakshmi Vratam Date, Shubh muhurat and Significance

Here we talking about varalakshmi vratam 2022 date, shubh muhurat and significance. Read on.
Desktop Bottom Promotion