For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రీరాముడు మనిషా? దేవుడా? రాముడు ఎప్పుడు పుట్టాడు? రాముడు ఇంతకు భూమి మీద పాలన సాగించాడా?

శ్రీరాముడు మనలాంటి మనిషేనా లేదంటే దేవుడా? దైవం మానవరూపంలో అవతరించాడా? మనిషే దేవుడిగా ఎదిగిపోయాడా? రామాయణానికి రుజువులేమిటి? అనే ప్రశ్నలు తరుచూ చాలా మందికి తలెత్తుతుంటాయి.

|

శ్రీరాముడు మనలాంటి మనిషేనా లేదంటే దేవుడా? దైవం మానవరూపంలో అవతరించాడా? మనిషే దేవుడిగా ఎదిగిపోయాడా? రామాయణానికి రుజువులేమిటి? అనే ప్రశ్నలు తరుచూ చాలా మందికి తలెత్తుతుంటాయి. శ్రీరాముడు... సుగుణాభి రాముడు.. మర్యాదా పురుషోత్తముడు.. జగదభిరాముడు.. ఎన్ని పేర్లు.. ఎన్ని స్తోత్రాలు.. ఆయన పేరే ఒక తారకమంత్రం.

ఆ పేరును ఒక్కసారి జపిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని చెప్తారు పెద్దలు. నిజంగా రాముడు అంత గొప్పవాడు ఎలా అయ్యాడు.. వాలిని చెట్టు చాటు నుంచి చంపినవాడు.. ఒక వ్యక్తి మాటలు విని భార్యను అడవుల పాలు చేసిన ఆయన ఆదర్శపురుషుడు ఎలా అయ్యాడు?

వాదాలు, వివాదాలు

వాదాలు, వివాదాలు

రామాయణం నిండా రకరరకాల కథలుకనిపిస్తాయి.. వాదాలు, వివాదాలూ ఉన్నాయి. అయినా రామరాజ్యం రావాలని, రాముడి లాంటి పాలకులు, లీడర్లు రావాలని మనం ఎందుకు కోరుకుంటాం. ఎందుకంటే శ్రీరాముడు ఆదర్శ పురుషుడు కాబట్టి. భారత దేశంలో ఆదర్శపురుషుడు ఎవరంటే ముందుగా వచ్చే పేరు శ్రీరాముడు.. ఆదర్శ దంపతులు ఎవరంటే సీతారాములు.. ఆదర్శపాలకుడు ఎవరంటే శ్రీరాముడు.

ఆదర్శ రాజ్యం రామరాజ్యం

ఆదర్శ రాజ్యం రామరాజ్యం

ఆదర్శ రాజ్యం ఏదంటే రామరాజ్యం.. ఇవాళ మన పాలకులంతా మైకుల ముందు ఊదరగొట్టే ఉపన్యాసాల్లో తరచూ చెప్పే మాట.. మళ్లీ రామరాజ్యం తెస్తామని? రాముడు.. సీతారాములు.. లక్షల సంవత్సరాల నాటి చరిత్ర... అఖండ భారత దేశమంతటితో అనుబంధం పెనవేసుకున్న చరిత్ర.. దేవుడు మనిషిగా అవతరించిన చరిత్ర.. మనిషి దేవుడిగా ఎదిగిపోయిన చరిత్ర.

విష్ణుమూర్తి ఏడో అవతారం శ్రీరాముడు

విష్ణుమూర్తి ఏడో అవతారం శ్రీరాముడు

ఇంతకీ ఈ రాముడు ఎవరు? మనందరికీ తెలిసినంతవరకు విష్ణుమూర్తి దశావతారాల్లో ఏడవ అవతారం శ్రీరాముడు. రావణుడిని హతమార్చేందుకు ఈ భూమిపై అవతరించిన శ్రీమన్నారాయణుడు. అయితే సాక్షాత్తూ నారాయణుడే రాముడిగా అవతరించి ఉంటే.. నేరుగా వెళ్లి రావణుణ్ణి హతమార్చి ఉండవచ్చు కదా అని కొందరు అనుకుంటారు.

పదకొండు వేల సంవత్సరాలు ఎలా

పదకొండు వేల సంవత్సరాలు ఎలా

అంతకు ముందు వచ్చిన అన్ని అవతారాల్లోనూ ఆయన చేసింది అదే.. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన అవతారాలన్నీ కొద్ది నిమిషాల్లో ముగిసినవే..మరి రామావతారం మాత్రం వాల్మీకి రామాయణం ప్రకారం పదకొండు వేల సంవత్సరాలు ఎలా కొనసాగింది.. ? పురాణాల ప్రకారమే అయితే, విష్ణుమూర్తి అవతారాల్లో పూర్ణమానవుడిగా అవతరించిన సందర్భం రాముడే.. మనిషి జీవితంలో ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో రాముడు చేసి చూపించాడు.

రామాయణం ఎప్పుడు జరిగింది

రామాయణం ఎప్పుడు జరిగింది

రాముడు దేవుడా? రామాయణం ఎప్పుడు జరిగింది.. ఇవి మిలియన్‌ డాలర్ల ప్రశ్నలు.. ఈ తరానికి అంతుపట్టని తెలియని ప్రశ్నలు.. అసలు రామాయణమే లేదని, ఇది కేవలం ఒక మిథ్యావాదమని, కల్పిత కావ్యమే తప్ప, చరిత్ర కాదని చెప్పేవాళ్లు ఎక్కువమందే ఉంటారు.. కానీ, రామాయణ కాలం ఇప్పటికే విస్పష్టమైంది.. టైమ్‌తో సహా తేలింది.

28 వ మహాయుగంలో ఉన్నాం

28 వ మహాయుగంలో ఉన్నాం

ప్రస్తుతం మనం 28వ మహాయుగంలో ఉన్నాం.. రామాయణం 26వ మహాయుగంలోని త్రేతాయుగంలో జరిగిందని వాల్మీకి రామాయణం చెప్పుకొచ్చింది. ఒక మహాయుగం అంటే కృత, త్రేత, ద్వాపర, కలి యుగాలన్నమాట. ఒక మహాయుగం అంటే 4 లక్షల 32 వేల సంవత్సరాలు. అంటే ఒక్కో యుగం లక్షా ఎనిమిది వేల సంవత్సరాలన్నమాట.

10 లక్షల సంవత్సరాల క్రితం

10 లక్షల సంవత్సరాల క్రితం

ఈ ప్రకారం చూస్తే, రామాయణం పది లక్షల సంవత్సరాల క్రితం జరిగింది.రామాయణానికి సంబంధించిన రుజువులు అన్నీ దొరికాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌ జిల్లాలోని అయోధ్యలో రాముడి జన్మస్థలాన్ని విక్రమాదిత్యుడు కనుగొని గొప్ప ఆలయాన్ని నిర్మించాడు.. రామాయణంలో పేర్కొన్న సరయూ నదీతీరం, సాకేతపురి అన్నీ ధృవీకరణ జరిగాయి. లంకలో రావణాసురుడి ఆనవాళ్లు స్పష్టంగా లభించాయి. అన్నింటికీ మించి రాముడు లంకకు నిర్మించిన సేతువు ఇవాళ్టికీ 30 కిలోమీటర్ల మేర మనకు కనిపిస్తూనే ఉంది. ఇవన్నీ మానవ నిర్మితాలని, ప్రపంచ అతి ప్రాచీన నాగరికతకు గుర్తులని, ఇంటర్నేషనల్‌ సైంటిస్టులే గుర్తించారు..

రాముడు అయోధ్య నుంచి లంక వరకు

రాముడు అయోధ్య నుంచి లంక వరకు

అటు హంపి దగ్గర కిష్కింధలోనూ, తిరుమలలోని అంజనాద్రిపైనా, నాసిక్‌, చిత్రకూటం ఇలా రాముడు అయోధ్య నుంచి లంక వరకు ప్రయాణించిన మార్గమంతటా ఏవో ఒక గుర్తులు మనకు కనిపిస్తాయి. రాముడు దేవుడనే విషయాన్ని కాసేపు పక్కన పెడదాం.. రాముడు ఒక మనిషి.. మనిషిగానే పుట్టాడు.. మనిషిగానే పెరిగాడు.. మనిషిగానే కష్టసుఖాలన్నీ అనుభవించాడు. రాజుగా ప్రజల్ని పరిపాలించాడు.

కష్టాల్లో, సుఖాల్లో ఎలా ముందుకు సాగాలి

కష్టాల్లో, సుఖాల్లో ఎలా ముందుకు సాగాలి

ఒక మనిషిగా జన్మించాక, అతని వ్యక్తిత్వం ఎలా ఉండాలి.. ఎలాంటి జీవితాన్ని గడపాలి.. బంధుమిత్రులతో ఎలా ఉండాలి.. ప్రజలతో ఎలా మమేకం అయిపోవాలి.. కష్టాల్లో, సుఖాల్లో ఎలా ముందుకు సాగాలి అన్న వాటిని ఆచరించి చూపించిన వాడు రాముడు. తల్లి దండ్రుల గారాల పట్టి అయిన రాముడు 17ఏళ్ల వయసులోనే విశ్వామిత్రుడి వెంట వెళ్లమంటే మారు మాటాడకుండా వెళ్లాడు.. రేపు పట్టాభిషేకం అనగా పద్నాలుగేళ్లు వనవాసం చేయమంటే అలాగే అంటూ వెళ్లిపోయాడు.

పెళ్లి చేసుకున్న రెండు నెలలకే

పెళ్లి చేసుకున్న రెండు నెలలకే

తల్లిదండ్రులను దైవంగా భావించటానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదు. ఇవాళ పెళ్లి చేసుకున్న రెండు నెలలకే తల్లిదండ్రుల్ని కాదని రాత్రికి రాత్రి ఇల్లు వదిలేసే సంతానాన్ని మనం చూస్తున్నాం. జననీ, జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అన్నది ఈ రాముడే.. కన్నతల్లి, కన్నభూమి స్వర్గంతో సమానమన్నాడు.. అందుకే ఆయన ఆదర్శరాముడయ్యాడు.

దాయాదుల పోరు జరగలేదు

దాయాదుల పోరు జరగలేదు

అన్నగా తమ్ముళ్లపై అపారమైన ప్రేమను కురిపించిన వాడు. ఆయన తమ్ముళ్లు కూడా అదే విధంగా అన్నపట్ల ప్రేమతో ఉన్నారు.. తల్లులు వేరైనా ఏనాడూ కూడా దాయాదుల పోరు జరగలేదు. సీతాపహరణం తరువాత సుగ్రీవుడితో స్నేహం కుదిరాక ఆ స్నేహాన్ని నిలబెట్టుకుని తమ్ముడి భార్యను అపహరించిన వాలిని సంహరించాడు.

వాలిని అందుకే అలా చంపాడు

వాలిని అందుకే అలా చంపాడు

వాలిని చెట్టు చాటు నుంచి చంపాడు రాముడు. అంతటి వీరుడు చెట్టుచాటు నుంచి ఎందుకు చంపాల్సి వచ్చింది? దీనికి రకరకాల సమాధానాలు ఉన్నాయి. ఎవరికి తోచిన జవాబులు వాళ్లుచెప్పుకొచ్చారు. జంతువును చెట్టుచాటునుంచి చంపటం తప్పుకాదన్నారు. వాలిలో ఒక గొప్ప శక్తి ఉంది.. ఆయన ముందు ఎవరు నిలబడ్డా.. ఆయన్ను చూసిన వెంటనే మెస్మరైజ్‌ అయిపోతారు.. ఎదుటివారిలో శక్తి సగానికి సగం తగ్గిపోతుంది. ఇది ఒకరకంగా హిప్నటిజం లాంటిదే.. ఇప్పుడంటే హిప్నటిజంలో ఎదుటి వ్యక్తి అనుమతితో అతణ్ణి మెస్మరైజ్‌ చేస్తారు. ఆనాడు వాలి సూపర్‌ హిప్నాటిస్టి అన్నమాట.

ఉదాత్త పురుషుడు

ఉదాత్త పురుషుడు

పడవపై దాటించిన గుహుడు, ఎంగిలి పళ్లను ఇచ్చిన శబరి, సీత జాడ చెప్పిన జటాయువు, సేతు నిర్మాణ సమయంలో ఉడుత, శరణు కోరిన శత్రువు తమ్ముడు, చివరకు తొలి రోజు యుద్ధంలో నిరాయుధుడైన రావణున్ని సైతం వదిలేసిన ఉదాత్త పురుషుడు కాబట్టే ఆయన అన్నింటా అందరికీ, తరతరాలకు, యుగయుగాలకు ఆదర్శమయ్యాడు..

క్లీన్‌చిట్‌ కోసమే అగ్నిప్రవేశం

క్లీన్‌చిట్‌ కోసమే అగ్నిప్రవేశం

రావణ వధ తరువాత సీతాదేవిని అగ్నిప్రవేశం చేయించాడు రాముడు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది రాముడనే వ్యక్తి మరి కొద్ది రోజుల్లో రాజుగా పట్టాభిషేకం పొందనున్నాడు. అంటే పబ్లిక్‌ లైఫ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడని అర్థం. పబ్లిక్‌ లైఫ్‌లో అడుగుపెట్టే వ్యక్తి జీవితానికి క్లీన్‌చిట్‌ అనేది ముఖ్యం. ఒకసారి పబ్లిక్‌ లైఫ్‌లో అడుగుపెట్టాక ప్రజలే సర్వస్వం కావాలే తప్ప వ్యక్తిగతానికి ఎలాంటి ఆస్కారం ఉండదు. అందుకే ఆ క్లీన్‌చిట్‌ కోసమే అగ్నిప్రవేశం చేయించాడు. ఇవాళ్టికీ మన పల్లె సమాజాల్లో నిప్పులపై నడిచే సంప్రదాయాలు ఉన్నాయి. ఒక పాలకుడిగా ప్రజల అభిప్రాయాలకు ఎంత గౌరవం ఇవ్వాలో ఆనాడే ఆయన ఆచరించి చూపాడు.. కాబట్టే ఆయనది రామరాజ్యంగా ఇవాల్లికీ చెప్పుకుంటున్నారు.

తగినట్లుగానే, రాముడు

తగినట్లుగానే, రాముడు

పట్టాభిషేకం తరువాత 11వేల సంవత్సరాల పాటు రాముడు ఈ భూమిని పరిపాలించి తిరిగి వైకుంఠానికి వెళ్లిపోయాడట. రాముడి నిజమైన వ్యక్తిత్వాన్ని వాల్మీకి మాత్రమే ఆవిష్కరించాడు.. ఆ తరువాత వచ్చినవన్నీ పుక్కిటి పురాణాలే. ఇక ఏటా చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామనవమిని జరుపుకోవడం హైందవులకు ఆనవాయితీగా వస్తోంది. అందుకు తగినట్లుగానే, రాముడు త్రేతాయుగంలో జన్మించారనీ, ఇన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన పుట్టి ఉంటారనీ కొందరు అంచనాలు కూడా వేస్తూ వచ్చారు.

శ్రీరాముని జన్మసమయాన్ని ప్రకటించారు

శ్రీరాముని జన్మసమయాన్ని ప్రకటించారు

కానీ ఇటీవలి కాలంలో పుష్కర్‌ భట్నాగర్, ఆయన స్నేహితురాలు సరోజ్‌ బాల ఈ విషయం మీద చేసిన పరిశోధన విస్తృతంగా ప్రచారాన్ని పొందింది. భారతీయ రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్ ఎస్)లో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న ఈ ఇద్దరూ కూడా పురాణాలనీ, జ్యోతిష్యాన్నీ, ఖగోళ శాస్త్రాన్నీ దృష్టిలో ఉంచుకుని శ్రీరాముని జన్మసమయాన్ని ఆ మధ్య ప్రకటించారు.

సైంటిఫిక్ గా కూడా కొన్ని తేదీలు రుజువయ్యాయి

సైంటిఫిక్ గా కూడా కొన్ని తేదీలు రుజువయ్యాయి

అలాగే మహాభారత యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? అశోక వనంలో సీతను హనుమంతుడు ఎప్పుడు కలిశాడు?.. ఈ తేదీలు, సంవత్సరాలు, సమయం మనం పురణాల ప్రకారం కొన్ని చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే సైంటిఫిక్ గా కూడా కొన్ని తేదీలు రుజువయ్యాయి. కాకపోతే, అవే తేదీలని కచ్చితంగా నిర్ధారించలేకపోయారు. అయితే, ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చి మాత్రం ఆ తేదీలను కచ్చితంగా చెప్పగలమంటోంది.

శ్రీరాముడు జన్మించింది క్రీస్తు పూర్వం 5114లో

శ్రీరాముడు జన్మించింది క్రీస్తు పూర్వం 5114లో

శ్రీరాముడు జన్మించింది క్రీస్తు పూర్వం 5114 సంత్సరం జనవరి 10, 12.05 గంటలకు. మహాభారతయుద్ధం ప్రారంభమైన సంవత్సరం క్రీస్తు పూర్వం 3139, అక్టోబర్ 13. రావణుడు అపహరించుకుపోయిన సీతాదేవిని అశోకవనంలో హనుమంతుడు కలిసిందెప్పుడంటే..క్రీస్తు పూర్వం 5076, సెప్టెంబర్ 12వ తేదీన అని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చి చెబుతోంది. ఈ విషయాలన్నింటిని‘యునిక్ ఎగ్జిబిషన్ ఆన్ కల్చరల్ కంటిన్యుటీ ఫ్రమ్ రుగ్వేద టు రోబోటిక్స్'లో పెట్టింది.

రాముడిది కర్కాటక లగ్నమని చెబుతారు వాల్మీకి

రాముడిది కర్కాటక లగ్నమని చెబుతారు వాల్మీకి

శ్రీరాముని జన్మసమయం గురించి పరిశోధన చేసేందుకు పుష్కర్‌ భట్నాగర్‌, అమెరికా నుంచి ‘ప్లానెటోరియం' అనే సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారు. ఈ సాఫ్ట్‌వేర్‌ సాయంతో ఏ రోజున గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చునట. శ్రీరాముడు పుట్టిన సమయంలో గ్రహాల స్థితి ఎలా ఉందో వాల్మీకి బాలకాండలో ఎలాగూ వర్ణించారు. రాముడిది కర్కాటక లగ్నమని చెబుతారు వాల్మీకి. ఆయన జన్మసమయంలో సూర్యుడు మేషంలోను, కుజుడు మకరంలో ఉన్నాడనీ.... రాములవారి జన్మకుండలిలోని గ్రహసంచారాన్ని రాసుకొస్తారు. ఈ సమాచారాన్నంతా సాఫ్ట్‌వేర్‌ సాయంతో క్రోడీకరించిన పుష్కర్‌ భట్నాగర్‌కు సదరు జన్మ సంవత్సరం తేలింది.

ఎప్పటికీ ఆదర్శనీయుడే

ఎప్పటికీ ఆదర్శనీయుడే

ఇక చాంద్రమానం ప్రకారం ఆ రోజు చైత్రశుద్ధ నవమి అని తేలడంతో, ఆయన వాదనకు బలం చేకూరినట్లైంది. ఇంతేకాదు! రామాయణంలో ఉట్టంకించిన గ్రహస్థితులను బట్టి... రాములవారు అరణ్యావాసం చేసిన సమయం (5089 BC), హనుమంతుడు సీతను లంకలో కలుసుకున్న సంవత్సరం (5076 BC) తదితర కాలాలను కూడా నిర్ణయించామంటున్నారు భట్నాగర్‌. భట్నాగర్‌ చెబుతున్న విషయాలతో అందరూ ఏకీభవిస్తున్నారనుకోవడానికి లేదు. కానీ రాముడు మాత్రం ఎప్పటికీ ఆదర్శనీయుడే.

English summary

was lord rama born on 10th january 5114 BC

was lord rama born on 10th january 5114 BC
Story first published:Friday, July 6, 2018, 12:33 [IST]
Desktop Bottom Promotion