For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Vat Savitri Vrat 2021: ఈ మంత్రం జపిస్తే.. సావిత్రి తల్లి ఆశీస్సులు లభిస్తాయి...!

సావిత్రి వ్రతం, పూజా విధి, ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం జ్యేష్ట మాసంలో అమావాస్య రోజున సావిత్రి వ్రతం జరుపుకుంటారు. ఈ వ్రతం వివాహిత మహిళలకు చాలా ప్రత్యేకమైనది. ఈ పండుగను ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. వట సావిత్రి పండుగ సందర్భంగా మహిళలంతా మర్రి చెట్టును పూజిస్తారు.

Vat Savitri Vrat 2021 date, tithi, Puja vidhi, Samagri list and significance in Telugu
పదహారు అలంకారాలతో బన్యన్ ను ఆరాధిస్తారు. తమ భర్తలు సుదీర్ఘ కాలం ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 10వ తేదీన అంటే గురువారం రోజున సావిత్రి వ్రతం జరుపుకోనున్నారు. ఇదే రోజున తొలి సూర్య గ్రహణం కూడా ఏర్పడబోతోంది. ఈ సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించనప్పటికీ, దీని ప్రభావం పాక్షికంగా ఉంటుంది. దీని కారణంగా సూతక్ కాలం ఇక్కడ చెల్లుబాటు కాదు. ఈ సందర్భంగా సావిత్రి వత్రం యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
సావిత్రి వ్రతం సమయం..

సావిత్రి వ్రతం సమయం..

హిందూ పురాణాల ప్రకారం, సావిత్రి యముడితో పోరాడి తన భర్త ప్రాణాలు కాపాడుకుందని చాలా మంది నమ్ముతారు. అందుకే వివాహిత మహిళలు తమ భర్తల సుదీర్ఘైన మరియు సంతోషకరమైన జీవితం కోసం ఈ వ్రతాన్ని పాటిస్తారు. ఈ పవిత్రమైన రోజు ఉపవాసం ఉంటారు. అలాంటి సావిత్రి వ్రతం ఈ నెల జూన్ 9వ తేదీన మధ్యాహ్నం 1:57 గంటలకు ప్రారంభమై.. జూన్ 10వ తేదీ సాయంత్రం 4:22 గంటలకు ముగుస్తుంది.

పూజా సామాగ్రి..

పూజా సామాగ్రి..

సావిత్రి వ్రతం చేసే వారు మర్రిచెట్టును పూజించాలి. పత్తితో చేసిన వత్తులు, దూపం-దీపం, నెయ్యి, పువ్వులు, పండ్లు, కుంకుమ లేదా రోలీ, తేనే పదార్థాలు, పండ్లను కలశం నిండా నీటిని తీసుకోవాలి.

పూజా పద్ధతి..

పూజా పద్ధతి..

సావిత్రి వత్రం పండుగ రోజున వివాహిత మహిళలు ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేయాలి. అనంతరం ఉపవాసం ఉంటామని ప్రతిజ్ణ చేయాలి. ఈరోజున నుదటన పసుపు, సింధూరం దిద్దుకోవాలి. మర్రిచెట్టు వద్ద సావిత్రి, సత్యవన్, యమదేవుని విగ్రహాలను ఉంచాలి. మర్రి చెట్టుకు నీళ్లు పోసి, దానికి పువ్వులు, అక్షింతలు, స్వీట్లు అర్పించాలి. ఆ చెట్టుకు రక్షిత దారాన్ని కట్టి ఆశీస్సులు కోరుకోవాలి. అనంతరం మర్రి చెట్టు చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణలు చేయాలి. అనంతరం సావిత్రి వ్రతం యొక్క కథను వినాలి. మరుసటి రోజు ఉపవాసాన్ని వీడాలి.

మర్రి చెట్టులో..

మర్రి చెట్టులో..

హిందూ పురాణాల ప్రకారం, మర్రిచెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందువులందరూ ఈ చెట్టును ఎంతో పవిత్రంగా భావిస్తారు. బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు ఈ చెట్టులో నివసిస్తారు. అందుకే ఈ సమయంలో మర్రిచెట్టును పూజించడం వల్ల అనేక మంచి ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు.

సావిత్రి మంత్రం..

సావిత్రి మంత్రం..

సావిత్రి వ్రతం రోజున ఈ మంత్రాలను జపిస్తే చాలా మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు.

‘శ్రీం హ్రీం క్లీం సావిత్ర్యై స్వాహా'

ఈ మంత్రం జపించే సమయంలో స్పటిక మాలను మాత్రమే ఉపయోగించాలి. ఈ మంత్రాలను ఎవరైతే జపిస్తారో.. ముఖ్యంగా మహిళలకు సౌభాగ్యం నిలుస్తుందని పండితులు చెబుతున్నారు. సంతాన భాగ్యం కూడా కలుగుతుందట. అదే విధంగా భాద్రపద మాసంలో త్రయోదశి నాడు కూడా ఈ మంత్రాన్ని జపిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయట.

English summary

Vat Savitri Vrat 2021 date, tithi, Puja vidhi, Samagri list and significance in telugu

The Vat Savitri Vrat in India is observed by married women for well-being and long life of their husbands.
Desktop Bottom Promotion