For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏకలవ్యుడిని కృష్ణుడు వధించడంలో రహస్యం ఏంటి..?

By Super
|

మహాభారత ప్రధాన కథాంశంతో అనుబంధించబడి ఎన్నో నిగూఢమైన కథలతో నిండి ఉన్నది. వీటిలోని పాత్రలన్నీ నలుపు లేదా తెలుపు రంగులో ఉన్నాయని చెప్పటానికి సాధ్యం కాదు. పరమాత్ముడు అయిన కృష్ణుడితో సహా ప్రతి పాత్రలో మంచి, చెడుతో నిండి ఉన్నాయి. ప్రతి పాత్రలో మంచి మరియు చెడు, ధర్మం మరియు అధర్మం మరియు నైతికత మరియు అనైతిక విలువలను సమకూర్చారు.

READ MORE: భారత దేశంలో ప్రసిద్ది చెందిన 7 శ్రీకృష్ణ దేవాలయాలు...

అటువంటి పాత్రే ఏకలవ్యుడిది. ఈ పాత్ర గురించి చెప్పిన అనేక కథలు ఉన్నాయి. తన విల్లును ఎక్కుపెట్టే బొటనవేలును కత్తిరించి, 'గురు దక్షిణ' గా గురువు ద్రోణాచార్యుడికి సమర్పించటంతో ముగుస్తుంది ఇతని కథ. ఇది అందరికి తెలిసిన సాధారణ కథ. కానీ మీరు ఏకలవ్య మరణం కృష్ణుని చేతిలో సంభవించింది అన్న వాస్తవంతో పాటు ఇంకా అనేక విషయాలు తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి.

READ MORE: మహాభారత రహస్యం: కృష్ణుడు కర్ణుడుని ఎందుకు చంపాడు?

ఎందుకు కృష్ణుడు ఏకలవ్య వంటి నీతిమంతుని చంపవలసి వచ్చింది? ఈ ప్రశ్నకు మరింత వివరంగా సమాధానం తెలుసుకోవడానికి క్రింద ఇచ్చిన విషయాలను చదవండి:

ఏకలవ్య మరియు కృష్ణుడి మధ్య సంబంధం

ఏకలవ్య మరియు కృష్ణుడి మధ్య సంబంధం

ఏకలవ్యుడు, కృష్ణుడియొక్క బాబాయి కొడుకు, తమ్ముడు. ఏకలవ్యుడి తండ్రి, దేవశ్రవ, వసుదేవుడి యొక్క తమ్ముడు, ఈయన అడవుల్లో ఓటమి చవిచూసాడు. అతను వేటగాళ్ళ రాజు, నిషద వ్యత్రజ హిరణ్యధనుస్ చే దత్తత చేసుకోబడ్డాడు.

గురు దక్షిణ వెనుక కృష్ణుడి పాత్ర

గురు దక్షిణ వెనుక కృష్ణుడి పాత్ర

కృష్ణుడే స్వయంగా ద్రోణాచార్యుని మనస్సులో గురు దక్షిణగా విల్లు-విరిచే బొటనవేలు కోరే ఆలోచనను నాటాడని చెబుతారు. దీనివలన ఏకలవ్యుడు అర్జున కంటే గొప్ప మారకుండ ఉండటానికి అలా చేశాడని నిరూపితమయింది.

ఏకలవ్యుడు మరియు జరాసంధుడు

ఏకలవ్యుడు మరియు జరాసంధుడు

ఏకలవ్యుడు, తన వంశం, నిషద వ్యత్రజ హిరణ్యధనుసుడి కాలం నుండి, జరాసంధుడికి గొప్ప మద్దతుదారులుగా ఉన్నారు. జరాసంధుడు, ఏకలవ్యుడు ఇద్దరు కూడా వరుసకు అన్నదమ్ములు, దాయాదులు అయినప్పటికీ, కృష్ణుడు విలువిద్యలో జరాసంధుడికి శత్రువు, అందువలన జరాసంధుడు,కృష్ణుడి తమ్ముడు అయిన ఏకలవ్యుడిని కూడా శత్రువుగానే భావించాడు.

ఏకలవ్యుడు కృష్ణుడు హతం చేశాడు

ఏకలవ్యుడు కృష్ణుడు హతం చేశాడు

కృష్ణుడు మరియు రుక్మిణిని తీసుకుని పారిపోతున్నప్పుడు, ఏకలవ్యుడు శిశుపాలుడితో మరియు జరాసందుడితో కలిసి పోరాడాడు. ఆగ్రహంతో, కృష్ణుడు ఒక రాయిని తీసుకున్నాడు మరియు ఏకలవ్యుడిని చంపటానికి అతనివైపు విసిరాడు.

ఏకలవ్యుడి మరణం వెనుక కారణము

ఏకలవ్యుడి మరణం వెనుక కారణము

ద్రోణ పర్వంలో, కృష్ణుడు కౌరవుల పక్షాన నిలిచిన మరియు ధర్మ స్థాపనకు ఆటంకంగా మారిన జరాసంధుడు, శిశుపాలుడిని మరియు ఏకలవ్య వంటి గొప్ప వ్యక్తుల మరణానికి నాంది పలుకుతాడని చెపుతారు.

గొప్ప విలుకాడు, ఏకలవ్యుడు

గొప్ప విలుకాడు, ఏకలవ్యుడు

కొన్ని పురాణాలలో ఏకలవ్యుడు తన బొటనవేలును కోల్పోయినప్పటికీ, అతను ఒక గొప్ప విలుకాడు అని చెపుతారు. అతను రెండుచేతులతోనూ విలువిద్యను నేర్చుకున్నాడు.

ఏకలవ్యుడే దృష్టద్యుమ్నుడు

ఏకలవ్యుడే దృష్టద్యుమ్నుడు

కృష్ణుడు ఏకలవ్యుడి మరణసమయంలో, అతను ద్రోణాచార్యుడిని చంపడానికి మరుజన్మ ప్రసాదించే వరం ఇచ్చాడు అని నమ్ముతారు. అందువలన ఏకలవ్యుడే దృష్టద్యుమ్నుడుగా జన్మించాడని మరియు చివరకు ద్రోణాచార్యుడిని ఏకలవ్యుడే వధించాడని చెబుతారు.

English summary

Was Ekalavya Killed By Krishna?: Spirituality Article in Telugu

Article in Telugu, The Mahabharata is full of obscure stories intertwined with the main storyline. The characters cannot be coloured black or white. Each character, including Lord Krishna, can only be dyed in shades of grey.
Story first published: Saturday, August 8, 2015, 15:07 [IST]
Desktop Bottom Promotion