For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Vivah Panchami 2021:వివాహ పంచమి ఎప్పుడు? దీని ప్రాముఖ్యత.. పూజా విధానం గురించి తెలుసుకోండి...

2021లో వివాహ పంచమి తేదీ, శుభ ముహుర్తం, దాని ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ సంప్రదాయం ప్రకారం, ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్ల పక్షంలోని ఐదో రోజున వివాహ పంచమిగా జరుపుకుంటారు. 2021 సంవత్సరంలో డిసెంబర్ 8వ తేదీన బుధవారం నాడు వివాహ పంచమి వచ్చింది.

Vivah Panchami 2021 Date, Shubh Muhurt, Importance and Significance in Telugu

పురాణాల ప్రకారం, ఈ పవిత్రమైన రోజున శ్రీరాముడు మరియు సీతాదేవి వివాహం జరిగిన రోజుగా పరిగణిస్తారు. అందుకే ఈ రోజున సీతారాముల దేవాలయాల్లో గొప్ప వేడుకలు, పూజలు, యాగాలు వంటివి నిర్వహిస్తారు.

Vivah Panchami 2021 Date, Shubh Muhurt, Importance and Significance in Telugu

వివాహ పంచమి రోజును సీతారాముల వివాహ వార్షికోత్సవంగా జరుపుకుంటారు. అలాగే శ్రీరామ చరిత మానస్ పారాయణం కూడా చేస్తారు. మిథిలాంచల్ మరియు నేపాల్ లో, ఈ పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు.

Vivah Panchami 2021 Date, Shubh Muhurt, Importance and Significance in Telugu

ఎందుకంటే సీతా దేవి మిథిలా నగరం నుండి వచ్చిందని నమ్ముతారు. ఈ సందర్భంగా వివాహ పంచమి పండుగ ప్రాముఖ్యత మరియు శుభ ముహుర్తం మరియు పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

2021లో డిసెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాలివే...2021లో డిసెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాలివే...

శుభ సమయం..

శుభ సమయం..

వివాహ పంచమి 2021 సంవత్సరంలో 7వ తేదీ అంటే మంగళవారం రాత్రి 11 గంటల 40 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఇది 8వ తేదీ అంటే బుధవారం రాత్రి 9 గంటల 25 నిమిషాలకు పూర్తవుతుంది. ఈ సమయం మొత్తాన్ని వివాహ పంచమి యొక్క శుభ సమయంగా పరిగణిస్తారు.

వివాహ పంచమి ప్రాముఖ్యత..

వివాహ పంచమి ప్రాముఖ్యత..

వివాహ పంచమి రోజున శ్రీరాముడు, సీతాదేవి వివాహం జరిగినందున, ఎవరి వైవాహిక జీవితంలో అయినా ఏవైనా అడ్డంకులు ఎదురైనా.. వారు ఈరోజున సీతారాములను పూజిస్తే, చాలా శుభప్రదంగా పరగిణించబడుతుంది. అంతేకాదు వివాహిత జంటలు ఈరోజున ఉపవాసం ఆచరించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇబ్బందులన్నీ తొలగిపోయి.. మీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని పండితులు చెబుతారు. అంతేకాదు కొత్తగా పెళ్లయిన దంపతులు ఈ పవిత్రమైన రోజున వ్రతాన్ని పూర్తి భక్తి శ్రద్ధలతో పాటిస్తే వారి వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలన్నీ క్రమంగా తొలగిపోతాయి. వివాహ పంచమి రోజున ఇంట్లోనే రామచరిత మానస్ పారాయాణం చేస్తే, మీ ఇంట్లో ఆనందం మరియు శాంతి ఉంటుంది.

పూజా విధానం..

పూజా విధానం..

వివాహ పంచమి రోజున తెల్లవారుజామున నిద్ర లేవాలి. సూర్యోదయం కంటే స్నానం చేయాలి. సీతారాములను స్మరించుకుంటూ మీ మనసులో ఉపవాస ప్రతిజ్ణ చేయాలి. ఆ తర్వాత ఒక పాత్రలో గంగాజలం తీసుకుని ఎరుపు లేదా పసుపు బట్టలపై చిలకరించాలి. ఆ బట్టలపై సీతారాముల విగ్రహాలను ప్రతిష్టించాలి. శ్రీరామునికి పసుపువస్త్రాలు, సీతాదేవికి రెడ్ కలర్ డ్రస్ ఇప్పించాలి. ఆ తర్వాత రోలీ, అక్షింతలు, పూలు, ధూపం, దీపాలను సిద్ధంగా ఉంచుకోవాలి. అనంతరం పూజను మొదలెట్టాలి. పూజ ముగిసిన తర్వాత ప్రసాదం అందించండి. అంతకంటే వివాహ పంచమి కథను చదవండి. అనంతరం ‘ఓం జానకీ వల్లభాయై నమః' అనే మంత్రాన్ని ఒకటి, ఐదు, ఏడు లేదా పదకొండు సార్లు పఠించండి. అనంతరం ప్రతి ఒక్కరికీ ప్రసాదాన్ని పంపిణీ చేయండి.

FAQ's
  • 2021లో వివాహ పంచమి ఎప్పుడొచ్చింది?

    హిందూ సంప్రదాయం ప్రకారం, ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్ల పక్షంలోని ఐదో రోజున వివాహ పంచమిగా జరుపుకుంటారు. 2021 సంవత్సరంలో డిసెంబర్ 8వ తేదీన బుధవారం నాడు వివాహ పంచమి వచ్చింది.

  • వివాహ పంచమి రోజున ఎవరి వివాహం జరిగింది?

    పురాణాల ప్రకారం, ఈ పవిత్రమైన రోజున శ్రీరాముడు మరియు సీతాదేవి వివాహం జరిగిన రోజుగా పరిగణిస్తారు. అందుకే ఈ రోజున సీతారాముల దేవాలయాల్లో గొప్ప వేడుకలు, పూజలు, యాగాలు వంటివి నిర్వహిస్తారు. వివాహ పంచమి రోజును సీతారాముల వివాహ వార్షికోత్సవంగా జరుపుకుంటారు.

English summary

Vivah Panchami 2021 Date, Shubh Muhurt, Importance and Significance in Telugu

Here we are talking about the vivah panchami 2021 date, shubh muhurat, importance and significance in Telugu. Have a look
Story first published:Monday, December 6, 2021, 15:33 [IST]
Desktop Bottom Promotion