Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్!
Akshaya Tritiya 2024 : అక్షయ తృతీయ రోజూ చేయకూడని పనులు..లేదంటే..
ఈ సంవత్సరం అక్షయ తృతీయను మే10వ తేదీన జరుపుకోబోతున్నాం. తెలుగు పంచాంగం క్యాలెండర్ ప్రకారం ఈ అక్షయ తృతీయ, వైశాఖ మాసంలోని శుక్లపక్షం తృతీయ తిథి రోజు వస్తుంది. శుభకార్యాలు చేయడానికి, బంగారం కొనడానికి ఇదే అనువైన శుభమైన దినమని పురాణాలు శాస్త్రం చెబుతున్నాయ్. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవీని ఆరాధిస్తాం. సిరిసంపదలు కలిగించమని ఆ దేవతను కోరుకుంటాం. అయితే లక్ష్మీ దేవీ పూజ రోజున చేయకూడని పనులు ఉంటాయ్. ఆ పనులను చేస్తే లక్ష్మీదేవి పూజకు ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి అక్షయ తృతీయ నాడు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం.
అక్షయ తృతీయ రోజూ చేయకూడని పనులు..
పరిశుభ్రత
అక్షయ తృతీయ రోజు ఇంటిని పరిశుభ్రంగా వుంచుకోవాలి. ఉదయమే లేచి ఇంటిని మొత్తం శుభ్రంగా కడిగేసుకోవాలి. దుమ్ము, మురికి ఉన్న ప్రదేశంలోకి లక్ష్మీ దేవీ రాదు. కాబట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఇంటిని ఇంటి పరిసరాలను శుభ్రంగా వుంచుకోవాలి.
తులసి ఆకులను సమర్పించవద్దు
శ్రీమహావిష్ణువుకు తులసి ఆకులు ఇష్టమైనా ఏకాదశి నాడు ఆయనకు సమర్పించవద్దు ఎందకంటే ఆరోజు ఆయనకోసం తులిసి ఆకులను తెంపుతారు కాబట్టి. అలాగే లక్ష్మీ దేవికి కూడా తులసి ఆకులను సమర్పించవద్దు. అలా చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయ్.

డబ్బు బంగారం, జాగ్రత్త
అక్షయ తృతీయ నాడు బంగారం, డబ్బు పోగొట్టుకుంటే అశుభంగా పరిగణిస్తారు. ఇంట్లో ఉన్న బంగారం, డబ్బును అక్షయ తృతీయ రోజున జాగ్రత్తగా దాచుకోవాలి. ఖర్చులు కూడా అనసవరంగా చేయవద్దు.
ప్లాస్టిక్, అల్యూమినయం
ప్లాస్టిక్ అల్యూమీనియం వస్తువులు రాహువుకు సంకేతంగా రాహువు బలపడ్డానికి కారణంగా భావిస్తారు కాబట్టి ఆ రోజు ఈ వస్తువలు కొనవద్దు. బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేయాలి. స్టీల్, అల్యూమీనియం అస్సలు కొనవద్దు.
మద్యం, ఉల్లిపాయలకు దూరం
అక్షయ తృతీయరోజు తామసికమైన ఆహారానికి దూరంగా ఉండాలి. మద్యం, మాంసం ఇవి తమాసికమైనవి కాబట్టి వీటిని కనీసం తాకకూడదు. ఎల్లిపాయ, వెల్లుల్లికి కూడా తామస గుణాలు ఉంటాయ్ గనుక వీటిని కూడా తినరాదని పండితులు చెబుతున్నారు. కోపానికి రావద్దు, గొడవలకు దిగవద్దని కూడా సూచిస్తున్నారు.
సాయంత్రం శుభ్రం చేయడం అశుభం
కొందరు ఇంటిని సాయంత్రం శుభ్రం చేస్తారు. సాయంత్రం చీపురుతో ఊడుస్తారు, అప్పుడే ఇంటిని తుడుస్తారు. ఇలాంటి పనులను కూడా వద్దంటున్నారు. లక్ష్మీదేవి చీపురులో ఉంటుందని పురాణాలు చెబుతున్నాయ్. ఉదయం ఊడిచే కార్యక్రమాలు పెట్టుకుంటే లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుందని పండితులు అంటున్నారు.



Click it and Unblock the Notifications