For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విశ్వకర్మ ఎవరు? విశ్వకర్మ జయంతి ఎప్పుడు జరుపుకుంటారు?

|

హిందూ పురాణాల ప్రకరాం రుగ్వేదంలో, క్రిష్ణ యజుర్వేదంలో సృష్టికర్తగా విశ్వకర్మను పరిగణిస్తారు. ఆధర్వణ వేదంలో ఆహార ప్రదాతగా పేర్కొనబడ్డాడు.

పురుష సూక్తంలో విరాట పురుషుడిగా కీర్తి గడించాడు. సహస్ర బాహుగా, సహస్ర చక్షుగా, సహస్ర పాదుడుగా, సహస్ర ముఖుడిగా అన్ని వేదాల్లోనూ ప్రస్తావించబడిన వ్యక్తే విశ్వకర్మ.

అన్ని వేదాల ప్రకారం ఈ సృష్టి కర్త విశ్వకర్మనే. ఇంతకీ ఈ విశ్వకర్మ ఎవరు? ఈయన జయంతిని ఎందుకని పండుగలా జరుపుకుంటారు? అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

విశ్వకర్మ ఎవరంటే?

విశ్వకర్మ ఎవరంటే?

త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుని కుమారుడు విశ్వకర్మ. ఈయన వాహనాలు మరియు ఆయుధాలతో పాటు హిందూ దేవతలు, దేవతల రాజభనాల సృష్టికర్త అని చాలా మంది నమ్ముతారు. అంతే ఈయన పవిత్రమైన ద్వారకా నగరాన్ని సృష్టించాడని, ఇది శ్రీ క్రిష్ణుడు పాలించే రాజ్యంగా ఏర్పాటు చేసినట్లు పెద్దలు చెబుతుంటారు.

విశ్వకర్మ, విశ్వకర్మ పూజ 2021

విశ్వకర్మ, విశ్వకర్మ పూజ 2021

ప్రతి సంవత్సరం సూర్య భగవానుడు తన సొంత రాశి అయిన సింహ రాశిని వదిలి కన్య రాశిలోకి ప్రవేశించే సమయంలో విశ్వకర్మ జయంతి పండుగను జరుపుకుంటారు. అందుకే ఈరోజు సంక్రాంతి అని కూడా అంటారు. ఈ ఏడాది 2021లో సెప్టెంబర్ 17వ తేదీన అంటే శుక్రవారం నాడు ప్రారంభమవుతుంది. విశ్వకర్మ పూజ సంక్రాంతి క్షణం అంటే ఉదయం 01:29 గంటలకు ప్రారంభమై ఉదయం 6:17 గంటలకు ముగుస్తుంది.

విశ్వకర్మ పూజ చరిత్ర..

విశ్వకర్మ పూజ చరిత్ర..

విశ్వకర్మ పూజ అనేది హిందూ సమాజంలోని ప్రజలకు చాలా ముఖ్యమైనది. భగవంతుడు విశ్వకర్మ రచనలు రుగ్వేదం, స్థాపత్య వేదాలలో ప్రస్తావించబడ్డాయి. వాస్తు శాస్త్రం మరియు యాంత్రిక శాస్త్రం గురించి ఇందులో అనేక విషయాలున్నాయి. ఎవరైతే పని చేస్తుంటారో.. అలాంటి వారికి ఈరోజు చాలా ముఖ్యమైనది. ఈరోజు ఈ రంగంలోని ప్రజలు విశ్వకర్మ పూజ విజయవంతం కావాలని.. ఆ దేవుని ఆశీస్సులు తమకు లభించాలని.. తమ కుటుంబం ఆయురారోగ్యాలతో అనునిత్యం ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. పని చేసే వారితో పాటు హస్తకళాకారులు విశ్వకర్మ పూజలో భాగంగా తమ పనిముట్లను ఆరాధిస్తారు. ఈ పవిత్రమైన రోజున వాటిని ఏ పనికి ఉపయోగించరు. తాము క్షేమంగా ఉండాలని.. తమకు నిత్యం జీవనోపాధిని కల్పించి సురక్షింతగా ఉంచాలని.. తాము చేపట్టే ప్రతి ప్రయత్నంలో విజయం సాధించాలని వారు విశ్వకర్మ దేవుడిని ప్రార్థిస్తారు. విశ్వకర్మను దైవ వడ్రంగి మరియు స్వయంభు అని పిలిచేవారు. ఈ పండుగను ఎక్కువగా అస్సాం, ఉత్తరప్రదేశ్, కర్నాటక, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా మరియు త్రిపుర వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా జరుపుకుంటారు. ఈ పండుగను నేపాల్ లోనూ అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు.

విశ్వకర్మ పూజ ఆచారాలు..

విశ్వకర్మ పూజ ఆచారాలు..

విశ్వకర్మ జయంతి రోజున చాలా మంది హిందూ భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ పూజలను సాధారణంగా కర్మాగారాలు, కార్యాలయాలు మరియు దుకాణాలలో నిర్వహిస్తారు. ఈ ప్రదేశాలు కూడా పండుగ రూపాన్ని అందించడానికి అందమైన పూలతో అలంకరించబడతాయి. ఈ పవిత్రమైన రోజున భక్తులు మరియు వారి కుటుంబాలు విశ్వకర్మ దేవుడిని మరియు అతని వాహనం ఏనుగును పూజిస్తారు. విశ్వకర్మ విగ్రహాన్ని కూడా అందంగా అలంకరించి పూజలు నిర్వహిస్తారు. పూజల అనంతరం ప్రసాదం కూడా పంపిణీ చేస్తారు. ఈ పవిత్రమైన రోజున పూజ తర్వాత కార్యాలయాలను మూసివేస్తారు. అనంతరం అన్నదానం కూడా చేపడతారు. ఈ సమయంలో గాలిపటాలు కూడా ఎగురవేస్తారు. మరికొన్ని చోట్ల గాలిపటాల పోటీలు కూడా నిర్వహిస్తారు.

విశ్వకర్మే ఎందుకంటే..

విశ్వకర్మే ఎందుకంటే..

సాధారణంగా సృష్టికర్త ఎవరంటే మనలో చాలా మంది నాలుగు ముఖాలు ఉండే బ్రహ్మ మహర్షి అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని పురాణాల ప్రకారం చతుర్మఖ బ్రహ్మను సృష్టికర్తగా వేద విరుద్ధంగా పేర్కొన్నాయి. అంతేకాదు విశ్వకర్మను బ్రహ్మ దేవుని కుమారునిగా చెబుతాయి. ఇది ఎంతవరకు వాస్తవం అనేదానికి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే వేదాలు విశ్వకర్మను సర్వపాప సంహర్తగా పేర్కొన్నాయి. అన్ని దిక్కులను చూసే శక్తిని కలిగినవాడు అని రుగ్వేదం విశ్వకర్మను భగవంతండిగా పరిగణించింది. సృష్టి తొలి రోజుల నుండి సుప్రసిద్ధులైన శిల్పకారులు ఐదు మంది ఉన్నారు. వారు విశ్వకర్మకు జన్మించారు.

English summary

Vishwakarma Puja 2021 Date, History and Importance in Telugu

Here we are talking about the vishwakarma puja 2021 date, history and importance. Read on