Latest Updates
-
వంట చేసే ఓపిక లేదా? కేవలం 10 నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి నువ్వుల రైస్ చేసి చూడండి, టేస్ట్ అదుర్స్! -
కుజ-గురు కలయికతో ద్విద్వాదశ యోగం..ఈ 4 రాశులకు అడుగడుగునా అదృష్టమే! -
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏదో తెలుసా?.. 90% మంది తప్పుగానే చెప్తారు! -
Jeera Biscuits Recipe:హెల్తీ, టేస్టీ జీరా బిస్కెట్స్..బేకరీని మించిన రుచితో ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
బ్రకోలీ, బాదంతో సూపర్ హెల్తీ పాస్తా..రుచి చూస్తే వదిలిపెట్టరు! -
3 నిమిషాల మ్యాజిక్..ఈ చిన్న పనితో 13 రకాల క్యాన్సర్లకు చెక్! -
ఈ ఐదు లక్షణాలు ఉంటే మీ భర్త బంగారమే.. మరి మీవారిలో ఈ గుణాలు ఉన్నాయా.? -
కర్ణాటక స్పెషల్ వాంగి బాత్ పొడి..ఒక్కసారి చేస్తే 4 నెలలు నిల్వ..బోర్ కొట్టించే కూరలు కూడా అమృతమైపోతాయ్.. -
కృష్ణాష్టమి స్పెషల్: చిన్ని కన్నయ్యకి ఎంతో ప్రీతికరమైన అటుకుల లడ్డూ.. చక్కెర లేకుండా భలే రుచిగా.! -
పుట్టుకతోనే అదృష్టవంతులు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాజ యోగం ఉన్న రాశులు ఇవే!
భోజనం చేసేటప్పుడు ఈ నియమాలను పాటిస్తున్నారా..? లేకపోతే నష్టమే..!
కోటి విద్యలు కూటి కొరకేనని అంటారు. ఎన్ని విద్యలు చదివినా, ఎన్ని వ్యాపారాలు చేసినా అది కూటికొరకే. అన్నం పరబ్రహ్మ స్వరూపము. అన్నం తినే సమయంలో కూడా ప్రత్యేక నియమాలను పాటించాలి. శాస్త్రం ప్రకారం అన్నం తినేటప్పుడు కొన్ని తప్పులను చేయవద్దు. ఒకవేళ ఆ తప్పులు గనక చేస్తే తీవ్ర నష్టం జరుగుతుంది.
హిందూ శాస్త్రంలో ప్రతీవిషయం గురించి కూడా వున్నది. కింద కూర్చొని భోజనం చేయడమనే పద్ధతి హిందువుల్లో మాత్రమే వుంది. ఇలా తినడం వల్ల జీర్ణ క్రియ కూడా బాగా జరుగుతుంది. తినేటప్పుడు కొన్ని పద్ధతులను పాటించాలి. దీని వెనక ఎన్నో శాస్త్రీయ ప్రయోజనాలు వున్నాయ్. ఇలాంటి పద్ధుతులను మూఢనమ్మకాలుగా కొట్టిపారేయవద్దు. పండితులు చెప్పిన వాటిని చెప్పినట్టు ఆచరిస్తే కచ్ఛితంగా శుభం జరుగుతుంది. భోజనాన్ని ఎలా తినాలనే దాని గురించి కూడా పండితులు చెప్పారు. ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. భోజనం చేసేటప్పుడు చొప్పులను వేసుకోవద్దు. శుభాకార్యాల్లో, పెళ్లిల్లలో, గృహప్రవేశంలో కూడా భోజనం చేసే సమయంలో చెప్పులూ, షూస్ వేసుకోవద్దు. పూర్వ కాలంలో బంతి భోజనాలు చేసేవారు. చేతులు, కాళ్లూ శుభ్రంగా కడుక్కొని వచ్చి చాప మీద కూర్చొని అరటాకులో పంచభక్ష పరమన్నాలు వడ్డిస్తే తినే వారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బఫ్ఫే సిస్టమ్‌లో చెప్పులు వేసుకొని నడుస్తూ, నిలబడుతూ తింటూ వున్నారు. అన్నం తినేటప్పుడు అన్నపూర్ణేశ్వరికి గౌరవం ఇవ్వాలి.
2. కొంతమంది కాళ్లమీద కాళ్లు వేసుకొని భోజనం చేస్తుంటారు. ఇది కూడా సరైన పద్ధతి కాదు. కళ్లు సరిగ్గా పెట్టుకొని కూర్చొని చెప్పులు విడిచి భోజనం చేయాలి. హోటళ్లలో అయినా సరే చెప్పులు వేసుకొని భోజనం చేయవద్దు. ఎప్పుడు భోజనం చేయడానికి కూర్చున్నా అన్నపూర్ణేశ్వరీ దేవికి నమస్కారం చేసి కూర్చోవాలి.
3. భోజనం చేసేటప్పుడు దక్షిణంవైపు తిరిగి భోజనం చేయకూడదు. ఏ పరిస్థితిలో కూడా ఈ వైపున తిరిగి భోజనం చేయకూడదు. భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దను చేతిలో తీసుకొని కళ్లకు అద్దుకొని పక్కకు పెట్టి ఆ తరువాత భోజనం చేయాలి. పక్కక్కు పెట్టిన ఈ ముద్దను గోడమీద కాకులకు, లేదంట ఇంటి ముందు వున్న కుక్కలకు పెట్టాలి.

4. భోజనం చేసిన తరువాత అదే కంచంలో చేయి కడగవద్దు. బయట ఎక్కడైనా సింక్ దగ్గర చేయి కడగాలి. కొంతమంది చాలా అసహ్యంగా భోజనం చేసిన ప్లేటులోనే వుంచడం చేస్తుంటారు. ఇది కూడా చాలా చెడ్డ అలవాటు. దీనిని కూడా మానుకోవాలి.
5. భోజనం తిన్న తరువాత ప్లేటును వెంటనే కడిగివేయాలి. అలాగే పెట్టడం వల్ల ఉదయం వరకు బొద్దింకలు, ఈగలు మూగి చాలా దరిద్రంగా పరిస్తితి తయారౌతుంది. ఎప్పుడు తిన్న కంచాన్ని అప్పుడే కడిగేయడం చాలా శుభప్రదం.
6. భోజనం చేసిన తరువాత చేయిని చక్కగా తుడుచుకోవాలి. కొంతమంది చేయిని విదిలిస్తూ వుంటారు. అలా చేయడం దరిద్రమని పండితులు చెబుతున్నారు. ఈ తప్పులను ఎప్పుడూ చేయవద్దు. పిల్లలకు వీటిని చెప్పి పాటించే విధంగా చేయాలి. పెద్దలు పాటించినప్పుడు పిల్లలు పాటిస్తారు.
అన్నపూర్ణాదేవి ఆశీస్సులు వుండాలంటే కచ్ఛితంగా పైన చెప్పిన వాటిని పాటించాలి. అన్నపూర్ణాదేవి అనుగ్రహం వుంటే తినడానికి లోటు వుండదు.



Click it and Unblock the Notifications