Latest Updates
-
బ్లాక్ కాఫీలో నిమ్మకాయ వేసి తాగితే ఏమవుతుందో తెలుసా? -
హై ప్రొటీన్, ఫైబర్ నిండిన కినోవా జంతికలు..డయాబెటిస్, వెయిట్ లాస్ ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్ -
ఆదివారం రెగ్యులర్ చికెన్ కి బ్రేక్.. కేరళ మలబార్ చికెన్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ,దోసెతో అద్భుతం.. -
గ్రహాల రాశుల మార్పు: ఆగష్టు చివరి వారంలో వీరికి ఊహించని ధన లాభం -
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టే సంజీవని..100% కల్తీ లేని త్రిఫల చూర్ణం ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
మీ ఇంట్లో బొద్దింకలు పదే పదే కనిపిస్తున్నాయా? అయితే ఈ దోషం ఉన్నట్లే! -
జంక్ ఫుడ్ వద్దు.. సాయంత్రం వేళ పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే వేడివేడి సూప్ ఇదే! -
గ్రైండర్ అక్కర్లేదు..మిక్సీలో రుబ్బిన పిండితోనే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ మినప వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు వెనక నుంచి పిలిస్తే అపశకునమా? -
నీరసాన్ని తరిమికొట్టే పవర్ స్నాక్..పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే డ్రై ఫ్రూట్ చిక్కీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
విభిన్న రూపాల్లో హనుమాన్ ఫోటోలు.. మరి ఇంట్లో ఏది పెట్టాలి? ఏ ఫోటో పెట్టుకుంటే మంచిది?
హనుమంతుడిని ధైర్యానికి, శక్తికి ప్రతీకగా పరిగణిస్తారు. గొప్పు గురు భక్తికి ప్రతీకగా చూస్తారు. శ్రీరామ భక్తిలో పరవశించిపోయిన ఆంజనేయుడిని వాయుపుత్రుడిగా, మారుతీగా, భజరంగబలిగా, అంజనీపుత్రుడిగా పిలుస్తారు. హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి.. తన జీవితం మొత్తం శ్రీరామ సేవకే అంకితం ఇచ్చాడు. ఆయన చిరంజీవి.. ఇప్పటికీ బతికే ఉన్నాడని హిందువుల విశ్వాసం.

ఎవరైతే భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తారో వారి కోరికలన్నీ నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం. దాదాపు ప్రతి ఇంట్లో హనుమాన్ విగ్రహం లేదా ఫోటో కచ్చితంగా ఉంటుంది. ఇంట్లో ప్రతికూల శక్తులను తరిమికొట్టడానికి, దుష్ట శక్తులతో, రాక్షసులతో పోరాడి కాపాడతాడని నమ్ముతారు.
ఆంజనేయుని వివిధ రూపాలు మనకు కనిపిస్తాయి. ఒక్కో ఫోటోలో ఒక్కో రకంగా కనిపిస్తాడు భక్త హనుమాన్. మరి ఇంట్లో ఎలాంటి ఫోటోలు పెట్టుకోవాలి.. ఎలాంటి ఫోటోలు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి.. ఏ దిశలో ఆంజనేయుని ఫోటో పెట్టుకోవాలి లాంటి తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పంచముఖ హనుమాన్
పంచముఖ హనుమాన్ ఇంట్లో పెట్టుకుంటే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. పంచముఖ హనుమాన్ ఫోటో వల్ల సంపద సృష్టించబడుతుంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. పనిలో ఆటంకాలు ఎదురుకావు. శత్రువుల బాధ తొలగిపోతుంది. పంచముఖ హనుమాన్ ఫోటోను అందరికీ కనిపించేలా ప్రధాన ద్వారాని ఎదురుగా ఉంచడం మంచిది.
పర్వతాన్ని మోసుకెళ్తున్నట్లు
సంజీవన పర్వతాన్ని మోసుకెళ్తున్నట్లు కనిపించే హనుమాన్ ఫోటోను ఇంట్లో ఉంచడం వల్ల ధైర్యం, బలం, విశ్వాసం పెరుగుతుంది. ఈ రూపంలోని ఆంజనేయుని ఫోటో పెట్టుకోవడం వల్ల సమస్యలు వచ్చినా ధీటుగా ఎదుర్కొనే శక్తియుక్తులు లభిస్తాయి.
తెల్లని రంగులో కూర్చుని ఉన్నట్లు
తెల్లని శరీరంతో ధాన్యం చేస్తున్నట్లు కూర్చొని ఉండే హనుమాన్ ఫోటోను ఇంట్లో పెట్టడం చాలా మంచిది. మంచి ఉద్యోగం రావడానికి, ఉద్యోగంలో పదోన్నతి పొందడానికి, ఉద్యోగంలో పని ఒత్తిడిని తట్టుకునే శక్తిని ఈ రూపం ఇస్తుందని నమ్మకం.
ధ్యానం చేస్తున్నట్లుగా
కళ్లు మూసుకుని ధ్యానం చేస్తున్న రూపంలోని హనుమంతుని ఫోటో ఇంట్లో ఉంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి, ఆందోళన లాంటివి తగ్గుతాయి. మానసికంగా దృఢంగా ఉండేలా ఈ రూపం ఫలితాన్నిస్తుంది.
శ్రీరామ భజన చేస్తున్నట్లు
శ్రీరామ భజన చేస్తూ భక్తితో పరవశించిపోయే హనుమాన్ ఫోటోను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆధ్యాత్మిక ఆనందం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఇష్టం పెరుగుతుంది.
శ్రీరాముడిని కౌగిలించుకున్నట్లుగా
ఆంజనేయుడు, శ్రీరాముడు కౌగిలించుకుని ఉన్నట్లుగా ఉండే రూపంలో ఉన్న హనుమాన్ ఫోటోను ఇంట్లో ఉంచుకోవడం వల్ల కుటుంబంలో ఐక్యత, స్నేహపూర్వక స్వభావం పెరుగుతుంది. దంపతుల మధ్య సాన్నిహిత్యం మెరుగుపడుతుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications