For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంపదను ఆకర్షించే వాస్తు చిట్కాలు

సంపదను ఆకర్షించే వాస్తు చిట్కాలు"ధనం మూలం ఇదం జగత్ " అనేది నేటి ప్రపంచానికి సరిగ్గా సరిపోలుతుంది. ధనం సమృద్ధిగా ఉంటె సహజంగానే అన్ని సౌకర్యాలు, పేరు ప్రతిష్ఠలు మన చెంతకు వస్తాయి.

|

"ధనం మూలం ఇదం జగత్ " అనేది నేటి ప్రపంచానికి సరిగ్గా సరిపోలుతుంది. ధనం సమృద్ధిగా ఉంటె సహజంగానే అన్ని సౌకర్యాలు, పేరు ప్రతిష్ఠలు మన చెంతకు వస్తాయి. మీరు కనుక నీటన గృహ నిర్మాణం చేపడుతున్నట్లయితే కొన్ని సూచనలు పాటించి ధన ప్రవాహాన్ని ఆకర్షించవచ్చు. అవేమిటో మీ కొస మేమందిస్తున్నాం. చదవండి!

మీరు ధనాన్ని భద్రపరిచే బీరువా లేదా లాకర్ను ఎప్పుడు ఇంటికి నైరుతి మూలన ఉండేట్టు చూసుకోండి. ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు. ఈయన సకల సంపత్ప్రదాత. దక్షిణ దిక్కుగా లేదా నైరుతి మూలన పెట్టిన బీరువా లేదా లాకర్ ఉత్తర దిక్కుగా తెరచుకుంటుంది, కనుక ఎప్పుడు అటువైపే పెట్టాలి.

Vastu Tips To Attract Wealth

ఈశాన్య మూల ఎప్పుడూ పరిశుభ్రంగా, మంచి అమరికతో, తీరుగా ఉండాలి. ఈ మూలలో పనికిరాని చెత్త సామాన్లను పెట్టకండి. ఈ మూల చిందరవందరగా ఉండకుండా జాగ్రత్తపడండి. ఈ దిక్కులో మెట్లను కూడా నిర్మించరాదు.

మీ ఇంటి చుట్టూ ప్రహరి గోడ ఉన్నట్లయితే, అది ఈశాన్యం మూలగా వంపు తిరిగి ఉండరాదు. ఈ మూలగా లంబ కోణంలో నిర్మాణం జరిగేటట్లు చూసుకోవాలి.

ఈ మూలలో ఎత్తైన భవనాలు ఉండరాదు. ఆ భవనాల నీడ ఇంటి ఈశాన్యం దిక్కుగా పడితే అది ఇంటికే అరిష్టంగా భావిస్తారు.

నైరుతిభాగంలో ఇంటి పైకప్పు ఉత్తరం లేదా ఈశాన్య దిక్కుతో పోల్చి చూస్తే ఎక్కువ వాలుతో ఉండాలి.అంతేకాక దక్షిణం మరియు పడమర వైపు ప్రహరీ గోడలు ఉత్తర మరియు తూర్పు గోడల కన్నా మందంగా ఉండాలి.

ధనం భద్రపరిచే అల్మరాకు ఎదురుగా అద్దాన్ని బిగిస్తే ఎక్కువ సంపదను ఆకర్షిస్తుంది. ఇది మీ సంపదను రెండింతలు చేస్తుందని అంటారు.

మీ ఇంటి ముందుండే రహదారి మీ ఇంటి ఉపరితలం కన్నా ఎత్తులో ఉండరాదు. ఇలా ఉంటె మీ ఇంట్లోకి ప్రవేశించే సంపదను ఇది అడ్డుకుంటుంది.

Vastu Tips To Attract Wealth

మీ ఇంటిలో ఊదా రంగు ఆకులు లేదా పూలు ఉండే మొక్కలను నాటండి. ఈ మొక్కలు శుభకరమైనవి మరియు మీ ఇంట్లోకి అనుకూల శక్తిని మరియు సంపదల ప్రవాహాన్ని సాధ్యం చేస్తాయి. ఒకవేలా ఇటువంటి మొక్కలు మీకు లభించకపోతే ఒక మనీ ప్లాంట్ ను ఊదా రంగు గోలెంలో నాటండి.

ఈశాన్య దిక్కులో ఎప్పుడూ మొక్కలను పెంచారాదు, మరీ ముఖ్యంగా పొడవైన మొక్కలు. వాటిని నైరుతి మూలలో పెంచడం శ్రేయస్కరం.

Vastu Tips To Attract Wealth

ఈశాన్య దిక్కులో ఫౌంటెన్ ఉండటం శుభకరం.

ఇంటి మధ్య భాగాన్ని దేవుడి స్థానం నిర్మించడానికి వినియోగించాలి. ఇది బ్రహ్మ స్థానం కనుక ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. ఇంటియోక్క కిటికీలు, ద్వారాలు మరియు తలుపులు కూడా పరిశుభ్రంగా ఉండాలి. లేనియెడలా ధనప్రవాహాన్ని అడ్డుకుంటాయి.

సంపదను ఆకర్షించాలంటే ఇంటి సింహద్వారాన్ని శుభ్రంగా అలంకరించాలి. ఇంటి ముందర నేమ్ ప్లేట్ మీద అక్షరాలు కనపడేట్టుగా చక్కగా ఉండాలి. నేమ్ ప్లేట్ మీద పేరు చుట్టూ కూడా అలంకరణ ఉంటె ఇంకా మంచిది.

కొళాయిలు ఎప్పుడూ నీరు చిమ్మకుండా, కారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.ఇలా జరిగితే కనుక ధనం కూడా అదే విధంగా జారిపోతుంది. కనుక కొళాయిలు పాడైతే త్వరితగతిన బాగుచేయించాలి.

ఇంటికి నైరుతి మూలగా గోడలు లేదా ఇతర నిర్మాణాలు ఉండకుండా చూసుకోండి. నైరుతి మూలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

బీరువాని ఎప్పుడు కాంతి రేఖకు కిందుగా పెట్టరాదు. ఇలా చేస్తే ఇంట్లోకి ప్రవహించే ధన ప్రవాహానికి అడ్డు తగులుతుంది.

Vastu Tips To Attract Wealth

ఇంట్లో ఎక్వేరియం పెట్టుకుంటే ఇంట్లోకి చేరే సంపద ప్రవాహం మెరుగవుతుంది.

పక్షులకు ఆహారం అందివ్వడం వలన కూడా ఇంట్లోకి సంపదను ఆకర్షిస్తుంది. పేదలకు సహాయం చేయడం వలన కూడా సంపద పెరుగుతుంది.ఇలా చేస్తే సంపద పెరగడం మాత్రమె కాకుండా మీరు జీవితంలో అన్ని రకాలుగా గెలుపును అందుకుంటారు.

English summary

Vastu Tips To Attract Wealth

Vastu Shastra, one of the ancient astrological sciences, says that Northeast direction is associated with Lord Kubera, the lord of wealth. One must keep the Northwest direction clutter free, organized and neat. Planting tall trees in this area is inauspicious. Keeping the almirah or the cash locker in the Southwest corner of the house attracts wealth.
Story first published:Friday, May 4, 2018, 12:28 [IST]
Desktop Bottom Promotion