For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీపావళి వేళ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే.. ఈ వాస్తు చిట్కాలు ఫాలో అవ్వండి...

|

ఇప్పటిదాకా మీ జీవితంలో నెలకొన్ని చీకట్లనీ తొలగిపోవాలని.. మీ కలలన్నీ కాంతి కన్నా వేగంగా నిజం అవ్వాలని.. మనమంతా రాకెట్ కన్నా ఎత్తుకు ఎదిగిపోవాలని, భూచక్రాల్లా మీ ఇంట నవ్వులు విరబూయాలని.. ఈ దీపావళి పండుగను మీరంతా దివ్యంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు...

అజ్ణానం అనే చీకటిని తొలగించి.. మన జీవితంలో వెలుగులు నింపే ఈ పండుగ ఆధ్యాత్మిక, శారీరక సంబంధాలను పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. చెడు ప్రభావాలపై దీపావళి ఆధ్యాత్మిక విజయంగా పేర్కొనబడుతోంది.

ఇదిలా ఉండగా దీపావళి వేళ ఇంట్లోనే పండుగను ఆనందంగా జరుపుకోవాలంటే.. పూజా మందిరంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలంటే కొన్ని వాస్తు నియమాలు కచ్చితంగా పాటించాలి.

అప్పుడే ఇంట్లో మీ ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా మీ ఇంట్లో వెలుగులు నింపే దీపావళి వాస్తు చిట్కాలేంటో ఇప్పుడే చూసెయ్యండి...

దివాళి మరియు దీపావళి మధ్య గల తేడాలేంటి? ఈ పండుగ విశిష్టతలేంటో తెలుసుకుందామా...

ఈ వస్తువులను..

ఈ వస్తువులను..

లక్ష్మీదేవికి దీపావళి పండుగ అంటే ఎంతో ఇష్టమైనది. ఈ పవిత్రమైన రోజున ఉప్పు నింపిన గాజు సీసాని ఇంట్లో ఏదో ఒక మూల గాని, స్నానాల గదిలో గాని పెడితే ప్రతికూల శక్తులన్నీ బయటకు పోయి.. లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుందని చాలా మంది నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం, పాత బట్టలు, విరిగిన బల్లలు, పాత్రలు దుమ్ము పేరుకుపోయిన వస్తువులను తొలగించి శుభ్రం చేసుకోవాలట. దీని ఉద్దేశ్యం చెడు విషయాలను వదిలించుకుని కొత్త వస్తువులను ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి.

ప్రత్యేక దీపారాధన..

ప్రత్యేక దీపారాధన..

దీపావళి అంటే దీపాల పండుగ. రంగు రంగుల దీపాలను ఇంటి చుట్టూ వెలిగించడం వల్ల.. వాటి నుండి వెలువడే కాంతి ద్వారా ప్రతికూల శక్తిని తరిమికొట్టొచ్చు. అయితే మట్టితో చేసిన దీపాలను వెలిగించడం పూర్వం నుండి సంప్రదాయంగా వస్తుంది. అలాగే నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి వత్తుల ద్వారా దీపాలను వెలిగించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో మట్టి దీపాలను వెలిగించాలి. తూర్పున పచ్చని రంగులో.. ఆగ్నేయం దిశలో నారింజ రంగులో.. దక్షిణ దిశలో ఎరుపు, నైరుతి వైపున గులాబీ రంగు, పడమర దిశలో నీలం, వాయువ్యంలో నీలం లేదా బూడి రంగులో ఉండే దీపాలను వెలిగిస్తే శుభ ఫలితాలొస్తాయట.

దోషం పోవాలంటే..

దోషం పోవాలంటే..

పురాతన గ్రంథాల ప్రకారం వాస్తు దోషాలు పోవాలంటే.. దీపావళి వేళ శ్రీ యంత్రాన్ని వాడాలట. దీన్ని వాడటం వల్ల ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అలాగే మీ జీవితంలో ఎదురయ్యే అనేక అడ్డంకులను అధిగమించడానికి.. మీరు హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేసేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుందట. దీపావళి వేళ ప్రపంచంలోని శక్తులన్నీ అత్యంత అనుకూలంగా ఉంటాయట. అయితే ఈ శ్రీ యంత్రాన్ని తూర్పు దిక్కున ఉంచాలట. ఎందుకంటే పూజా మందిరం ఆ దిశలోనే ఉంటుంది కనుక.

Diwali 2021:దీపావళి పండుగ వేళ చేయాల్సిన, చేయకూడని పనులివే...

కుభేర పూజ..

కుభేర పూజ..

దీపావళి వేళ ధనలక్ష్మీకి ప్రతిరూపమైన కొన్ని ప్రత్యేక చిహ్నాలను కూడా పూజిస్తారు. అదే సమయంలో లక్ష్మీదేవితో పాటు కుభేరుడిని పూజించాలి. ముఖ్యంగా వ్యాపారులు ఈ పూజను ఎక్కువగా చేస్తుంటారు. లక్ష్మీదేవి శ్రేయస్సు, సంపదకు ప్రతిరూపం అయితే.. కుభేరుడు ఆ సంపదను నిర్వాహకుడిగా వ్యవహరించి.. డబ్బుకు రక్షణగా ఉంటాడని చాలా మంది నమ్ముతారు. హిందూ పురాణాల్లోనే కాకుండా జైన, బౌద్ధ సంప్రదాయాల్లోనూ కుభేరుడికి ప్రత్యేక స్థానముంది. కాబట్టి దీపావళి సందర్భంగా లక్ష్మీదేవితో పాటు కుభేరుడిని కచ్చితంగా పూజించాలి.

శుభ ముహుర్తంలో..

శుభ ముహుర్తంలో..

హిందూ పంచాంగం ప్రకారం, దీపావళి వేళ లక్ష్మీదేవి పూజను ఎల్లప్పుడూ శుభముహుర్తంలోనే ప్రారంభించాలి. అది కూడా ప్రదోష సమయంలో ప్రారంభించాలి. మీకు పూజా విధానం గురించి తెలియకపోతే.. దగ్గర్లోని పండితుల సహాయం తీసుకోవాలి. ఎందుకంటే దీపావళి పూజ చాలా ప్రత్యేకమైనది.

English summary

Vastu Tips For Diwali For a Fruitful Puja at Home in Telugu

Here are the vastu tips for diwali for fruitful puja at home in Telugu. Have a look
Story first published: Thursday, November 4, 2021, 13:41 [IST]