Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
ఇంట్లో దుష్టశక్తులు వున్నాయో లేదో ఇలా తెలుసుకోండి..?
అన్నీ కంటికి కనిపించవు. కంటికి కనిపించేవే నిజం కావు. ఆత్మలు వుంటాయ్ కానీ అవి ఏయంత్రానికి కూడా చిక్కనంత సూక్ష్మంలో వుంటాయ్. నెగటివ్ ఎనర్జీ కూడా అలాంటిదే. ఈ నెగటివ్ ఎనర్జీనే హిందూ శాస్త్రంలో దుష్ట శక్తి అని అంటారు. ఈ దుష్ట శక్తి మనిషి శరీరంలో వుండొచ్చు, ఇంట్లో కూడా వుండవచ్చు. అయితే ఈ నెగటివ్ ఎనర్జీ వున్నట్లు మనకు నేరుగా తెలియదు. వాటిని కనుక్కునే యంత్రాలు కూడా లేవు. కానీ కొన్ని సూచనలు, సంకేతాల ద్వారా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వున్నట్లు మనకు తెలిసిపోతుంది. ఈ నెగటివ్ ఎనర్జీ గురించి పండితులు ఎన్నో ఏళ్ల క్రితమే చెప్పారు.
ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందనడానికి బయట పండితులను ఇంట్లోకి తీసుకొని రానవసరం లేదు. దీని గురించి తెలుసుకనేందుకు వెలకు వేలు కూడా ఖర్చు చేయనవసరం లేదు.
1. అందరి హిందువుల ఇళ్లు వాకిట్లో తులసి చెట్టు వుంటుంది. ఆ తులసి చెట్టు గనుకు తరచూ వాడిపోతు వుంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వున్నట్టే. సకల దేవతల స్వరూపము తులసి చెట్టు. ఎన్ని తులసి మొక్కలు తెచ్చినా తరచుగా వాడిపోతూ వుంటే నెగటివ్ ఎనర్జీ వున్నట్లు అర్థం చేసుకోవాలి.

2. ఇల్లు కట్టిన రెండేళ్ల తరువాత గోడలు చీలిపోతూ వుంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వుందనడానికి సంకేతం. వంటింల్లో వున్న వంటపాత్రలు వాటంతట అవే కింద పడిపోవడం, శబ్దం చేయడం చేస్తూ వుంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ కచ్ఛితంగా వున్నట్టేనని అనుకోవచ్చు.
3. దేవుడికి పూజ చేస్తున్నప్పుడు ఏ గాలి రాకుండా కూడా దీపాలు కొండెక్కితే నెగటివ్ ఎనర్జీ వల్లే జరిగిందని అర్థం చేసుకోవాలి. పూజకు సంబంధించిన పసుపు కుంకుమ గిన్నెలను ఎంత జాగ్రత్తగా పట్టుకున్నప్పటికీ అవి కిందపడిపోయినప్పుడు నెగటివ్ ఎనర్జీ వుందని అర్థం చేసుకోవాలి. ఒక రోజూ పూజలో చాలా సార్లు పసుపూ కుంకుమ గిన్నెలు కిందపడిపోతూ వుంటే నెగటివ్ ఎనర్జీ విపరీతంగా వుందని పండితులు చెబుతున్నారు.
4. ఇంట్లో అక్వేరియం గనక వుండి ఆ ఇంట్లో చేపలు ఒక్కొక్కటిగా చనిపోయినా లేదా అన్ని చాపలూ ఒకేసారి చనిపోయినా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వుందని అర్థం చేసుకోవాలి. వంటింట్లో, పడక గదిలో బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూవుంటే ఇంట్లో దరిద్ర దేవత కాలుపెట్టిందని అర్థం. దరిద్రదేవతకు బొద్దింకలు మారురూపము అని పెద్దలు ఎప్పుడో చెప్పారు.
5. ప్రతీ రోజూ భయంకరమైన కలలు వస్తూ వుంటే, నిత్యం భయపడుతుంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వుందని అర్థం చేసుకోవాలి.
ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వుందని ఎలా తెలుసుకోవాలి ?

ఒక గాజు గ్లాసు నిండా నీళ్లు పోసి అందులో పిడికెడ్ ఉప్పును శివనామస్మరణ చేసుకుంటూ పోయాలి. ఉప్పు కరిగిపోయిన తరువాత ఆ గాజు గ్లాసుపై మూత పెట్టి దానిని ఇంట్లో వున్న నైరుతి దిక్కుల్లో రాత్రి వుంచాలి. ఉదయం లేచిన తరువాత గ్లాసు లోని నీళ్లు నల్లగా మారితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మామూలుగా వున్నట్లు, అవే నీళ్లు పసుపు రంగులో మారితే నెగటివ్ ఎనర్జీ విపరీతంగా ఇంట్లో వ్యాపించి వున్నట్లు అర్ధం చేసుకోవాలని ప్రముఖ పండితులు మనకు హెచ్చరిస్తున్నారు.



Click it and Unblock the Notifications