Latest Updates
-
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు
భార్యాభర్తల మధ్య గొడవలకు ఈ వాస్తు దోషాలే కారణం!..అవి మీ ఇంట్లో ఉన్నాయా లేదో చూడండి
జీవితంలో ప్రతి అంశం వాస్తుతో ముడిపడి ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. వాస్తు శాస్త్రం..ఇంటి దిశ, అలంకరణ, ఇతర అంశాలు అందులో నివసించే వారి జీవితాలు,సంబంధాలపై ప్రభావం చూపుతాయని తెలియజేస్తుంది. ధనికులైనా,పేదలైనా భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న వివాదాలు సహజమే. అయితే మొగుడు పెళ్లాం మధ్య గొడవలు పదే పదే జరుగుతూ రిలేషన్ షిప్ లో టెన్షన్ పెరిగిపోతే అది ఆందోళన కలిగిస్తుంది. మీ ఇంట్లో వాస్తు దోషాలు కూడా ఈ సమస్యలకు కారణం కావచ్చు. భార్యాభర్తల మధ్య ఉద్రిక్తతను పెంచే సాధారణ వాస్తు దోషాలు ఏంటో ఇక్కడ చూడండి.
భార్యాభర్తల మధ్య ఉద్రిక్తతను పెంచే సాధారణ వాస్తు దోషాలు ఇవే
ప్రధాన ద్వారం
ప్రధాన ద్వారం తప్పు దిశ లేదా దానిపై నలుపు పెయింట్ రిలేషన్స్ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రధాన ద్వారంపై శుభ చిహ్నాలను ఉపయోగించండి.

శివ-పార్వతులను పూజించడం
ప్రతిరోజూ శివ-పార్వతులను పూజించడం, మంత్రాలను పఠించడం కూడా సంబంధాలను మధురంగా మార్చడంలో సహాయపడుతుంది. ఈ చర్యలు వాస్తు దోషాలను తొలగించడమే కాకుండా ఇంట్లో సానుకూల శక్తిని, సామరస్యాన్ని పెంచుతాయి.
పడకగది దిశ
బెడ్ రూమ్ లో నైరుతి దిశలో లేకుంటే అది భార్యాభర్తల మధ్య సంబంధాలలో అస్థిరతను, ఉద్రిక్తతను సృష్టిస్తుంది. ఈ దిశ స్థిరత్వం,సామరస్యాన్ని సూచిస్తుంది.
అద్దం పెట్టే ప్లేస్
బెడ్ రూమ్ లో మంచం ముందు అద్దాన్ని ఉంచడం మానుకోండి. ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ పెరిగి గొడవలు, విబేధాలు ఏర్పడతాయి.
విరిగిన ఫర్నిచర్
విరిగిన లేదా దెబ్బతిన్న ఫర్నిచర్ ఇంట్లోకి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది, ఇది సంబంధాలకు ఆటంకం కలిగిస్తుంది. విరిగిన ఫర్నిచర్‌ను వెంటనే మార్చండి.
ఈశాన్య దిశలో మురికి
వాస్తులో ఇంటి ఈశాన్య దిశకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రాంతంలోని ధూళి లేదా మురికి ఉండకూడదు. ఇంటి ఈశాన్య దిశను ఎల్లప్పుడూ శుభ్రంగా, క్రమబద్ధంగా ఉంచండి.
గోడ రంగులు
ముదరు గోడ రంగులు ఉద్రిక్తత, విభేదాలను ప్రోత్సహిస్తాయి. బెడ్ రూమ్ లో పింక్, క్రీమ్ లేదా లేత ఆకుపచ్చ వంటి లేత, కూల్ రంగులను ఉపయోగించడం వల్ల సంబంధాలను మధురంగా మార్చడంలో సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications
