Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
విభువన సంకష్టహర చతుర్థి.. ఈరోజు గణేషుడికి ఇలా పూజ చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి
ప్రతి నెల సంకష్టహర చతుర్థి వస్తుంది. అలాగే ప్రతి నెల రెండు చవితి తిథులు వస్తాయి. ఒకటి కృష్ణ పక్షంలో.. మరొకటి శుక్ల పక్షంలో వస్తుంది. అయితే విభువన సంకష్టహర చతుర్థి మాత్రం చాలా ప్రత్యేకం. ఈ విభువన సంకష్టహర చతుర్థి 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. అధిక శ్రావణంలో మాత్రమే విభువన సంకష్టహర చతుర్థి వస్తుంది. అధిక మాసాలు మూడేళ్లకోసారి వస్తాయని తెలిసిందే.

విభువన సంకష్టహర చతుర్థి గణేషుడికి అత్యంత ప్రాముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు. ఈ రోజు విఘ్నేశ్వరుడికి చేసే పూజ, సమర్పించి పూలు పండ్లు అన్నీ ఎంతో పుణ్యాన్ని ఇస్తాయని భక్తుల విశ్వాసం. ఈ రోజు చేసే ప్రత్యేక పూజలు, దోష పరిహారాల వల్ల జీవితంలో సమస్యలు తొలగిపోయి.. ఆనందంగా, హాయిగా సాగుతుందని అంటారు. ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి, కుటుంబసభ్యుల మధ్య కలహాలు రాకుండా ఉండటానికి, తలపెట్టిన పనిలో విజయం అందుకోవడానికి విభువన సంకష్టహర చతుర్థి రోజు గణనాథుడిని పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
విభువన సంకష్టహర చతుర్థి రోజు.. ఉపవాసం ఉండి రోజంతా దైవ నామస్మరణ పాటించాలి. ఉదయం, సాయంత్రం వేళ ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో పాల్గొని.. రాత్రి చంద్రునికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత ఉపవాసాన్ని విరమించాలి. ఇలా చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. సమస్యలు తొలగిపోతాయి, కష్టాలు సమసిపోతాయి, దోషాలు పరిహరించబడతాయి. అయితే విభువన సంకష్టహర చతుర్థి రోజు వ్రతాన్ని ఎలా పాటించాలో ఇప్పుడు చూద్దాం.
విభువన సంకష్టహర చతుర్థి పూజా
అధిక శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి ఆగస్టు 4వ తేదీన శుక్రవారం వస్తోంది. పగలు 12.45 గంటల నుంచి విభువన సంకష్టహర చతుర్థి ప్రారంభం అవుతుంది. ఇది ఆగస్టు 5 వ తేదీ శనివారం ఉదయం 9.39 గంటలకు ముగుస్తుంది. ఈ విభువన సంకష్టహర చతుర్థి రోజు గణపతితో పాటు చంద్రుడిని పూజిస్తే మంచి ఫలితాలు అందుకుంటారు. ఆగస్టు 4వ తేదీన చంద్రోదయం అవుతుంది కాబట్టి.. విభువన సంకష్టహర చతుర్థి ఉపవాసాన్ని ఆగస్టు 4వ తేదీ శుక్రవారమే ఉండాలి.
విభువన సంకష్టహర చతుర్థి రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి. ఈ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. పూజ చేసే సమయంలో తూర్పు లేదా ఉత్తర ముఖంగా కూర్చోవాలి. విఘ్నేశ్వరుడిని పరిశుభ్రమైన పీఠం లేదా వస్త్రంపై ప్రతిష్టించాలి. ధూపాదీపాలను వెలిగించాలి.
'ఓం గణేశాయ నమః'
'ఓం గం గణపతయే నమః' మంత్రాలను జపించాలి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications